ఆ దారి

-అసూర్యంపశ్య

.

నువ్వూ నేనూ అప్పుడెప్పుడో కలిసెళ్ళిన దారి

ఒంటరిగా వెళితే కొత్తగా తోచింది

పాత గుర్తులు మాయమైతే

నువ్వు తీసుకెళ్ళావనుకున్నాను నేస్తం!

అక్కడి గాలుల్లో చిక్కుకున్న అప్పటి మాటలు

ఒక్కొక్కటే వచ్చి పలకరించినప్పుడు

తెలిసింది నాకు

ఇది ఆ దారేనని….

మట్టిలో కలిసిన అప్పటి అడుగులు

నేలని పెగుల్చుకుని వచ్చి

రోడ్డుపై వేసిన అచ్చులు చూసాకే

తెలిసింది నేను దారి తప్పలేదని…

—-

“ఆధునిక తెలుగు సాహిత్యపు లోతులను తరచి చూడటానికి ప్రయత్నిస్తున్న ఒక మామూలు నెటిజెన్ ని” అనే అసూర్యంపశ్య తాను కవయిత్రిని కాకపోయినా రకరకాల కారణాల వల్ల కవితలు రాయడానికి ప్రయత్నిస్తానని అంటారు.

About అసూర్యంశ్య

"ఆధునిక తెలుగు సాహిత్యపు లోతులను తరచి చూడటానికి ప్రయత్నిస్తున్న ఒక మామూలు నెటిజెన్ ని" అంటున్న అసూర్యంపశ్య తాను కవయిత్రిని కాకపోయినా రకరకాల కారణాల వల్ల కవితలు రాయడానికి ప్రయత్నిస్తానని అంటున్నారు.
This entry was posted in కవిత్వం. Bookmark the permalink.

8 Responses to ఆ దారి

  1. radhika says:

    నాకు తెలుసు మీ దారి అద్భుత లోకానికి తీసుకెళుతుందని.నా నమ్మకం వమ్ము కాలేదు.నెనర్లు.

  2. t.sujatha says:

    కవిత బాగుంది అర్ధపుష్ఠి కలిగిన కవిత.

  3. “మట్టిలో కలిసిన అప్పటి అడుగులు

    నేలని పెగుల్చుని వచ్చి

    రోడ్డుపై వేసిన అచ్చులు ”
    బాగుందండీ.

  4. బాగుంది..

  5. వెయ్యి మాటలు చెప్పలేనిది ఒక్క చిత్రం చెబుతుందని ఎవరన్నారో కానీ…ఈ కవిత చూపిచ్చి అతను చెప్పింది తప్పు అని నిరూపించాలనుంది.

  6. బహు బాగు…
    క్రిత సారి మీరూ మీ నేస్తఁవూ కలసి వెళ్లనట్లు, ఇప్పుడు మీ కవితలో శబ్దఁవూ, అర్థఁవూ కలసి నర్తిస్తున్నాయి..
    నిజ్జంగా బాగుంది 🙂 !

  7. pruthviraj says:

    బావుంది.aa daari. కాని నెమరు వేస్తుంటే బాధ గా వున్నది.కానీ జ్ఞాపకాలు అంత సులువుగా కవితలూ పట్టవు కదా..సరే..సరిపుచ్చుకుందాం.

  8. raju says:

    kavitha bagundi.pkka aksharam mingi kavitha gummarincharu,pegulchuni ani vunnadi.pegulchukuni ani rayali.idhi savarinchukuntarani aashisthoo……… raju

Comments are closed.