మరో ప్రపంచం కోసం

-గార్ల సురేంద్ర నవీన్

.

పరిగెడుతున్నాను…..

కష్టాల కొండలు ఎక్కుతూ
నిరాశా నదులు దాటుతూ
చిమ్మ చీకటికి దూరంగా
వెలుతురు కోసం ఆశగా
పరిగెడుతున్నాను……

ఆవేదనతో కొట్టుకుంటున్న గుండెతోనూ
అలసిపోయి రొప్పుతున్న రొమ్ములతోనూ
చెంపల దాహాన్ని తీరుస్తున్న కన్నీళ్ళతోనూ
ఎగిసిపడుతున్న బాధను అదిమి పెట్టి
దహిస్తున్న ఆలోచనల్ని తొక్కిపట్టి
ఇంకా కనిపించని గమ్యం కోసం
పరిగెడుతున్నాను……

ఎక్కడా ఆగక
ముళ్ళను లెక్క చెయ్యక
పువ్వుల కోసం ఆశపడక
ఎవరు పిలచినా పలకక
వెనకకు తిరిగి చూడక
పరిగెడుతున్నాను……

తిరిగితే కోరికలు దయ్యాల్లాగా పిలుస్తాయ్
వికార ఆకారాలన్ని ప్రియంగా కనిపిస్తాయ్
విచక్షణ నన్ను వదిలి దూరంగా పారిపోతుంది
మాయ మైకంలా నేనున్నానంటూ ఆవహిస్తుంది

తప్పు తియ్యగా …నిజం చేదుగా
రుచిస్తుంది
నిజాలకు దూరంగా …కలలకు దగ్గరగా
జరగాలనిపిస్తుంది
శరీరం నిజం …ఆత్మ చాదస్తం
అనిపిస్తుంది
దు:ఖం సుఖంగా… ఆనందం భ్రమగా
ఉంటుంది

అందుకే …
ఆనందంతో పొంగే గుండెల కోసం
సు:ఖం పండిన మనస్సుల కోసం
పవిత్రత నిండిన ప్రపంచం కోసం
ప్రేమ విరిసిన ఆత్మల కోసం
మరో ప్రపంచం అందుకొనేందుకు
పరిగెడుతూనే ఉన్నాను….

—-

జి.ఎస్.నవీన్ గార్ల సురేంద్ర నవీన్ తన పూతరేక్స్ బ్లాగు ద్వారా నెజ్జనులకు సుపరిచితుడు. బ్లాగరిగానే కాక, వికీపీడియన్‌గా కూడా ప్రసిద్ధుడు. తెలుగు వికీపీడియాలో తెలుగు సినిమా ప్రాజెక్టులో విశేషమైన కృషి చేస్తున్నారు. మదనపల్లె వాస్తవ్యుడైన నవీన్ బెంగళూరులో సాఫ్టువేరు ఇంజనీరుగా పని చేస్తున్నారు.

This entry was posted in కవిత్వం. Bookmark the permalink.

31 Responses to మరో ప్రపంచం కోసం

  1. chavakiran says:

    నవీన్! నువ్వు కవివి కూడానా 🙂

    బాగుంది

  2. ఎన్నాళ్ళకెన్నళ్ళకెన్నళ్ళకు నీ రచన మాగాజైన్లో చూసే మా కళ్ళకు

    దాదాపుగా 10 సంవత్సరాల్నుంచి చెపుతూనే ఉన్నా, నవీనూ నీ కవిత కాని లేదా కార్టూన్లు కానీ ఒక మాగజైన్ కు ఇమ్మన్ని. ఈవిధంగా ఆకోరిక తీరింది. ఇది చూసి

    ఆల్ హ్యపీస్
    http://gsashok.wordpress.com

  3. mohanrao says:

    bagundi mee aasavadam, aarthi, aavedana. thirathayile ennatikaina,paruvulu pettalsinde manchi lokam kosam evaraina all the best

  4. బాగుంది, రాస్తూ ఉండండి.

  5. radhika says:

    మీరు కవి అని మాకు ఎప్పుడూ చెప్పలేదు.చూపలేదు.చూస్తూ వుంటే ఇది మొదటి కవితలా లేదు.ఇంకా ఎన్ని కళలు దాచారో?చాలా చాలా బాగుంది.మంచి కాన్సెప్ట్.అంతకన్నా చక్కని వ్యక్తీకరణ.

  6. rambabu .m says:

    hi
    naveen nee kavitha chala bagumdi

  7. నవీన్ అన్నా .. నమస్తే .. మొన్నెప్పుడో Pulitzer prize లెవెలు ఫొటో .. ఇవ్వాళ్ళ ఇలా కవిత్వం .. many hidden depths to yor personality .. glad to know.
    good work

  8. రమ్య says:

    చాలా బాగుంది.
    ఆ మరో ప్రపంచం తప్పక అందుకుంటారు.

  9. @కిరణ్
    ఇంత వరకు ఏవేవో ‘తవిక’లు మాత్రం వ్రాశాను. మొదటి సారి..ఓ మోస్తరు కవితే వ్రాశానని అనిపించింది 🙂

    @రాధిక
    మీ వంటి మంచి/గొప్ప కవయిత్రి (మీరు ఓప్పుకోకపోయినా..ఇది నిజం)కి నచ్చిందంటే, ‘ఆవేదన’తో కొట్టుకుంటున్న గుండె కాస్తా..ఆనందంతో పొంగిపోతోంది. మీ ప్రోత్సాహకర వ్యాఖ్యకు నెనర్లు

    @కొత్తపాళీ గారు
    అన్నన్నా…అన్నా అని నన్నెంతమాటన్నావన్న. మీ వ్యాఖ్య చూడంగానే..చెప్పను..ఒక టపానే వ్రాస్తాను. టెండుల్కర్ ఒక వీధి క్రికెటర్‌ దగ్గరకొచ్చి బుజం తట్టినట్టనిపించింది.

    @mohanrao,@వికటకవి,@Rambabu,@రమ్య
    మీ అభిప్రాయం తెలియపరిచినందుకు కృతఙ్ఞతలు.

    @అన్నగాడికి
    నో కామెంట్స్ 🙂

    మొత్తానికి నా ప్రయాణం ఇలా మొదలైందన్న మాట.

  10. పాటలో లయ చాలా చాలా బాగుంది.

  11. anji says:

    super anna naveen anna
    heat sap to your poetry

  12. shivalakshmi says:

    Hey its very very nice.
    Keep it up.
    All the best.
    (sl chowdary)

  13. Gangi Setty S. says:

    Dear Garla Raveendra Garu. I am very much pleased to see you such dynamic youth working for the preservation of Telugu and its rich culture. I have failed to communicate you, because I dont find here how to type. I appreciate you.
    I am Gangi Setty Teacher, besides a social worker in the field of Environmental Protection. the Second dimention of my service is BASHA PARIRAKSHANA AND SAMSKRUTHI RAKSHANA. In this way I have founded Green Tree Foundation to achieve my goals of Environmental Protection and Telugu Protection. I am trying to bring back to restore more tree cover besides restoring the Sweetness of the Telugu language..

    “heeyyetthi jai kottu telugoda”
    Namaste
    S. Gangi Setty
    Founder,
    Green Tree Foundation,
    Poola Bazaar,
    Talupula (psot &Mandal)
    Anantapur dist
    515581
    mobile: 9441268862

  14. Gangi Setty S. says:

    Sorry for the spelling mistake
    Surendra garu

  15. Pingback: ‘పొద్దు’లో ఉదయించిన నా కవిత « పూతరేక్స్

  16. Lalit says:

    Naveen ki inni kalalu unanyani naku telavadu oka natudu oka mimicry artist oka break dancer matramey maku chuyinachavu shimoga lo … ammo .. telugo lo “chupa rustum” ante emantaro naku telavadu kadu kani nuvvu martram “chupa rustum” vi … good work friend ..PS Is there a way I can read ur blog in english alphabets ?Ati kadu mama reading telugu script is really tough for me left it 15 years ago ..

  17. నవీన్‌ .. కొత్త టపాయేమో అనుకుని మళ్ళీ చదివాను. వ్యాఖ్య ఏం రాయాలా అనుకూంటూ కిందికొస్తూ, అరె .. వ్యాఖ్య రాసేశానే అని విస్తుబోయాను.
    “చెంపల దాహాన్ని తీరుస్తున్న కన్నీళ్ళతోనూ”
    Beautiful!
    చివరి చరణంలో ” సుఃఖం” అనుంది .. ఏదైనా కొత్త ప్రయోగమా .. ఐనా ఓకే! ఒక దృష్టితో చూస్తే .. మహా కవి పదండి ముందుకు పదండి తోసుకు అని పిలుస్తుంటే .. అని పిలిచే పిలిపుకి నేటి యువత ఇచ్చే సమాధానంలాగుంది నీ పద్యం.
    Reallygood.

  18. నదులు ఈదుతూ అంటే బావుంటుందేమో ..

  19. naveen! nee kavitha chala bagundi.batta talalu vachela computers tho teerika lekundagadipe meeru ilanti chakkani kavitha cheppatam mudavaham.

  20. @కొత్తపాళీ గారు,
    మీరు వ్రాసిన వాక్యాలు..నాకు పాఠాలు. నిజమే…కొండలు ఎక్కుతారు..నదులు ఈదుతారు.
    ఇలాంటి వన్నీ సరిదిద్దుకొంటూ నా ప్రయాణం సాగిస్తాను.

  21. రాజశేఖర్ .ఎస్ says:

    చాలా బావుంది నవీన్ ..రాస్తూ ఉండు

  22. కుమ్మావ్ మావా…
    ఇరగదియ్ ఇక…
    పరిచయం లేదు.. హ్రుదయం వుంది అందుకే ఈ స్పందన.

  23. Laxman Reddy says:

    annayya,

    nee kavita lo sahajatvam mariyu ardhrata vundi. naa manasuko hattukundi.

    naadi okkate vinnapam.

    nee kaavita lo optimism and pessimism, kalalu mariyu vairagyam oke sari marchi marchi kanapadutunnayi. ee rentilo oka daanini nirnayinchu koni daaniki kattubadi vundu.

    Laxman

  24. జాన్ హైడ్ కనుమూరి says:

    ఈ కవిత చదవగానే బైబిలులోని ఓ సంఘటన గుర్తుకు వచ్చింది

    కానానును వేగుచూడటనికి వెళ్ళిన కొందరికివారికి కొన్ని అనుభవాలు ఎదురయ్యాయి.
    > ఖర్జూరపు గెలలు వారికంటే ఎత్తుగా వుండటం.
    > అక్కడి కంటబడిన కొందరు బహు బలాడ్యులుగాను, ఎత్తుగాను కనబడటం
    > వారిని ఎదిరంచలేమేమోనని మనసులో ఆందోళన కలగటం

    అయితే ఒక్కనికి అవేమంత కష్టమైనవిగా కనబడలేదు, జయించవచ్చు అని చెప్పాడు.

    అలాంటి వేగు ఏదో మీ కవిత అక్షరాలమద్య దొర్లుకుంటూ పరుగెడుతున్నట్టనిపించింది.

    మీకలాన్ని ఇలాగే పరుగెత్తనీయండి

    శుబాభినందనలు
    జాన్ హైడ్ కనుమూరి

  25. @కొత్తపాళీ గారు,
    ఆలోచిస్తూంటే…తట్టింది అలా ఎందుకు వ్రాశానో. నది ఈదుతూంటే…అవతలి గట్టుకు చేరుతామో లేదో తెలియదు కదా. అక్కడ నిరాశ నుండి ఆశకు, చీకటి నుండి వెలుగుకి వెళ్ళాలనే ఖచ్చితమైన ఉద్దేశం ఉంది. అందుకే నదులు ఈదుతున్నాను అనకుండా, దాటుతున్నాను అనవలసి వచ్చింది.

    లక్ష్మణ్,
    మనం కట్టుబడి ఉండాల్సింది ఆశావాదానికే. నిరాశతో సాధించగలిగినది ఏదీ లేదు. అన్ని కల్మషాలతో కుళ్ళిపోయిన ఈ లోకం నుంచి ప్రేమ పవిత్రతలతో నిండిన మరో ప్రపంచంకు అందరూ వెళ్ళలన్న ఉద్దేశంతో అలా వ్రాశాను. ఇక్కడ “నేను” అంటే ప్రతి ఒక్క మనిషి..ఎవరికి వారు అని. అలా మరో ప్రపంచం చేరుకోవాలంటే…ఎవరికి వారు పరివర్తన చెందాలి. ఆ పరివర్తన ఒక్క రోజులో వచ్చేసేది కాదు. అది నిరంతర ప్రయాణం. ఆ ప్రయాణాన్నే ఇక్కడ పరుగుగా పేర్కొన్నాను. 🙂

    వ్యాఖ్యలు వ్రాసి తమ అభిప్రాయం తెలిపిన అందరికీ నా కృతఙ్ఞతలు.

  26. sudha says:

    meee ….kavitha chala bagundhi….

    ilantive marinni rayalani….

    sudha

  27. చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది కవిత నవీన్!

  28. janardhan says:

    బాగుంది. మరో ప్రపంచం కోసం మీ అన్వేషణ విజయవంతం కావాలని కోరుకొంటున్నా.

  29. raj says:

    చాలా బాగుంది.
    ఆ మరో ప్రపంచం తప్పక అందుకుంటారు.

  30. Pingback: మరో ప్రపంచం కోసం… « పూతరేక్స్

Comments are closed.