సరైన సమాధానాలు పంపినవారు:
తప్పుల్లేకుండా: బి. కామేశ్వర రావు
ఒకటి రెండు తప్పులతో: సత్యసాయి, స్వాతి కుమారి
మూడు నాలుగు తప్పులతో: కొత్తపాళీ, శ్రీరామ్
అసంపూర్తిగా పంపిన వారుః చిట్టెళ్ల కామేష్, చరసాల ప్రసాద్
ప్రయత్నించినవారందరికీ అభినందనలు!
1క | కా | 2వి | 3క | లు | 4ఋ | ష్య | 5మూ | 6కం | |||
డ | 7ను | సి | 8హె | మ్మిం | గ్వే | 9ల | స | 10బ | |||
గొ | వీ | 11ము | 12దం | చు | 13డ | ||||||
ట్టు | ధి | ళ్ళ | 14వే | 15రి | 16సా | ట | బా | ||||
17ల | పూ | వి | టర్ | గ్ని | |||||||
18చ | చ్చి | న | 19వా | డి | 20క | ళ్ళు | 21చా | 22రె | డే | 23సి | |
స | గు | ళం | 24సో | జా | 25గ | 26డి | |||||
27స | ర | 28మ | 29కం | 30ద | 31కా | ని | ప | ని | |||
32భా | స్వ | రం | 33ష్టి | 34డ | మ | రు | ట్ల | ||||
35మ | తి | 36కౌ | ము | ది | లు | 37గో | 38డ | ||||
ర్యా | 39రా | ర | 40ప | 41వే | 42త్రం | ఆ | |||||
ద | 43కా | ర్త | వీ | ర్యా | ర్జు | ను | డు | వి |
ముఖ్యమైన ఆధారాలకు వివరణః
అడ్డం:
- 7. “నువ్వు చూసి” పదంలో రెండు చివర్లా చూస్తే “నుసి” – పాతకొయ్య నుంచి రాలేది.
- 24. “సోజా రాజకుమారీ సోజా” అనేది సైగల్ పాట. అందువల్ల = సో (ఆంగ్లం), పోమ్ము = (జా), పడుకో = సోజా(2)
- 27. సరమ అనేది హిందూ పురాణాల్లోని ఒక కుక్క పేరు.
- 40. “పదవే” అని తొందరపెడుతున్న మోహనాంగి. నడుం కంటికి కనబడదు?
- 43. రాముడికన్నా ముందు కార్తవీర్యార్జునుడు, వాలి రావణుడిని ఓడించినవారు. కార్తవీర్యార్జునుడికి వెయ్యిచేతులు.
సరమ కథ పూర్వగాథాకల్పతరువు (రచయిత: ఆర్వీయార్) లో ఉన్న ప్రకారం: “దేవతల శునకం. ఇంద్రుడు గోమేథం చెయ్యబోయేడు. కొన్ని గోవుల్ని తెచ్చేడు. సరమను వాటికి కాపలా ఉంచేడు. దనుజులు వాటిని యెత్తుకుపోయేరు. సరమ దనుజుల దగ్గర లంచం పుచ్చుకుంది. అంచేత అవి దారితప్పేయని బొంకింది. అప్పుడు దాన్ని ఇంద్రుడు తన్నేడు. అది పారిపోయింది. దాన్ని తరుముకుంటూ ఇంద్రుడు వెళ్ళేడు. అక్కడ ఇంద్రునికి రాక్షసులు కనిపించేరు. వాళ్ళను సంహరించేడు .”
నండూరి రామమోహనరావుగారి విశ్వదర్శనంలో ఉన్న ప్రకారం ఇంద్రుడి దూతిగా గోవులెత్తుకొపోయిన పణులు అనే అనార్యులతో దౌత్యం నడిపి గోవులని రక్షించిన దేవతా శునకం సరమ.
ఈ ఆధారానికి ఆధారం “పదవే” అనే పదం. నడుం అంటే మధ్య అక్షరమైన ద. “పదవే”లో అది కాస్తా పోగా మిగిలింది ‘పవే’.
నిలువు:
- 1. చివరి కట్టు గొడవపెట్టకుండా విప్పండి (4)
- 4. సత్యవతి కొడుకు = వ్యాసుడు. వ్యాసుడు విభజించినవి వేదాలు, అందులో మొదటిది ఋగ్వేదం.
- 11. కంటకాలు = ముళ్ళు, అందగాడు = రమణ (ముళ్లపూడి) (4).
- 21. వాయిలీనం చాసో రాసిన ఒక సుప్రసిద్ధమైన కథ. చాసో నోట్లో ఎప్పుడూ ఉండే చుట్ట కూడా ప్రసిద్ధమే..
- 39. వృద్ధిపొందిన చంద్రకళ
చంద్రకళల గురించి యజుర్వేదంలో ఇలా ఉంది:
సినీవాలి: అమావాస్య,
రాకా: చంద్రోదయం నుంచి పున్నమి వరకు వృద్ధి చెందే దశ(శుక్ల పక్షం),
అనుమతి: పున్నమి,
కుహు: పున్నమి నుంచి అమావాస్య వరకు(కృష్ణపక్షం).బ్రౌను నిఘంటువులో రాకా అంటే ఇలా ఉందిః The day of full moon. purnacandrudugalapunnama. rakacandrudu the full moon.
రాకేందుబింబం, రాకేందువదన అనే పదాలు ప్రకాశవంతమైన పున్నమిచంద్రుణ్ణి ఉద్దేశించినవే. సినీవాలి పేరుతో ఆరుద్ర ఒక కావ్యం రాశారు. అందువల్ల ఈ పదాలు-అర్థాలు తరచు వెలుగుచూస్తుంటాయి. - 41. అక్రమంగా ప్రవర్తించిన ఒక రాజు. తెగ్గోస్తే కదా పృథువు పుట్టేది? (వేను) (2).
ఇదొక anagram. ఆధారంలో “చివరి” అనేది మనకి కావలసిన మాటకి అర్థం. తర్వాతొచ్చే కట్టుగొడవ లోని మొదటి నాలుగక్షరాలు కలగలపాల్సిన అక్షరాలు. “విప్పండి” అనే మాట ‘ఇదొక anagram’ అని సూచిస్తుంది. దీన్ని కామేశ్వరరావు గారు, కొత్తపాళీ గారు మాత్రమే సరిగా పూరించారు.
వేనుడనేవాడు ఒక గొప్ప రాజు. ఐతే అతడు తర్వాత దుష్టుడుగా మారడంతో కొంతమంది ఋషులు కోపించి అతణ్ణి చంపేస్తారు. అతడి తొడను మథించి అతడిలోని దుష్టత్వాన్నంతా తొలగిస్తారు. తర్వాత అతడి చేతిని మథించగా శ్రీమహావిష్ణువు అవతారమైన పృథువనే గొప్పరాజు పుడతాడు. వేనుడు అనే పేరులో ‘డు’ను తెగ్గోశాం ఇక్కడ.
Pingback: పొద్దు » Blog Archive » 2009 మే గడిపై మీమాట