|
………………….. ………. |
బ్లాగరులు ఒకరితో ఒకరు కబుర్లు చెప్పుకుంటే, దాన్ని పాఠకుల కోసం ప్రచురిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన ఫలితమే ఈ తూర్పూ పడమర! కొరియా కబుర్లతో నెజ్జనులను అలరించిన కొవ్వలి సత్యసాయి గారిని, కొత్తపాళీ గారిని కబుర్లు చెప్పుకోమన్నాం. గూగుల్ టాక్‌తో ప్రాక్పశ్చిమాలకు వారధి నిర్మించి వారిద్దరూ మాటలు కలిపారు. వారి కబుర్లలో రెండో భాగం వినండి. మొదటి భాగం ఇక్కడ ఉంది.
సత్యసాయి: సంగీత, సాహిత్య, నాట్యాది రంగాల్లో మీకు అభిరుచి ఎప్పుడు, ఎలా కలిగింది
సత్యసాయి: అమెరికాలో ఇన్నాళ్ళున్నాకా మన దేశం మీద దాని భవిష్యత్తు మీదా ఎలాంటి అభిప్రాయాలూ, ఆశలూ ఉన్నాయి?
సత్యసాయి: మీ అభిమాన రచయిత(త్రి) ఎవరు?, ఎందుకు?
కొత్తపాళీ: First one is simple to answer. Second one is a lot more complicated, so I’ll pass for now. Third – there is no one like that. I like several writers for different reasons, but no single all-time favourite.
కొత్తపాళీ: మా నాన్నగారు తమిళులు. మా అమ్మ తెలుగు. వాళ్ళ పెళ్ళై విజయవాడలో సెటిలయారు ..అప్పుడు ఒకటో రెండో సంగీత సభలుండేవి.
సత్యసాయి: ఇంటరెస్టింగ్
కొత్తపాళీ: అలా మా నాన్నగారి నుంచి మా అమ్మకి అంటింది సంగీతంలో ఆసక్తి. మేమంతా పుట్టి కుటుంబం పెరిగి మా చదువులూ గోలా .. దీంట్లో వీళ్ళు కచ్చేరీలు మానేశారు. మా అప్ప (నాన్నగారు) ఎప్పుడన్నా రేడియోలో పెట్టినా మేం గోల చేసి జనరంజనికి మార్చేసేవాళ్ళం. ఆయనకైనా, సంగీతం లేకపోతే పని జరగదన్న లాంటి మనిషి కాదు, ఏదో కొంత అభిమానం అంతే.
సత్యసాయి: ఉఁ
కొత్తపాళీ: నాకు సుమారు పదేళ్ళప్పుడు మా అప్ప చాలా అకస్మాత్తుగా పోయారు. అప్పటికే ఒక అక్కా, అన్నయ్యా ఇంజనీరింగ్ కాలేజీలకి హాస్టళ్ళకి వెళ్ళారు.
సత్యసాయి: అయ్యో
కొత్తపాళీ: ఇంకో రెండేళ్ళల్లో ఇంకో అక్కకీ పెళ్ళై అత్తారింటికి వెళ్ళింది. మా అమ్మా నేనూ మిగిలాం. నాకు సుమారు పదమూడేళ్ళప్పుడు మా అమ్మ ఒక చిన్న గ్రామఫోన్ కొన్నది. అప్పుడే పెద్ద భోషాణం లాంటి డిజైను పోయి బుల్లి బ్రీఫ్ కేసు లాంటివి వచ్చాయి. మా అమ్మ తన మిగతా బాధ్యతలన్నిటితోనూ .. తన నెలసరి బడ్జెటులో ఒక రెండు రికార్డులకి స్థానం కేటాయించి క్రమం తప్పకుండా కొనేది. మొదట బాలమురళీ పాడిన రామదాసు కీర్తనలు, ఎమ్మెస్ భజగోవిందం ..ఇత్యాది,
సత్యసాయి: మెచ్చుకోవాలి
కొత్తపాళీ: ఇలా మొదలైంది. ఇదిలా ఉండగా .. ఒక్క పెట్టున విజయవాడలో సంగీత సభల ఉధృతం పెరిగింది. సభ్యత్వ రుసుము హాస్యాస్పదం. గొప్ప గొప్ప విద్వాంసుల్ని తెచ్చేవాళ్ళు. హాళ్ళన్నీ ఖాళీగా ఉండి దారిన పోయే వాళ్ళని బతిమలాడి తీసుకొచ్చి కూర్చో పెట్టేవాళ్ళు. మరొక పక్క సంగీత కళాశాలలో నేదునూరి గారు ప్రిన్సిపాలుగా వచ్చారు. నేను 82లో కాలేజికి వెళ్ళే లోపలే అప్పటి స్టార్లందరినీ నేరుగా విన్నాను.
|
సత్యసాయి: సంగీత సాహిత్యాలకి విజయవాడ ఆకాశవాణి చాలా సేవ చేసింది
కొత్తపాళీ: అప్పుడప్పుడూ రేడియో సంగీత సమ్మేళన్ కచేరీలు కూడ జరిగేవి.
కొత్తపాళీ: సరే ఇంక రేడియోలో కచేరీలకి చెప్పక్కర్లేదు.
సత్యసాయి: ఉఁ
కొత్తపాళీ: ఈ సంగీతాస్వాదన ప్రస్థానంలో నేనూ మా అమ్మా తోటి ప్రయాణికులం. రాగాలు గుర్తు పట్టడం, ఒక రాగానికి అనేక కృతుల్ని ఉదహరించడం .. ఇవన్నీ ఒక ఆటగా ఉండేవి మాకు.
కొత్తపాళీ: సంగీతాన్ని విని ఆనందించడం అనే భిక్ష పెట్టినందుకు మా అమ్మకి ఎప్పటికీ చేతులెత్తి నమస్కరిస్తుంటాను నేను.
కొత్తపాళీ: వైనల్ రికార్డుల తయారీ ఆగిపోయే సమయానికి ఆవిడ నాలుగొందల పైన కర్ణాటక సంగీతం, ఇతరత్రా రెండొందల రికార్డులు సేకరించింది.
సత్యసాయి: గ్రేట్
కొత్తపాళీ: తాను కొంత ఆర్ధికంగా నిలదొక్కుకున్నాక, కొన్ని సభలకి బాగా ఆర్ధికంగా సహాయం చేసింది. సంగీత కళాశాలలో మృదంగానికి ప్రైజు లేదని ఒక వార్షిక బహుమతి ఏర్పాటు చేసింది.
సత్యసాయి: మెచ్చుకోతగ్గ విషయం
సత్యసాయి: మా స్వగ్రామం తణుకులో ఆంజనేయస్వామి గుళ్ళో హరికధలు, బుర్రకధలు, కచ్చేరీలు ప్రతి యేటా జరిగేవి. మా అమ్మా నాన్న మమ్మల్ని తీసుకు పోయే వారు
కొత్తపాళీ: బలే గుర్తు చేశారు. ములుకుట్ల సదాశివ శాస్త్రి గారి హరికథలు కూడా.
కొత్తపాళీ: నాట్యం కూడ అప్పుడు చాలానే చూశాను కానీ, ఏమీ అర్ధం కాలే .. ఆసక్తీ అంతంత మాత్రమే.
కొత్తపాళీ: నేర్చుకోవటం 1997లో మొదలైనాకే, దాని మీద అభిరుచీ, మెళకువలూ నెమ్మదిగా పెంపొందాయి.
కొత్తపాళీ: అవును, మనకి ఆసక్తి ఐన వాటిల్ని పిల్లలకి కూడా పరిచయం చెయ్యాలి.
సత్యసాయి: డైయింగ్ ఆర్ట్స్
కొత్తపాళీ: హరికథలు మళ్ళీ కొంత రెవైవ్ అవుతున్నట్లుంది?
సత్యసాయి: అన్నట్లు ముగించే ముందు ఒక విషయంచెప్పాలి.
కొత్తపాళీ: చెప్పండి.
సత్యసాయి: ఇందాకా పండా అనే ఆయన కలిసాడన్నా కదా.
కొత్తపాళీ: గుర్తుంది
సత్యసాయి: ఆయనా, నేనూ Institute of Economic Growth, Delhi లో 1986-89 ప్రాంతంలో పని చేసాం. సుమారు 15 సంవత్సరాల తర్వాత దేశం కాని దేశంలో ఒకే చోట ఒకటిన్నర సంవత్సరాలు తిరిగి కలిసి పని చేయడం కాకతాళీయాల్లో కాకతాళీయం.
కొత్తపాళీ: నిజంగా వింతే. నేనూ ఆమధ్య ఒక పాత స్నేహితుడిని ఇలాగే కలిసా. 3-4 ఏళ్ళకే అనుకోండి.
సత్యసాయి: ఆయన అక్కడ ఒక సెమిష్టరు క్రితమే జేరడం వల్ల నాకు కొత్త చోటన్న భావనే కలగలేదు. నా ఆహార విహారాల సమస్య, కమ్యూనికేషన్ సమస్య తీరిపోయాయి. దైవం మానుష రూపేణా అన్న వాక్యమెంత నిజమో మరోసారి తెలియవచ్చింది.
కొత్తపాళీ: అవును. నిజమే.
సత్యసాయి: శుభరాత్రి.
కొత్తపాళీ: శుభదినం.
09-12-07
సత్యసాయి: శుభోదయం
కొత్తపాళీ: శుభోదయం
కొత్తపాళీ: మాకు చీకటి వాలేసింది .. అసలే అమవస నిశి!
సత్యసాయి: క్రితం సారి మనం మీ సంగీతాది కళాభినివేశం గురించి మాట్లాడుకుంటూ ఆపేశాం
కొత్తపాళీ: అదా. దాన్లో కంటిన్యూ అవుదామా? దేశాల చర్చకి వద్దామా?
కొత్తపాళీ: ఎందుకంటే .. మొన్ననే రానారెతో కలిసి డాన్సు గురించి ఒక ఇంటర్వ్యూ ఇచ్చా. మరీ జనాలకి కలాపోసన ఓవరుడోసై పోతుందేఁవోనని
సత్యసాయి: మీరు చాలా మంది బ్లాగర్లని కందాల్లోకీ, సీసాల్లోకీ దింపిన ఘనులు. అవంటే మీకు మక్కువ ఎలా కలిగిందో చెప్పాక దేశాలమీద పడదాం
కొత్తపాళీ: అలాగే
కొత్తపాళీ: పద్యాల మీద మక్కువ కలగటానికి కారణం మొదటగా మా తాతయ్య. బాగా పసితనంలో ఆయన దగ్గిర పెరిగాను. అక్షరాభ్యాసం చేయించి అప్పుడు మళ్ళీ మా అమ్మా అప్పాకి అప్పగించాడు. ఆయన తన చిన్నప్పుడు గురువుగారింటో ఉండి తెలుగు పంచ కావ్యాలూ చదువుకున్నారు.
సత్యసాయి: ఊఁ
కొత్తపాళీ: పోతన భాగవతం వంటి పురాణాలు మధ్యాన్నం పూట, రాత్రి భోజనాలయ్యాక పైకి చదివి అర్థం చెబుతుండేవారు. సుమతీ శతకం పద్యాలు, వేమన పద్యాలు కొన్ని ఆటలాడిస్తున్నట్టే వల్లె వేయించేవారు. అదీ మొదలు.
కొత్తపాళీ: ఇంక మా అమ్మా వాళ్ళింటికొచ్చాక మా చిన్నక్క, తనప్పుడూ 9 చదువుతుండేది, తనతో పాటు ఛందస్సు మూల సూత్రాలు నేర్పింది.
సత్యసాయి: రాకేశ్వర, ఊకదంపుడాది బ్లాగరులు ఆటవెలదులతో, కందాలతో – సీసాలు కాసేపు పక్కన పెట్టినట్లున్నారు- ఆడుకుంటూంటే నాకైతే తెగ అసూయ
కొత్తపాళీ: అసూయెందుకు, మీరూ మొదలెట్టండి.
సత్యసాయి: సాటి మొగాడిగా అది సహజమనుకుంటా!?
సత్యసాయి: మా స్కూళ్ళలో తెలుగు ఒక తద్దినంగా ఉండేది- అందుకే వంటబట్టలేదు
కొత్తపాళీ: : P
కొత్తపాళీ: నేను ఆరు చదువుతుండగా మాకు గ్లామరు తార వంటి తెలుగు టీచరు వచ్చారు.
సత్యసాయి: ముదితల్ నేర్పగ రాని విద్య గలదె….
కొత్తపాళీ: ముదితల్ నేర్పిన నేర్వగ రాని విద్య గలదె అనండి
కొత్తపాళీ: అదీ కత.
సత్యసాయి: ఇక దేశాలకొస్తే…మనవాళ్ళు అమెరికా వెళ్ళాలనుకోవడం సహజం. వెనక్కి వద్దామనుకున్నా రాలేరని చరిత్ర చెబుతోంది. అక్కడి మాయ ఏంటంటారు?
కొత్తపాళీ: ఇదివరకు ఉన్నత విద్య ఆకర్షణ.
కొత్తపాళీ: అదీ కాక అమెరికా వెళ్ళటం అంటే అదేదో సాధించినట్టు అప్పటి విద్యా కేంద్రాల్లో (ఇప్పుడు సామాన్య సమాజంలో కూడా) ప్రబలి ఉన్న అపోహ ఒకటి.
సత్యసాయి: అది సరైనదే ననుకుంటా అప్పటి మనవిద్యా ”లయాల” పరిస్థితి చూస్తే
కొత్తపాళీ: ఈ మధ్యకాలంలో డబ్బు ఆకర్షణ. మిగతా అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా వసతులు డబ్బూ ఉన్నా, అమెరికాలో నానా జాతుల్ని అంగీకరించినట్టుగా ఇంకే దేశంలోనూ అంగీకరించరనేది ఒక వాస్తవం.
సత్యసాయి: ఇప్పుడు కూడా అంగీకరిస్తున్నారా?
కొత్తపాళీ: ఓ, తప్పకుండా
కొత్తపాళీ: 90లలో చూసుకున్నా భారతంలో నగరాల్లోనే కొన్ని ప్రాథమిక వసతులు .. పాలు సమృద్ధిగా దొరకటం, వంట గాసు, ఇటువంటివి కష్టంగా ఉండెవి
సత్యసాయి: అవును
కొత్తపాళీ: ఇక్కడ ఇటువంటి వసతులకి మరిగిన మన జనాభాకి ఆ రోజుల్లో మాతృదేశాన్ని తిరిగి చూస్తే నీరసంగా నిరసనగా ఉండేది.
సత్యసాయి: అవును
కొత్తపాళీ: 2000 సం తరవాత వ్యాపార పారిశ్రామిక రంగాల్లో ప్రపంచమంతటా మౌలికమైన మార్పులు జరుగుతున్నాయి.
కొత్తపాళీ: అమెరికా ఈ మధ్యకాలంలో చాలా మట్టుకు పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా తయారైంది.
సత్యసాయి: మీకుమొదటిసారి వెళ్ళీ వెళ్ళగానే కలిగిన ఫీలింగ్స్??
కొత్తపాళీ: ఈ మధ్య కాలంలో భారతం నించి ఇక్కడికి వచ్చే వారు కూడా దీర్ఘ కాలిక ప్రణాళికలతో కాకుండా ఉన్నంతలో కొంత డబ్బు మూట కట్టుకు పోదాం అన్న దృష్టితో వస్తున్నారు. లేదా, దీర్ఘకాలిక దృష్టి ఉన్న వారు వచ్చిన కొన్నాళ్ళకే స్వంత వ్యాపారాలు మొదలెడుతున్నారు. ఇవన్నీ పదేళ్ళ క్రితం లేని పరిణామాలు.
కొత్తపాళీ: ఒక్క నిమిషం ఓపిక పట్టండి. దీన్లో ఇంకో ముఖ్యమైన పాయింటుంది. అది కుటుంబాలు (భార్య పిల్లలూ) ఎలా ఫీలవుతారనేది.
సత్యసాయి: ఇది శుభపరిణామ మనుకుంటున్నా. మీరేమంటారు?
కొత్తపాళీ: స్త్రీలకి ముఖ్యంగా మాతృదేశంలో ఊహించలేని స్వేఛ్ఛ ఇక్కడి జీవనంలో అనుభవమైంది.
కొత్తపాళీ: దాంతో, వెనక్కి వెళ్ళటం అని మొగుడెప్పుడన్నా అనుకున్నా, ఈమె ఒప్పుకోదు.
సత్యసాయి: వైస్ వెర్సా?
కొత్తపాళీ: దీనికి exceptions ఉన్నారు, కానీ సామాన్యంగా ఇదీ పరిస్థితి.
కొత్తపాళీ: కుటుంబం అంటూ ఉన్నాక వెనక్కి వెళ్ళాలి అనుకుంటే భార్యా భర్తలిద్దరికీ దాన్ని గురించి ఒక shared vision ఉండటం చాలా అవసరం. నాకు తెలిసి తిరిగొచ్చిన కుటుంబాల్లో ఇది నిజం.
కొత్తపాళీ: పిల్లల వయసు పది దాటకపోతే అక్కడ తొందరగా ఎడ్జస్టవుతారని ఏవో సిద్ధాంతాలు వినిపిస్తుంటాయి. ఏదైనా, తల్లిదండ్రులు పిల్లలతో ఈ విషయాలు కూలంకషంగా చర్చిస్తుండాలి.
సత్యసాయి: అక్కడస్వేచ్చ అన్నారు – ఇంట్లో ఉండేవాళ్ళు పాతవాళ్ళే కదా?
కొత్తపాళీ: స్త్రీకెప్పుడూ ముఖ్య సమస్య మొగుడితో కాదు. ఆమె దారిని ఆమెని బతకనిస్తే నూటికి తొంభై తొమ్మిది సార్లు ఆమె మొగుణ్ణి బానే మేనేజ్ చేసుకోగలదు.
కొత్తపాళీ: మనవాళ్ళు మన సమాజంలో అలా బతకనివ్వరు – అదీ గోల.
సత్యసాయి: అవును – కానీ సమాజం ముఖ్యం వ్యక్తి కాదనే ఓరియంటల్ సంస్కృతిలో అది తప్పేది కాదనుకుంటా?
కొత్తపాళీ: ఆ ప్రశ్న నెత్తుకుంటే socio-anthropo-historical చర్చలోకి పోతాం ఇప్పుడు, వొదిలెయ్యండి.
సత్యసాయి: కొరియాలో కూడా మనలాగే అత్తా, ఆడపడుచుల ఆరళ్ళు, మగపిల్లాడంటే ఉన్న అతి గారాబం ఉన్నాయని – ఇప్పడుతగ్గాయట- తెలిసి మనలా ఎందరో అని పించింది
సత్యసాయి: మీకుమొదటిసారి వెళ్ళీ వెళ్ళగానే కలిగిన ఫీలింగ్స్??
కొత్తపాళీ: gimme a sec. just checking the file-save feature
కొత్తపాళీ: మొదటి సారి ఫీలింగ్స్.
సత్యసాయి: మొన్నటి అనుభవంతో తరచూ కాపీ పేస్టు చేస్తున్నా
కొత్తపాళీ: yeah, me too
సత్యసాయి: సేవ్ కూడా: -)
కొత్తపాళీ: దిగిన మొదట్లో చాలా excitedగా ఉన్నా. ప్రతిదాన్ని గురించీ ఆసక్తి.
కొత్తపాళీ: కనబడిన అందరితో గడగడా మాట్లాడెయ్యాలని ఉండేది.
కొత్తపాళీ: అమెరికన్లు చాలా open and friendly అనుకునే వాళ్ళం. అది అపోహే అని నెమ్మదిమీద తెలిసింది.
సత్యసాయి: వింతగా ఉందే
కొత్తపాళీ: నేను దిగటం ఫిలడెల్ఫియా నగరంలో, నడిబొడ్డున. అది మరి అమెరికాలో పది పెద్ద నగరాల్లో ఒకటి కదా. దిగిన మర్నాడు ఇంటినించి వివికి రోడ్డుమీద నడిచి వెళ్తుంటే .. సుమారు మైలు దూరం నడకలో ఒక్ఖ మనిషి ఎదురైతే ఒట్టు!
కొత్తపాళీ: ఇది ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో. ఇది నన్ను చాలా ఆశ్చర్య పరిచింది.
సత్యసాయి: అవును మనని రాసుకుంటూ జనాలు నడవక పోతే రోడ్డుమీదున్నట్లే ఉండదు
కొత్తపాళీ: అఫ్కోర్సు, రోడ్డు మీద కార్లు చాలానే వెళ్తున్నయ్యి, పాద చారులై ఎదురు పడ్డ వాళ్ళెవరూ లేరని నా ఉద్దేశం. అదేదో కాశీ మజిలీ కథల్లో రాకుమారుడూ మంత్రికుమారుడూ వేరే రాజ్యానికి వెళితే అక్కడ వీధుల్లో పట్టపగలు ఎవరూ తిరక్కపోవటం .. ఏదో గండభేరుండ పక్షి భయం వల్ల .. అలాంటి కథేవన్నా ఉందా అనిపించింది!
సత్యసాయి: హ..హ.. హ… జానపదాలు బాగా ఔపోసన పట్టేరే
కొత్తపాళీ: ఇప్పుడింకా మర్చిపోయాను చాలా కథలు. ఇదివరకు నాలిక చివర ఉండేవి.
కొత్తపాళీ: ఇక్కడి సమయపాలనా, మనుషులు చెప్పిన దాన్ని నిఝంగా నమ్మి పాటించటం మొదట్లో నాకు జీర్ణమయ్యేవి కావు.
సత్యసాయి: సాంస్కృత్యాఘాతం (cultural shock?)
కొత్తపాళీ: అవును.
కొత్తపాళీ: ఇది జీర్ణించుకుని అవలంబించటానికి నాకో సెమిస్టరు కాలం పట్టింది.
కొత్తపాళీ: నేను తిరిగి భారతంలో నివాసమున్నప్పుడు అక్కడ జనాలకి నా ఈ పద్ధతులు అర్ధమై చచ్చేవి కావు. నువ్వు మరీ అమెరికనువైపోయావు అని నిష్ఠూరమడేవాళ్ళు. నిజమే ననిపించింది.
సత్యసాయి: నాకాశ్చర్యం కలిగేదేమిటంటే మన పూర్వీకులు సమయపాలనా, వాక్యపాలనా బాగా చేసేవారు –
సత్యసాయి: ఇప్పుడేమో ఇలా తయారయ్యాం
కొత్తపాళీ: వాక్య పాలన చెయ్యక పోవటం, మరీ పూర్వకాలం సంగతేమో గానీ ఇటీవలి చరిత్రలో బ్రిటీషు పాలన కింద మగ్గటం వల్ల వచ్చిందని నా అనుమానం.
కొత్తపాళీ: సమయపాలన సంగతేమో – అదసలు పాశ్చాత్య సాంప్రదాయమని నా అనుమానం.
సత్యసాయి: కాదనుకుంటా- మన ముహూర్తాల వెనక సమయపాలనే ఉద్దేశ్యమనుకుంటా – షెడ్యూలింగ్-
సత్యసాయి: ఇప్పుడు దాన్నే ప్రతీదీ వాయిదా వేయడం కోసం వాడుకుంటున్నాం
సత్యసాయి: అటు పశ్చిమం (అమెరికా) ఇటు తూర్పు (కొరియా, జపానులు) సమయానికిచ్చిన విలువ వల్లే పైకొచ్చారనుకుంటా
కొత్తపాళీ:
కొత్తపాళీ: మీకెలాగో మొత్తానికీ ఐరనీ అంటే ప్రీతి అల్లే ఉందే?
సత్యసాయి: అలా అనిపించిందేం? కానీ ఇందులో ఐరనీ లేదు
కొత్తపాళీ: how so? ఒకదానికి నిర్దేశించిన పద్ధతిని సరిగ్గా దాని వ్యతిరేకానికి ఉపయోగించటమే కదా ఐరనీ! సరే పోనివ్వండి. నేను అప్పటికే సర్వభక్షకుణ్ణి కావటం వల్ల తిండి పెద్ద ఇబ్బంది కాలేదు. చదువూ పెద్ద ఇబ్బంది కాలేదు. అయ్యయ్‌టీ కాన్పూరు తరవాత ఈ చదువు పేలవంగానే ఉండేది. మొదట్లో ఇంకో పెద్ద ఇబ్బంది అమ్మాయిల్తో. ఇందాకే చెప్పాను కదా, సాధారణంగా అమెరికన్లు కొంచెం ముభావంగానే, ఎవరి పని వారు చేసుకుంటూ ఉంటారని
సత్యసాయి: అవును
కొత్తపాళీ: కొద్ది పాటి పరిచయమయ్యాక, వివిల్లో ఐతే మరీనూ .. అమ్మాయిలొచ్చేసి అబ్బాయిలతో బుజాలు రుద్దుకోటం చేసేస్తుంటారు.
సత్యసాయి: ఎంతకష్టం
కొత్తపాళీ: వాళ్ళకది పెద్ద విషయంగా అనిపించదు. మనకేమో కొత్తకావటంవల్ల ఇబ్బందిగా ఉండేది.
సత్యసాయి: స్వానుభవం (కూడా అదే)
కొత్తపాళీ: కష్టమే మరి – అది అనుభవించితే తెలుసునులే
సత్యసాయి: అర్ధం చేసుకోగలను. అందులో మీ వయస్సుకూడా అలాంటిదే కదా!
కొత్తపాళీ: ఈ మాత్రం భాగ్యానికి మన వెధవాయలు కొందరు, ఇంకేముంది, ఆ పిల్లకి తనంటే ఇష్టం అనుకుని జొల్లు కార్చుకుంటూ ఆమె చుట్టూ తిరిగి చివరికి ఛీ కొట్టించుకుని, గడ్డం పెంచి దేవదాసు వేషం వెయ్యటం కూడా నేనెరుగుదును.
సత్యసాయి: బీద వాళ్ళు – పూర్ ఫెలాస్
కొత్తపాళీ: ఆ తరవాత .. ఈ శ్వేతవనితల గుండెలు పాలరాతి బండలు అని డైలాగులు చెప్పేసి, హాయిగా పది లక్షల కట్నంతో అమ్మానాన్నా కుదిర్చిన వెంకటసుబ్బలక్ష్మిని చేసుకుని .. వాళ్ళెందుకు బీదవాళ్ళు?: ))
సత్యసాయి: గెడ్డం గీసుకోవడానికి ఖర్చయిన మేరకు బీదవాళ్ళే కదా
కొత్తపాళీ: : ))
కొత్తపాళీ: ఒక సారి .. సందర్భం ఏవిటో గుర్తులేదు .. డిపార్టుమెంట్ కార్యాలయంలో పనిచేసే అమ్మాయి తన చేత్తో నా చెంప నిమరబోయింది. నేను అసంకల్పితంగా .. అదేదో పాము నా మీద పడబోతున్నట్టు చటుక్కున వెనక్కి తగ్గాను. ఆ అమ్మాయి విస్తుబోయింది. తనేదో చెయ్యరాని పని చేసిందేమో అన్నట్టు చాలా క్షమాపణలు చెప్పింది.
సత్యసాయి: మన కండిషనింగ్.
కొత్తపాళీ: ఇలా ఉండేవి తొలి రోజుల అనుభవాలు.
శ్వేతవనితల గుండెలు పాలరాతి బండలు అని డైలాగులు చెప్పేసి, హాయిగా పది లక్షల కట్నంతో అమ్మానాన్నా కుదిర్చిన వెంకటసుబ్బలక్ష్మిని చేసుకుని .. వాళ్ళెందుకు బీదవాళ్ళు?: )) హాహాహా