కనులు మూస్తే –
చుట్టూ వెలుతురున్నా నన్నలుముకున్న చీకటి
నా చీకట్లోనే ఎన్నో వెలుగులూ
ఆ నలుపు లోనే ఎన్నో రంగులు!కళ్ళు తెరిస్తే –
ఆ రంగులకీ, వెలుగులకీ చీకటి!
నాకు మిగిలినవి
కలిగిన కలల అస్థిపంజరాలు!
-అసూర్యంపశ్య
“ఆధునిక తెలుగు సాహిత్యపు లోతులను తరచి చూడటానికి ప్రయత్నిస్తున్న ఒక మామూలు నెటిజెన్ ని” అంటున్న అసూర్యంపశ్య తాను కవయిత్రిని కాకపోయినా రకరకాల కారణాల వల్ల కవితలు రాయడానికి ప్రయత్నిస్తానని అంటున్నారు.
అద్భుతం గా వుందండి. మీ కవితలు వేరే సైట్ లో కూడా చాలా చదివాను.ఒక విధం గా చెప్పాలంటే నేను మీ అభిమానిని.[వారు మీరు ఒక్కరే కదా?]
తెలుగుపీపుల్.కాం లో రాసింది అయితే నేనే అండి రాసింది… ఇంకే సైటు లోనూ కవితలు రాయలేదు. మీ అభిమానానికి కృతజ్ఞురాలిని 🙂
మీ కవిత బావుంది.
మీరు ఆవకయలో కూడా రాస్తుంటారు కదా?
మూడు నాలుగు సార్లు చదివాక కూడా దేని గురించో అర్థం కాలేదు. ఏదో చిక్కుముడిలా అనిపించింది. అప్పుడు శీర్షిక చూస్తే … ఓహ్ కల గురించా… అనుకుని మళ్లీ చదివా..
చాలా చాలా బాగుంది.
మీఱీ ఎనిమిది పాదాలేకాకుండా ఒక పేజీ మొత్తం వ్రాయవలసింది.
ప్రొద్దులో ప్రతి నెలా వ్రాస్తున్నారుగా.. మంచిది.
అసూర్యంపశ్య అంటే సాఫ్టువేర్-ఇంజనీర్ అని అర్థం వస్తుందని ఎక్కడో చదివా… 😀
@వెంకట్ గారు: ఆవకాయ లో కూడా రాస్తున్నాను.
రాకేశ్వరరావు: పొద్దు లో ప్రతి నెలా రాస్తున్నానా? :)) సరే..ప్రయత్నిస్తాను..
కలిగిన కలల అస్తిపంజరాల్లో కొంచెం కంఫ్యూజన్ అనిపించింది నాకు.సహజంగా కలగటం వేరే దాని వల్ల,లేదా కలిగిన వారు అంటే బాగా డబ్బున్న వారు,కళ్ళుకలిగాయి అంటే కళ్ళకలక లాంటి చిన్న రుగ్మత,
వగైరాలున్నాయి. మరి మీకలగటం ఏమిటో కొంచెం చెప్పండి.
అసూర్యంపశ్య అంటే ఎండ కన్నెఱుగని అంటొంది నిఘంటువు మీపేరు మీఇష్టమనుకోండి,కానీ ఈకాలాన్ని బట్టి చూస్తే అది కేవలం సెల్ఫ్ పిటి గా కనిపిస్తుందేమో చూడండి.
ఇంకొక్క మాట ఏమిటంటే మీ అసలు పేరు సీత,జానకి,లేదా అంజలి అయ్యుండాలి కరక్టేనా?