తూర్పూ పడమర – 3

కొవ్వలి సత్యసాయి
      ………………….. ……….                

బ్లాగరులు ఒకరితో ఒకరు కబుర్లు చెప్పుకుంటే, దాన్ని పాఠకుల కోసం ప్రచురిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన ఫలితమే ఈ తూర్పూ పడమర! కొరియా కబుర్లతో నెజ్జనులను అలరించిన కొవ్వలి సత్యసాయి గారిని, కొత్తపాళీ గారిని కబుర్లు చెప్పుకోమన్నాం. గూగుల్ టాక్‌తో ప్రాక్పశ్చిమాలకు వారధి నిర్మించి వారిద్దరూ మాటలు కలిపారు. వారి కబుర్లలో మూడో భాగం వినండి. రెండో భాగం ఇక్కడ, మొదటి భాగం ఇక్కడా ఉన్నాయి.

———

సత్యసాయి: ఒక అమెరికా ఆయన మా వివి మేగజైన్ లో వివి లో సీరియస్ నెస్ లేకపోవడాన్ని తిట్టాడు
కొత్తపాళీ: ఆయనకి ఏఁవి సీరియెస్నెస్ కావలిట?
సత్యసాయి: కొరియావాళ్ళు మ్యూజిక్ చాలా ఇష్టపడతారు. వివి లో ఎప్పుడూ పండగ వాతావరణమే

ఈ కబుర్లు చెప్పుకోవటంలో తమ అనుభవాలు, కొవ్వలి సత్యసాయి గారి మాటల్లో.. వచ్చే సోమవారం!

కొత్తపాళీ: కానీ అతనన్నది నిజమే. క్లాసుల్లోనూ, చదువుకి సంబంధించిన సందర్భాల్లోనూ వీళ్ళు చాలా గంభీరంగానే ఉంటారు. నేను అధ్యాపక సహాయకుడిగా కొన్ని అండర్‌గ్రాడ్యుయేట్ క్లాసులు చెప్పాను .. జోకేసినా జనాలు నవ్వేవాళ్ళు కాదు! ఎక్కడి మ్యూజిక్?
సత్యసాయి: ఎక్కువ పాప్. సాయంత్రం అయితే వాళ్ళ సాంప్రదాయ వాయిద్యాలతో వివిని మ్రోత మోగిస్తారు
కొత్తపాళీ: అలాగా? సంతోషం! ఇక్కడ ఏ పండగ చేసినా వారాంతాల్లో మాత్రమే.
సత్యసాయి: ఒకసారి టీవీలో హిందీపాట పాడారు
కొత్తపాళీ: నిజమా???
కొత్తపాళీ: పిల్ల, అంటే విద్యార్ధుల, సంగీత బృందాలు బాగానే ఉంటాయ్. వివి చుట్టుపక్కల బార్లలో క్లబ్బుల్లో ఈ పిల్ల బృందాలకి ఛాన్సిస్తూ ఉంటారు. ఇది కాక వివికి సంబంధించిన విద్యార్ధి సంఘాల పార్టీలు.
సత్యసాయి: వీళ్ళ పాతకాలం పాటలు రవీంద్ర సంగీతానికి దగ్గర పోలికలు కనిపిస్తాయి
కొత్తపాళీ: Interesting
సత్యసాయి: వీళ్ళ పాతపాటలు ఎక్కువ యుధ్ధం, విడిపోవడం- మెలాంకొలీ- నేపధ్యంలో ఉంటాయిట
కొత్తపాళీ: అవును. చైనీయులు కూడా అంతే.
కొత్తపాళీ: సంస్కృతికంగా చాలా వరకూ చైనా నించి దిగుమతి చేసుకున్నారేమో కదా? చైనీయ సాంప్రదాయ సంగీతం తొంభై శాతం మోహన రాగానికి విభిన్న రూపాలే.
సత్యసాయి: అన్నట్లు మా వివి లో చైనా వివి వాళ్ళు వచ్చి శాస్త్రీయ కచ్చేరీ ఇచ్చారు.
సత్యసాయి: అమ్మాయిలు లంగా జాకెట్ల తో వచ్చి మన హిందోళం గట్రా రాగచ్ఛాయలతో భలే వీనుల విందు (కనులకు కూడా) చేసారు
కొత్తపాళీ: వేషాలు కూడ వేసుకున్నారా? ఆపెరా లాగా?
సత్యసాయి: వేషాలు కాదు వాళ్ళ సాంప్రదాయ దుస్తులట
కొత్తపాళీ: అలాగా? బాగుంది.
కొత్తపాళీ: నేను ఏనార్బరు వచ్చాక విదేశీ (ఎక్కువ జపనీయ) ప్రదర్శనలు బాగా చూశాను. అన్నట్టు నా మొదటి సంవత్సరంలో ఒక తైవానీయుడి సిద్ధాంత గ్రంధం ఇంగ్లీషు దిద్దిపెట్టాను. కృతజ్ఞతగా అతను చైనా టవును (ఫిలడెల్ఫియాలో బుల్లి చైనా టవును ఉండేది) దింసం మధ్యాన్న భోజనం తినిపించాడు. ఏం తిన్నానో గుర్తు లేదుగానీ మొత్తానికి చాలా వింత రుచులు రుచి చూసినట్టు గుర్తు.
కొత్తపాళీ: ఫిలడెల్ఫియా నగర ఆర్కెస్ట్రా ప్రపంచ ప్రఖ్యాతి గన్నది.
సత్యసాయి: ఊఁ
కొత్తపాళీ: హాలు కూడా బహు పురాతనమైనది, అద్భుతమైన ధ్వని నిర్మాణము (acoustics). కొంతమంది మహానుభావుల సంగీతం వినే అవకాశం దక్కింది అక్కడ.
సత్యసాయి: ఆఁహాఁ
కొత్తపాళీ: ఫిలడెల్ఫియా నగరం మధ్యలో ఫెయిర్‌మౌంట్ పార్క్ అని ఒక పేద్ధ పార్కు. ప్రపంచంలో ఒక నగరం మధ్యలో అంత పెద్ద పార్కు ఇదేనట. పైన కప్పు మాత్రం ఉండి, చుట్టూ గోడలు లేని ఆడిటోరియం ఒకటి ఆ పార్కులో ఉంది. దీన్ని మాన్ సెంటర్ అంటారు. ఆర్కెస్ట్రా వాళ్ళు వేసవిలో ఈ మాన్ సెంటర్లో వారానికి రెండు ప్రోగ్రాములు వాయిస్తారు.
సత్యసాయి: అలాగా
కొత్తపాళీ: వచ్చే వారం ప్రోగ్రాములకి ఈ సోమవారం పేపర్లో ప్రకటన పడేది. ఆ ప్రకటన కత్తిరించి పంపిస్తే, గేలరీలో రెండు టిక్కెట్లు ఉచితంగా ఇస్తారు. అలా చాలా కచేరీలు చూశాను.
సత్యసాయి: ఇదేదో బాగుందే
కొత్తపాళీ: వివి విద్యార్ధులకి సినిమాలకి కూడా కొంత తగ్గింపు ఉండేది. ఐడి చూపిస్తే చాలు. వివి వదిలిపెట్టక, ఉద్యోగం వచ్చాక, పూర్తి ఖరీదు పెట్టి సినిమా టిక్కెట్లు కొనడం చాలా కష్టంగా ఉండేది.
సత్యసాయి: అవును
కొత్తపాళీ: వివి వదిలిపెట్టాక వివి వదిలిపెట్టాక
సత్యసాయి: టికెట్ ధరెంత?
కొత్తపాళీ: అప్పట్లో మామూలు సినిమా ధర ఐదు ఆరు డాలర్లు ఉండేది.
సత్యసాయి: ఖరీదే!
కొత్తపాళీ: ఇప్పుడూ ఎందిన్నర నించీ పది దాకా ఉంది. మీకు తెలుసా, ఇక్కడ హాళ్ళలో ఒకటే క్లాసు, ఒకటే ధర.
కొత్తపాళీ: అవును.
కొత్తపాళీ: ఈలోపల మీరేవన్నా చెప్పండి. నేను కొంచెం నమలడానికి ఏమన్నా తెచ్చుకుంటా.
సత్యసాయి: హతవిధీ- నేల టికెట్ కొని కుర్చీకెగబాకే ఛాన్సు లేదా
సత్యసాయి: మన దేశంలో ప్రాంత భేదాల్లేకుండా లేకి తనం అలవాటు చేసుకున్నామనుకుంటా
కొత్తపాళీ:
సత్యసాయి: కోయిన్ కి దారం కట్టిఅమెరికాలో పబ్లిక్ ఫోన్లనితెగ వాడారని విన్నా
కొత్తపాళీ: ఆఁ కరక్టే. సమయానికి గుర్తు చేశారు.
సత్యసాయి: మా అమ్మ ఫారిన్ రిటర్న్ డు
కొత్తపాళీ: Oh, really?
సత్యసాయి: మా తమ్ముడి దగ్గర ఉండే ఆయా (గుజరాతీ) ఫేమిలీ గురించి తెగ చెప్పేది
కొత్తపాళీ: భారతానికి తక్కువ ఖరీదులో పిలవటానికి కాలింగ్ కార్డులుండేవి.
కొత్తపాళీ: ఎవడో మధ్యవర్తి గాడు, ఎవరివో నెంబర్లని మాలాంటి వాళ్ళకి సగం ధరకి అమ్మేసేవాడు.
కొత్తపాళీ: అది మనం ఏ నంబర్నించి పిలుస్తున్నామో రికార్డు చేసేది. అందుకని మన ఇంట్లోంచి పిలవకుండా వీధి ఫోన్లనించి చేసేవాళ్ళు.
కొత్తపాళీ: అలాగే .. ఫిలడెల్ఫియాలో లోకల్ రైళ్ళుంటాయి. Automatic turnstile దగ్గిర టోకెన్ వెయ్యాలి లోపలికి వెళ్ళేందుకు. జనాలు (మనవాళ్ళే కాదు) దాన్ని కూడా మోసం చెయ్యాలని చూసేవాళ్ళు.
సత్యసాయి: ప్రైవేట్ కాస్ట్, బెనిఫిట్కి పబ్లిక్ కాస్ట్ బెనిఫిట్కీ తేడా వల్ల ఇవే సమస్యలు
సత్యసాయి: క్రియేటివ్ జీనియస్లు: ((
కొత్తపాళీ: ఫిలడెల్ఫియాకి ఒక పది పదిహేను మైళ్ళ దూరంలో లాంగ్వుడ్ గార్డెన్సని ఉంటాయి. ఒకప్పుడు ఆ కుటుంబం వాళ్ళ ఎస్టేటు ఇది, ఇప్పుడు ట్రస్టు కింద పెట్టి పబ్లిక్ జనాల్ని చూడనిస్తున్నారు .. ఊరికే కాదు, టిక్కెట్టు మీదే. చాలా అద్భుతంగా ఉంటుంది. నన్ను చూడ్డానికి వేరే ఊళ్ళనించి వచ్చిన స్నేహితులందర్నీ వరసబెట్టి ఇక్కడికి తీసుకెళ్ళేవాణ్ణి. లేదంటే వాళ్ళ ఆసక్తిని బట్టి నలభై మైళ్ళ దూరంలో ఉన్న అట్లాంటిక్ సిటీ కేసినోలకి! ఒకసారి కాంపూరు సహాధ్యాయిలు ఇద్దరు వొచ్చారు. కేసినోకైతే నేను రాను మీరు పోయిరండి అన్నా. పోయి రాత్రంతా ఆడి తెల్లారి వచ్చారు. ఏవిరా, నష్టం ఎంత అన్నా.
సత్యసాయి: బట్టలున్నాయా
కొత్తపాళీ: ఒక మిలియన్ వంద డాలర్లు అన్నాడు.
సత్యసాయి: ఐమీన్ మిగిలాయా
కొత్తపాళీ: అదే చెబుతున్నా ..
కొత్తపాళీ: ఒక మిలియన్ వందేవిటి అన్నా.
సత్యసాయి: ఊఁ
కొత్తపాళీ: ఏవుందీ. ఒక మిలియనైనా గెలవాలనే సంకల్పంతో వెళ్ళాము. చెరొక యాభయ్యీ పోయినై. అన్నాడు
సత్యసాయి: ఆపర్ట్యూనిటీ కాస్ట్
కొత్తపాళీ: yup
కొత్తపాళీ: ఫిలడెల్ఫియా చాలా చారిత్రాత్మక నగరం, అందమైన నగరం ఐనా, ఎందుకో సినిమాలెక్కువ తియ్యరిక్కడ. కొన్ని ప్రఖ్యాతి గాంచిన సినిమాలకి నేపథ్యం వహించింది. “మన” వాడు ఎం. నైట్ శ్యామలన్ సినిమాలన్నీ నగరంలోనో, నగర శివార్లలోనో జరుగుతుంటాయి.
సత్యసాయి: ఐసీ..
కొత్తపాళీ: టాం హాంక్స్ నటనకి గుర్తింపూ, ఎయిడ్స్ సమస్య మీదికి జనుల దృష్టీ తెచ్చిపెట్టిన సినిమా పేరే “ఫిలడెల్ఫియా” అనుకోండి. కండల యోధుడు సిల్విస్టర్ స్టెల్లోన్ నటించిన “రాకీ” వరుస సినిమాలు కూడా ఈ ఊళ్ళోనే జరుగుతాయి.
సత్యసాయి: ఐసీ
కొత్తపాళీ: కరణ్ జోహార్ ఘోరకృత్యం “కభి అల్విద నా కెహనా”లో క్లైమాక్సు సీను మా వివికి కూతవేటు దూరంలో ఉండే 30వవీధి రైల్వే స్టేషనులో జరుగుతుంది. అవీ ఫిలడెల్ఫియా విశేషాలు.
సత్యసాయి: రామాయణంలో పిడకల వేట. సిల్విస్టర్ స్టెల్లోన్ అనగానే నాకు శ్రీదేవి గుర్తొస్తుంది
కొత్తపాళీ: Huh?
సత్యసాయి: ఆకాలంలో ఆయనంటే ఇష్టమని ఏదో ఇంటర్వ్యూ లో చెప్పింది
కొత్తపాళీ: అలాగా?
సత్యసాయి: చివరికి ”bony” కపూర్ ని చేసుకుంది
కొత్తపాళీ: Now, that is “iron”y!!!
సత్యసాయి: కండలొదిలేసి
కొత్తపాళీ: మీరేవన్నా అడిగేదుంటే అడగండి.
సత్యసాయి: అన్నట్లు మీరు కొత్తపాళీ అని మీ బ్లాగుకి ఎందుకు పెట్టారంటారు.: పాళీయే కొత్తది ఇంకు పాతదే అనా 
కొత్తపాళీ: శ్రీమతి సలహా.
సత్యసాయి: కరణేషు…మంత్రీ. అంటే ఆప్షన్ లేకపోయిందా 
కొత్తపాళీ: అదీ నిజమే అనుకోండి. అనుల్లంఘనీయము గదా ఉత్తమార్ధాజ్ఞ.
కొత్తపాళీ: ఇంతకుముందు నా పేరుతో అంతర్జాలంలో పదేళ్ళ పైబడిన చరిత్ర ఉంది.
సత్యసాయి: కొత్తపాళీ పేరుతోనా?
కొత్తపాళీ: కాదు, నా సొంత పేరుతో.
సత్యసాయి: ఇది వార్తే
కొత్తపాళీ: వార్తేముంది, ఆ పూట ఇస్మాయిల్ (శ్రీకృష్ణదేవరాయలు) తన పరిశోధనతో బయటపెట్టాడుగా!
కొత్తపాళీ: బ్లాగు మొదలు పెట్టినప్పుడు .. ఈ కొత్త ప్రయత్నం ఇదివరకటి చరిత్రతో సంబంధం లేకుండా ఒక కొత్తదనంతో ఉండాలని అనిపించింది.
సత్యసాయి: అలాగా నాకు గుర్తు లేదు.. హతోస్మి
కొత్తపాళీ: ఏం పర్లేదు.
కొత్తపాళీ: మొదట Classical Telugu Poetry in Translation (http: //telpoettrans.blogspot.com) మొదలు పెట్టాను.
కొత్తపాళీ: అప్పుడు బ్లాగరి పేరు Observer Eccentric అని ఉండేది.
కొత్తపాళీ: ఉత్తమార్ధానికి నచ్చలేదు. ఇంతలో ఒక శ్రేయోభిలాషి కూడా చూసి, అంత చక్కటి బ్లాగు రాస్తూ, ఇదేం పేరు అన్నాడు. అప్పటికే మా ఆవిడ కొ.పా.కి లాబీ చేస్తూండింది. తాపీ ధర్మారావు గారి పుస్తకం ఉంది ఈ పేరుతో.
సత్యసాయి: అవును
కొత్తపాళీ: ఆయన తన దృక్పథం ఎలామారుతూ వచ్చిందో, అప్పణ్ణించీ ఆయన రచన కొత్తపాళీ ఎలాగయ్యిందో అని రాసిన పీఠిక నాకు చాలా నచ్చింది. నాక్కూడా వర్తిస్తుందని అనిపించింది. అలా ఖాయం చేశాను. తెలుగు బ్లాగ్గుంపులో ఎప్పుడో ఒకసారి సీబీరావుగారి ప్రశ్నలకి సమాధానంగా ఇదంతా చెప్పాను. పాతపద్యాల అనువాదమే కాక నేను రాయదల్చుకున్న విషయాలు వేరేవి కూడా ఉన్నాయి అనుకుని అప్పుడు కొత్తపాళీ, విన్నవీకన్నవీ ప్రారంభించాను.
సత్యసాయి: ఇప్పుడు బ్లాగర్లు చాలామందయ్యారు – మంచి ట్రెండ్
కొత్తపాళీ: అవును. కానీ జనాల మెప్పుకోసమే కాక బ్లాగర్లు కొంత నిజాయితీతో రాయాలని నా కోరిక. అలాగని ప్రతిదీ హృదయభాను టపా కానక్కర్లేదు. ఈ మధ్య విరివిగా రాస్తున్న వారిలో విశాఖ తీరాన, తెలుగు “వాడి”ని నిశితంగా రాస్తున్నారు.
సత్యసాయి: అవును మెప్పుకోసం కాక మనకోసం మనం వ్రాసుకోవడమే ఉత్తమ పద్ధతి
కొత్తపాళీ: కొత్తగా వస్తున్న మిగతావన్నీ కొంత వినోదాన్ని కలిగిస్తున్నా .. ఒక వ్యక్తిగా ఒక రచయితగా వారి అంతరార్ధమేవిటో, వారి సొంత ఆలోచనేవిటో వ్యక్తం కావట్లేదని నా వేదన. ఆ నిజాయితీ లోనించే సామాజిక ప్రయోజనమూ నెరవేరుతుందని నాకెందుకో వెర్రి నమ్మిక.
సత్యసాయి: అవును
సత్యసాయి: తెలుగుకి అంతర్జాలంలో వచ్చిన ప్రాభవానికి కృషిచేస్తున్నచేసిన వారెందరో మహానుభావులు
కొత్తపాళీ: అవును, చావా కిరణ్, వీవెన్ వంటి వారి కృషి మరువలేనిది.
సత్యసాయి: చాలా సార్లు మనం ఒక్కళ్ళం సరిగా ఉంటే మాత్రం లాభమేమిటి అని మా అమ్మాయి ప్రశ్నిస్తుంది- కనీసం మనవంతు చెత్త తగ్గుతుందని నా భావన
కొత్తపాళీ: ఇవ్వాళ్ళేవిటో కబుర్లలో పడి అలసట కూడా తెలీలేదు. ఇక్కడ పన్నెండుపావు దాటింది. మనం ఇంకో 15 .. 30 నిల్లో ముగిద్దామా?
సత్యసాయి: అలాగే.. ఈవేళకి మనకి చాటింగ్ పద్దతి అబ్బినట్లుంది-
కొత్తపాళీ: అంతే కాదు, కిరణ్ ని చూసి నేనూ బ్లాగు రాయాలనే స్ఫూర్తి పొందినట్టు, మనల్ని చూసి ఇంకొకరు స్ఫూర్తి పొందొచ్చు.
సత్యసాయి: అవును
కొత్తపాళీ: ఇందాక మిమల్ని అడిగాను, మీరింకేవన్నా అడగదల్చుకున్నారా అని.
సత్యసాయి: అడగాను కాబట్టే ఇన్ని విషయాలొచ్చాయికదా
సత్యసాయి: బయటికి
కొత్తపాళీ: అలాగే.
కొత్తపాళీ: నాదొక ప్రశ్న. మీ బ్లాగులో వినిపిస్తున్న నాటకురింజి గురించి చెప్పండి. తెలుగు వారికి ఎంత సేపూ మోహనం, హిందోళం లేకఫొతే ఆనందభైరవి, మధ్యమావతి. ఒక సారెప్పుడో చెవులకి హెడ్ ఫోన్లు పెట్టుకుని మీ బ్లాగు తెరిస్తే నాటకురింజి వయొలిన్ వినబడింది. ఎల్. సుబ్రమణ్యం వాయించిందనుకుంటా. దాని గురించి అప్పటి మీ కొత్త టపాలో వ్యాఖ్య కూడ పెట్టాను.
సత్యసాయి: అదా. అప్పుడు ఒకసారి పెట్టా
కొత్తపాళీ: నాకది బాగా గుర్తుండి పోయింది.
సత్యసాయి: అప్పుడప్పుడు మారుస్తూండాలని అనుకుంటూ నే బద్ధకించా
కొత్తపాళీ: భరతనాట్యంలో ఒక తమిళ వర్ణం ఉంది నటరాజు వైభవాన్ని వర్ణిస్తూ .. చాలా MAJESTIC గ ఉంటుంది. .
కొత్తపాళీ: నా దగ్గిరున్న సంగీతమంతా, చాలా భాగం కేసెట్ల రూపంలో ఉంది. మెల్లగా డిజిటైజ్ చెయ్యాలి
సత్యసాయి: నాకూ అదే ప్రోజెక్ట్ కొన్నేళ్ళుగా ఉంది
కొత్తపాళీ: అవును. ఇప్పుడిప్పుడే ఆ విషయం గురించి కొంచెం sensitive గా ఫీలవుతున్నా. అలాగా? మీ ఫేవరెట్లెవరు? నాకీ మధ్య కాలంలో సంజయ్ అంటే బాగా ఇష్టం.
సత్యసాయి: మహారాజపురం సంతానం. For all seasons and times.
కొత్తపాళీ: పాత కాలపు వాళ్ళు శెమ్మంగూడి, ఎండీ రామనాథన్, కేవీ నారాయణస్వామి.
కొత్తపాళీ: సంతానం అంటే 1980ల్లో గొప్ప పిచ్చిగా ఉండేది. ఆయన పాడిన నను పాలింపా కానీ, మోహన రామా కానీ విన్నారా? మోహన రాగం ఆయన సొంతం!!
సత్యసాయి: యే.. (yes in korean)
కొత్తపాళీ: ఆ తరవాత ఎండీఆర్ పరిచయమయ్యి ఆ క్రేజు తగ్గింది. నాకొక లక్షణముంది .. జబ్బో వరమో తెలీదు.
సత్యసాయి: ఈమధ్యకాలంలో నిత్యశ్రీమహదేవన్ – ఆడవాళ్ళలో
కొత్తపాళీ: Really? You find her good?
కొత్తపాళీ: perhaps I should give her another try!
సత్యసాయి: she is the role model for my daughter
కొత్తపాళీ: kool!
సత్యసాయి: మీవరం ఏమిటో
కొత్తపాళీ: నేను బయటికి పాడలేను కానీ తరచుగా విని ఉన్న సంగీతం ఒక్కొక్క సారి బుర్రలోనే స్టీరియో మోగుతున్నట్టు క్రిస్టల్ క్లియర్ గా వినిపిస్తుంది.
కొత్తపాళీ: Whole musical passages run through my head
కొత్తపాళీ: అలా ఒక సారి నా లాబు నించి డిపార్టుమెంటు వేఫుకి నడుస్తున్నాను వీధిలో.
కొత్తపాళీ: మదిలో ఎండీఆర్ పాడిన శహన “గిరిపై నెలకొన్న రాముని” మెదుల్తోంది. అనుపల్లవి అలా పైకెగిసిపోతుంది చూడండి ..”నిలబడి విసరుచు ..” అన్న దగ్గిర. అంతే ఒకటే కళ్ళెంబడి నీళ్ళు ధారాపాతంగా. నిలబడలేక వీధిపక్కనున్న సిమెంటు బెంచీ మీద కూచుండి పోయాను కాసేపు. దు: ఖం కాదు.
సత్యసాయి: ఆర్ద్రత?
సత్యసాయి: మీ వరం బెటర్ – నేనైతే ప్రదేశస్పృహ లేకుండా పాడుతూనే ఉంటా-విజిల్ కూడా- ఆఫీసని కూడా లేకుండా
సత్యసాయి: ఇంక మనం ముగించే సమయమిదే- ఏమైనా అడగాల్సినవి ఉన్నాయా
కొత్తపాళీ: hmm.. not much
సత్యసాయి: ముగించాలని లేకపోయినా ముగించాల్సి రావడం కొద్దిగా కష్టమే
కొత్తపాళీ: yup
సత్యసాయి: యే… త్రివిక్రముడికి చెందుతుందీ క్రెడిటంతా
కొత్తపాళీ: అవును. అయన పుణ్యమూ, పొద్దు పుణ్యమా అని మనం మంచి స్నేహితులమయ్యాము.
సత్యసాయి: అవును..
కొత్తపాళీ: ప్రస్తుతానికి ముగిస్తా.
సత్యసాయి: శుభరాత్రి (మీకు)
కొత్తపాళీ: మీకు bon journo (Italian)

సమాప్తం.

This entry was posted in వ్యాసం and tagged . Bookmark the permalink.

6 Responses to తూర్పూ పడమర – 3

  1. teresa says:

    మార్చడానికి టైం పడుతుందికాబోలు, ఈ రిబ్బన్ టెక్ష్ట్
    చదవడం కష్టంగా ఉందని మరోసారి మనవిచేసుకుంటున్నాను

  2. ఈ ఆలోచన నాకు బాగా నచ్చింది. అలాగే పిల్లల ప్రశ్నలు – మేష్టారు జవాబుల్లాగా పాఠకుల ప్రశ్నలకు జవాబిచ్చే సంచిక ఉంటే బాగుంటుందని నా యోచన

  3. venkat says:

    ”నిలబడి విసరుచు ..” అన్న దగ్గిర. అంతే ఒకటే కళ్ళెంబడి నీళ్ళు ధారాపాతంగా. నిలబడలేక
    వీధిపక్కనున్న సిమెంటు బెంచీ మీద కూచుండి పోయాను కాసేపు. దు:ఖం కాదు.

    సంగీతాన్ని అంతగా ఆస్వాదించగలగడం, ఆనందించగలగడం అందరికీ సాధ్యం కాదు. మీరు అదృష్టవంతులు.

    మీ కబుర్లు సరదాతో పాటు, సమాచారాన్ని అంద చేసాయి. ఇలాంటి ప్రయత్నాలు మరిన్ని చేయాలని పొద్దు వారికి నా విన్నపం.

  4. Rakesh says:

    Very nice!!

  5. suresh says:

    best work.keep it up

  6. radhika says:

    మాకు నచ్చిన వాళ్ళ వ్యక్తిగత విషయాలతో పాటూ చాలా ఆశక్తికర విషయాలు తెలుసుకునేలా చేసిన పొద్దువారికి ధన్యవాదాలు.

Comments are closed.