జనవరి నెల తెలుగు బ్లాగుల కథా కమామిషూ!

-పొద్దు

2008 జనవరిలో కింది విశేషాలు తెలుగు బ్లాగరులను ప్రధానంగా ఆకట్టుకున్నాయి.

 1. రెండో ఎస్సార్సీకి అనుకూలంగా వీరప్ప మొయిలీ చేసిన ప్రకటన
 2. భారత ఆస్ట్రేలియా క్రికెట్ యుద్ధం
 3. సంక్రాంతి పండగ
 4. నటుడు రాజశేఖర్ పై చిరంజీవి అభిమానుల దాడి

జనవరి 29 నాటి జాబులు ప్రధానంగా రాజశేఖర్ పై చిరంజీవి అభిమానుల దాడిపైనే కేంద్రీకృతమయ్యాయి. దాడిని ఖండిస్తూ కొన్ని, రాజశేఖర్ ప్రకటనలపై చురకేస్తూ కొన్ని వచ్చాయి. శోధన, గుండె చప్పుడు, డల్లాస్ తెలుగు వెన్నెల, నెటిజెన్, ఫన్‌కౌంటర్, తేటగీతి, చదువరి మొదలైన బ్లాగుల్లో స్పందనలు వచ్చాయి. కొందరు రాజశేఖర్ వ్యాఖ్యలను విమర్శించగా, కొందరు అభిమానుల చర్యను ఖండించారు. కొందరు చిరంజీవిని వ్యాఖ్యలను విమర్శించారు. శోధన, గుండె చప్పుడు అభిమానుల చర్యను ఖండిస్తూ, హితబోధ చేసారు. చిరంజీవి వ్యాఖ్యను చదువరి, డల్లాస్ తెలుగు వెన్నెల, ఒరెమూనా, నెటిజెన్ లు ఖండించారు. డల్లాస్ తెలుగు వెన్నెల చురుకైన వ్యాఖ్యలతో అందరినీ ఖండించింది.

సామాజిక అంశాలు
లక్ష రూపాయల కారు టాటా నానో ఈ నెల తెలుగు బ్లాగర్లు పట్టించుకున్న సామాజిక అంశాల్లో ఒకటి. కడలి తరగ, ఈ కారును, అది సాధించదలచిన ప్రయోజనాన్ని విమర్శనాత్మకంగా చూసారు. ఆ జాబుకు మంచి వ్యాఖ్యలు కూడా వచ్చాయి. ఈ విషయంపై మరో మంచి జాబు, తెలుగు వెబ్ ఛానల్ లో వచ్చింది.

సంక్రాంతి:

పెద్ద పండగ సంక్రాంతి పండగ సందర్భంగా బ్లాగరులు ఉత్సాహంగా జాబులు రాసారు. మచ్చుకు కొన్ని:

హాస్యం:
పెళ్ళి సంబంధాల వెబ్‌సైట్లలో వచ్చే ప్రకటనల మీద వికటకవి రాసిన జాబులు ఈనెల మంచి సందడి చేసాయి. రెండు భాగాలుగా రాసిన ఈ జాబుల్లో పెళ్ళికొడుకులు ఇచ్చిన హాస్యయుతమైన ప్రకటనలను ఏరి కూర్చి, అంతే హాస్య స్ఫోరకమైన తన వ్యాఖ్యానాలతో అందించారు. ఆ జాబులకు వచ్చిన వ్యాఖ్యలను బట్టి చూస్తే అవి రెండూ మంచి ప్రజాదరణ పొందినట్టే. అ జాబుల్లో ఇది మొదటిది, ఇది రెండోది.

తేటగీతి బ్లాగులో చక్కటి హాస్యంతో కూడిన బ్లాగు సీరియల్ ను అందించారు. జనవరి నెలలో “అమెరికాలో ఆపసోపాలు” పేరిట 16 భాగాల సీరియల్ ను ప్రచురించారు. జనవరి 12 న మొదలుపెట్టి తరువాతి భాగాలకు వెనుక తేదీలు వేసుకుంటూ (కాలంలో వెనక్కి) రాసుకుంటూ పోయారు. పాఠకులకు వెనక తేదీలకు వెళ్ళి చదువుకుంటూ వచ్చే పని లేకుండా చేసే ప్రయత్నమై ఉండవచ్చు. కొన్ని సంవత్సరాల కిందట రాసి పెట్టుకున్న ఆ జాబులు చక్కని నవ్వుల్ని పంచాయి.

క్షుర ఖర్మ పేరుతో రెండురెళ్ళ ఆరు రాసిన జాబు ఆ బ్లాగు లోని గత జాబుల స్థాయిలో లేకపోయినప్పటికీ నవ్వులు బాగానే కురిపించింది.

క్రికెట్:
భారత ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న క్రికెట్టు పోటీల గురించి బ్లాగరులు బాగానే స్పందించారు. వాటిలో కొన్ని:

సాహిత్యం:
కలం కలలు: చక్కని భాషతో, ముఖ్యంగా పుస్తకాల సమీక్షలు రాసే ఈ బ్లాగు 2007 చివరిలో బ్లాగు లోకంలోకి దూసుకొచ్చింది. తన గత జాబుకు సాలభంజికలు నాగరాజు రాసిన ఒక వ్యాఖ్యకు స్పందనగా, బ్లాగరి ఫణీంద్ర రాసిన ఈ జాబు ఈ నెల ఆకట్టుకున్న జాబుల్లో ఒకటి.

2007 లో తాము చదివిన పుస్తకాల గురించి జాబులు వచ్చాయి. వాటిలో ఒకటి –
సౌమ్య రైట్స్: పుస్తక సమీక్షలకు ఈ బ్లాగు ప్రసిద్ధి. 2007 లో బ్లాగరి చదివిన 18 పుస్తకాల గురించి ప్రస్తావిస్తూ ఈ జాబు సాగింది. సౌమ్య తనకు నచ్చినవే కాక, నచ్చని పుస్తకాల గురించి -అవి ఎంత ప్రఖ్యాతి గాంచినవైనా – రాస్తూ ఉంటారు. వాటిలో ఈసారి వేయిపడగలు, అనుక్షణికం ఉన్నాయి.

దుప్పల రవి తాను చదివిన పుస్తకాల గురించి తన బ్లాగులో రాస్తారు. ఈనెల కొయ్యగుర్రం, రాధికా సాంత్వనముల గురించి రాసారు.

రానారెసవ్వడిలో తన గూగులమ్మపదాల తరువాతి గుచ్ఛాన్ని చూడవచ్చు. బ్లాగరి తన స్నేహితులతో చేసిన నాలుగు రోజుల విహారయాత్రానుభవాల ఆరు టపాలు కూడా (ఒకటి తప్ప) ఈ నెల్లోనే వచ్చాయి. ట్రావెలాగుల కోవలోకి వచ్చే ఈ జాబులకు ట్రావెలాగుడు అనే పేరు పెట్టాడు. ఈ ట్రావెలాగుడు జాబుల్లో పేరాగ్రాఫులను విడగొట్టిన విధానం కాస్త చిత్రంగా అనిపించింది. బహుశా సాంకేతిక ఇబ్బందులేమో!

రాజకీయాలు:
చిరంజీవి, రాజశేఖర్ వివాదం కాకుండా బ్లాగుల్లో చోటుచేసుకున్న మరో ప్రముఖ రాజకీయ అంశం.. రెండో ఎస్సార్సీ. కాంగ్రెసు పార్టీ రేండో ఎస్సార్సీపై చేసిన ప్రకటనకు తెలుగు బ్లాగుల్లో మిశ్రమ స్పందన కనబడింది. ఎస్సార్సీ గురించీ, సంబంధిత అంశాల గురించీ గుండె చప్పుడులో వరసగా కొన్ని జాబులు వచ్చాయి. ఇవన్నీ కూడా, బ్లాగరి దిల్ (దిలీప్) శైలిలో, చక్కటి విశ్లేషణతో ఉన్నాయి. బాలసుబ్రహ్మణ్యం, తెలుగువీర, నాగరాజు మొదలైనవారు తమ సందర్భోచిత వ్యాఖ్యలతో చర్చను నడిపించారు.

టెక్కు:
దాట్ల శ్రీనివాసరాజు శ్రీ శోధన ప్లగిన్ అనే అందమైన ఓ చిన్ని పరికరాన్ని తయారు చేసారు. ఓ పేజీలో ఉన్న పాఠ్యంలోంచి ఏ పదాన్నైనా ఎంచుకుని డబల్‌నొక్కు నొక్కితే ఆ పదానికి వివిధ నిఘంటువుల్లో అర్థాలు వెతికేందుకు గాను లింకులు వస్తాయి. ఆ లింకులను నొక్కినపుడు, సదరు నిఘంటువు పేజీ వేరే విండోలో తెరుచుకుంటుంది. ఈ పరికరం ప్రజల ఉపయోగార్థం ఇంకా అందుబాటులోకి రాలేదు.

సినిమా:
ఈ నెల బ్లాగుల్లో వేళాకోళానికి పనికొచ్చింది, ఒక్క మగాడు సినిమా. ఈ సినిమాను బ్లాగర్లు నిర్దాక్షిణ్యంగా చీల్చి చెండాడారు. ఈ సినిమాపై వచ్చిన సమీక్షల్లో కొన్ని:
ది ఇన్‌సైడర్
ఒక్కమగాడు – చిత్ర సమీక్ష
అనసూయ సినిమాపై జి.ఎస్.నవీన్ సమీక్ష కూడా జనవరి సినిమా సమీక్షల్లో ఒకటి

విలక్షణం:
తెలుగు బ్లాగులూ వాటి ట్యాగులైనుల గురించి తెలుగు’వాడి’ని ఓ చక్కని జాబు రాసారు. బ్లాగుల గురించిన జాబిది. చాలా పొడవైన వాక్యాలు – సంయుక్త, సంశ్లిష్ట వాక్యాలు – రాయడం ఈ బ్లాగరి ప్రత్యేకత. చిన్నచిన్న వాక్యాలు రాస్తే మరింత చదవవీలుగా ఉంటుందని గమనించాం.

అందమైన బ్లాగులు (బ్లాగురాణులు):
ఈనెల బ్లాగుల్లో కంటికి బాగా నదురుగా అనిపించిన బ్లాగులను ఈ శీర్షికలో పేర్కొంటాము.

 • ఒరెమూనా – చావా కిరణ్ తన బ్లాగు ఒరెమూనాను కొత్త మూసతో అలంకరించారు. చూడముచ్చటగా ఉంది బ్లాగు.
 • కొత్త బంగారు లోకం – ఈ బ్లాగు శీర్షిక చాలా అందంగా రాసారు. చెయ్యితిరిగిన చిత్రకారుడు గీసినట్టుగా ఉంది. (బ్లాగు పేరు కింద ఉపశీర్షిక మాత్రం ఇంగ్లీషులో రాసారు -గులాబీ కింద ముల్లులా)

ఈనెల బ్లాగులు

 1. తలనొప్పా?.. అయితే ఇది వాడండి. మీ నొప్పి తగ్గాక (తగ్గి తీరుతుంది లెండి!), మీ నానమ్మకు కూడా వాడి చూడండి. మా ఈనెల జాబు ఇది.
 2. సాలభంజికలు నాగరాజు నేలకొరిగిన ఇంద్రధనస్సు మా ఈ నెల జాబుల్లో రెండోది. సినిమా అభిమానులందరికీ ఈ జాబు పఠనీయం.
 3. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ మంత్రి ఒకరు చేసిన వ్యాఖ్యపై డల్లాస్ తెలుగు వెన్నెల వ్యంగ్య ధోరణిలో విసిరిన చెణుకు పాడిగేదెలు-దున్నపోతులు. ఈ నెల జాబుల్లో ఇది మూడోది

అనామకుల గోల
ఈ నెల జాన్ హైడ్ కనుమూరి అనామక వ్యాఖ్యాత బారిన పడ్డారు. కానీ, అయన మాత్రం ఎంతో సంయమనంతో, ఓర్పుతో, హుందాగా ఎదుర్కొన్నారు. కాగా, వింజమూరి విజయకుమార్ తన బ్లాగులో అనామకునికి వాత పెట్టారు. ఆ విశేషం చూడండి.

————–

పాఠకులకు కొన్ని ప్రశ్నలు:

తెలుగు బ్లాగులకు సంబంధించిన కొన్ని అనల్ప ప్రశ్నలిక్కడ ఇస్తున్నాం. సమాధానాలు రాయండి.

 1. అత్యధికంగా బ్లాగులు (జాబులు కాదు) కలిగిన బ్లాగరి ఎవరు?
 2. అక్షరాల పరిమాణంలో అతిపెద్ద బ్లాగు శీర్షిక కలిగిన బ్లాగు ఏది?
This entry was posted in జాలవీక్షణం and tagged , . Bookmark the permalink.

14 Responses to జనవరి నెల తెలుగు బ్లాగుల కథా కమామిషూ!

 1. radhika says:

  1 జ్యోతిగారు
  2 కొత్తబంగారులోకం

 2. మొదటిది అందరికీ తెలిసిందే జ్యోతి గారు :)
  రెండోది తెలీదు.

  ఇది చాలా బాగుంది. అన్ని మంచి టపాలనూ ఓ చోట గుది గుచ్చడం.

 3. venkat says:

  ఈ నెల తెలుగు బ్లాగ్ప్రపంచంలో మరొక విశేషం కూడా జరిగింది. సినిమాలపై ఆసక్తి ఉన్న కొంతమంది బ్లాగర్లు కలిసి నవతరంగం అనే వెబ్‍పత్రిక స్థాపించాము.సినిమా సెక్షన్ లో మా గురించి ఒక ముక్క రాస్తే బావుండేదేమో! ఒక వేళ మా సైటు బ్లాగు కాదని అనుకున్నా సాటి బ్లాగర్లు స్థాపించిదేగా!

 4. వెంకట్ గారూ, నవతరంగంపై ఒక వ్యాసం రాబోతోంది, ఈ నెలలో. అంచేత ఇక్కడ దాన్ని ఉదహరించలేదు. కానీ, రాసి ఉంటే బాగుండేదని మీ వ్యాఖ్య చూసాక అనిపించింది.

 5. మీ ఎత్తుగడ అభినందనీయం. రచయిత పొద్దు అని వ్రాయడానికి గల కారణం ఇది సమిష్టి కృషి అవడమేనని నాకు అనిపిస్తుంది. వ్రాసిన వారికి కృతజ్ఞతలు.

  ఇక జనవరి నెలలో నా సుందరాతిసుందరమైన అందము బ్లాగులోని టపా ఒక్కదానిని కూడా ప్రస్థావించనందుకు నాకు చాలా బాధగావుంది. దీన్ని నేను ఖండిస్తున్నాను.

  అన్నట్లు కృష్ణ మోహన్ గారికి కూడా నాలుగు బ్లాగులు వున్నట్టున్నాయి…

 6. cbrao says:

  జనవరిలో వచ్చిన టపాలు, ఒకటా, రెండా? అసంఖ్యాక, టపాలు చదివి, సమీక్షించటం, కత్తి మీద సామే. ఈ విషయంలో మీ సమీక్ష, విజయవంతమైందని చెప్పవచ్చు. సమీక్షకుడు చదువరికి అభినందనలు.

 7. venkat says:

  ఈ ప్రయత్నాన్ని ఇలాగే కొనసాగించాలని నా ప్రార్థన. నా వంతు సహాయం నేను చేస్తాను.

 8. అ త్యధిక బ్లాగులుండీ ఒక్కదాన్లోనూ రాయని ఘనత ఎవరిదంటే .. ఎప్పుడూ కృష్ణమోహన్ని ఎంచుకోవాల్సిందే :-)
  ఓయ్‌ మిత్ర కేసరీ, ఇదొక స్నేహ పూరిత ఎత్తిపొడుపు మాత్రమే, కాస్త గుచ్చుకుని నువ్వు మళ్ళీ రాయడం మొదలెడితే .. అంతకు మించి కావల్సిందేముందీ?
  అఋణులకి .. అదే .. పొద్దు రధ సారధులకి ..అనేకానేక అభినందనలు. ఇది సూపరైడియా .. ఆంధ్రుల ఆరంభశూరత్వం చందం కానివ్వకండి, ప్లీజ్!

 9. sai babu says:

  good and nice

 10. రాకేశ్వరరావు గారూ, మీ బ్లాగును మరువగలమా!! (ఈనెల రాయని వారు అని ఓ విభాగం పెట్టి ఉండాల్సింది మేము. :) ) మీదీ, గిరి గారి “అనుకుంటా”, స్మైల్ రాయలవారు, ఇలా ఇంకొన్ని ప్రముఖ బ్లాగులున్నాయి. వచ్చే నెల సమీక్షలోనైనా మీరంతా మా కలానికి దొరుకుతారని తలుస్తూ, దొరకాలని కోరుకుంటూ..

  కొత్తపాళీ గారూ, అలాగేనండి! వచ్చే నెల నుండి మరింత సమగ్రంగా ఉండేందుకు కృషిచేస్తాం.

 11. sapthagiri says:

  ee blagu chaala baagundi. veetigurinchi andariki cheppali.

 12. @ పొద్దు ..
  ఈ నెల కుంబకర్ణ బ్లాగులు అని ఒక వర్గం పెడితే సరిపోతుందేమో.. :)

 13. నేను రాసిన టపా గురించి పొద్దులో చూసి చాలా ఆనందపడ్డాను…కృతజ్ఞతలు (నెనర్లు అనాలి కాబోలు..)

 14. vijaykumar v says:

  happy samkranti my all ftiends.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *