ఈ సారి మరీ కష్టం గా ఉందండి.
అలా అని మానుకోనూ లేము, పూర్తి చేయనూ లేము.
ఎంత హింస 🙁
నాకు ఒక ఐదారు పదాలు తప్ప అసలు కదలట్లేదు.
మిగతా వారికి ఎలా ఉందో? ఎవరూ మాట్లడట్లేదు.
నాక్కొంచెం అనుమానంగా ఉంది. సత్యసాయి గారు (వుడ్ హౌస్ హీరోలా) ఎర్ర రంగు టై కట్టుకున్న మారు వేషంలో సిముర్గ్ గా గడిని కూర్చి పచ్చరంగు టై కట్టుకున్న అసలు వేషంలో సత్యసాయిగా వచ్చేసి గడి నింపేస్తున్నారేమోనని – అసూయ నిండిన చూపులతో ….:-)
మరీ అందరూ అందర్నీ ఇలా పచ్చ కామెర్ల కళ్ళతో చూసి పరస్పరం అనుమానించుకోవటం ఏం బాలేదండీ.
ఇక పోతే గడి మీద నా కామెంట్స కొన్ని:
1. ఆధారాలు చూస్తుంటే నింపే మాట అటుంచి కవిత్వమో, పురాణాలో, వ్యాసమో చదువుతున్నట్టు అనిపించింది.
2. వీటి వల్ల కొత్త సందేహాలు రావటం వాటికి సమాధానం తెలుసుకోవటం నాలా తెలిసీ తెలియని వారికి చాలా పనికొస్తుంది.
3. బుర్ర లో ఎక్కడొ మూలన పడి ఉన్న విషయాలన్నీ బయటకి లాగుతుంది ఈ గడి.
4. అధారాలు క్లుప్తం గా ఉండి కూడా సమాధనం స్ఫురిమ్పజేయొచ్చు కానీ, ఇప్పుడు ఇస్తున్న పద్దతి విలక్షణం గాచదవటం లో ఆనందాన్నిచ్చేది గా ఉంది.
5. సిముర్గ్ గారు ఎవరో కానీ చాలా తెలివైన , గడుసైన వారిలా ఉన్నారు. మా అందరికి పని కల్పిస్తున్నందుకు ధన్యవాదాలు.
సిముర్గ్ గారు ఈ సారి మన తెలుగు ఫ్యాక్షన్ చిత్రాలు ఏవో చూస్తూ ఈ గడి తయారుచేసారేమో అనిపిస్తోంది నాకు. ఎక్కడచూసినా కోతలూ, తెగ్గోతలూ…చలా వయొలెంట్‌గా ఉంది ఈసారి గడి.
గత గడికన్నా చాలా క్లిష్టంగా ఉంది. కానీ నాకెందుకో ఏప్రిల్ గడే ఎక్కువ ఇష్టంగా అనిపించింది. కాస్త అస్పష్టత పాలు ఎక్కువైనవల్లో లేక నా స్థాయికి అందకపోవడంవల్లో…
నా అభిప్రాయంలో సిముర్గ్ మంచి చమత్కారి అయుండాలి. ఆ చమత్కారం ముఖ్యంగా 37,38,42 ఆధారాల్లో నాకు కనిపించింది. కాకపోతే ఆధారాలు 40,41 మాత్రం అస్పష్టంగా ఉన్నాయనిపించింది. మిగిలిన వారేమంటారో. గడి 39 కి ఇచ్చిన ఆధారం రెండు వేరువేరు పేజీలలో వేరేగా రావడం ఏమిటో అర్ధం కాలేదు కాని నా పని సరళతరం చేసింది.
గడిలో కొన్ని పదాలకు ఒకటికంటే ఎక్కువ ఆధారాలు ఆలోచించి వాటిలో ఏది బాగుంటే దాన్ని చివరగా ఆమోదించడం జరుగుతుంది. మే గడిని అప్లోడు చేసేటప్పుడు జరిగిన చిన్న పొరబాటువల్ల ఒకదాని బదులు ఇంకొక ఆధారం చేర్చడం, ఆ వెంటనే దాన్ని సవరించడం జరిగింది. మీ బ్రౌజరు కాషెలో మొదటి ఆధారం అలాగే ఉండిపోవడం వల్ల రెండు రకాలుగా వచ్చి ఉండవచ్చు.
గడి రూపంలో తప్పున్నట్టుంది. 17 నుంచి రెండు Xలు దాటి కుడికి వస్తే .. అక్కడ ఒక మూడకషరాల మాట మొదలవుతోంది.
లేదండీ కొత్తపాళీ గారూ!
ఆ వరుసలో ఆరవగడిలో కూడా X ఉంది. ఇప్పుడు కనబడుతోంది చూడండి.
గ్రహించాను. నింపటం మొదలు పెట్టగానే అర్థమైంది. ఈ సారి ఆధారాల్లో వాచాలత కొంచెం ఎక్కువైందనిపిస్తోంది. ఎంత క్లుప్తంగా ఉంటే అంత మంచిది.
ఆధారలు 39 నిలువు రెండు పేజీలలో రెండు రకాలుగా ఉన్నాయి. సరిచూడండి. ఈ పేజీనుండి గడిపేజీలోకి వెళితే ఒకలాగ, మెయిన్ పేజీనుంచి గడిపేజీలోకి వెళితే ఒకలాగ ఉంది.
కొత్తపాళి వ్యాఖ్యతో నేనూ ఏకీభవిస్తున్నాను.
ఈ సారి మరీ కష్టం గా ఉందండి.
అలా అని మానుకోనూ లేము, పూర్తి చేయనూ లేము.
ఎంత హింస 🙁
నాకు ఒక ఐదారు పదాలు తప్ప అసలు కదలట్లేదు.
మిగతా వారికి ఎలా ఉందో? ఎవరూ మాట్లడట్లేదు.
కొవ్వలి సత్యసాయి గారు మొదటిరోజే నింపి పంపేశారు. 🙂
మీదే ఇక ఆలస్యం.
నాక్కొంచెం అనుమానంగా ఉంది. సత్యసాయి గారు (వుడ్ హౌస్ హీరోలా) ఎర్ర రంగు టై కట్టుకున్న మారు వేషంలో సిముర్గ్ గా గడిని కూర్చి పచ్చరంగు టై కట్టుకున్న అసలు వేషంలో సత్యసాయిగా వచ్చేసి గడి నింపేస్తున్నారేమోనని – అసూయ నిండిన చూపులతో ….:-)
కొత్తపాళీగారు షెర్లాక్హోం లాగా డిటెక్టివ్ అయిపోయారు- ESP తో అన్నీ కనిపెట్టేస్తున్నారు. పరీక్షల్లో ముందువాడినుండి కాపీకొడితే, పట్టుబడకుండా ఉండడానికి కొన్ని తప్పుల్ని జొప్పించాలట. లేక పోతే పేపర్లు దిద్దేవారు అనుమానపడతారుట. కనిపెట్టిఉంటారు- సత్యసాయి ఒకటి రెండు తప్పులతో నింపడం. 🙂
ఏంచెయ్యమంటారు చెప్పండి- బ్లాగ్వ్యసనమే అనుకొంటే, ఇప్పుడు పొద్దు వ్యసనం, గడి వ్యసనం, తెలుగులో వ్రాయడం వ్యసనం, తెలుగు లిపిలోనే చదవడం వ్యసనం – ఈ బ్లాగర్లు, పొద్దువాళ్ళు ఇంకెన్ని వ్యసనాలు కనిపెట్టి అంటగడతారో. 64 కళలలాగా 64 వ్యసనాలు (అందులో 7 అసలువి, మిగిలినవి తెలుగు బ్లాగులవల్ల పుట్టినవి)అయిపోతాయేమో.
ఆలోచిస్తుంటే నాకూ అనుమానం వేస్తోంది. ఈ కొత్తపాళీ యే ముసుగువీరుడే(సిముర్గ్)మోనని. గమనించారా! గడి నింపడానికి నిరాశ పడుతున్న వాళ్ళకి కొంచెం టానిక్ ఇస్తున్నారు.
మరీ అందరూ అందర్నీ ఇలా పచ్చ కామెర్ల కళ్ళతో చూసి పరస్పరం అనుమానించుకోవటం ఏం బాలేదండీ.
ఇక పోతే గడి మీద నా కామెంట్స కొన్ని:
1. ఆధారాలు చూస్తుంటే నింపే మాట అటుంచి కవిత్వమో, పురాణాలో, వ్యాసమో చదువుతున్నట్టు అనిపించింది.
2. వీటి వల్ల కొత్త సందేహాలు రావటం వాటికి సమాధానం తెలుసుకోవటం నాలా తెలిసీ తెలియని వారికి చాలా పనికొస్తుంది.
3. బుర్ర లో ఎక్కడొ మూలన పడి ఉన్న విషయాలన్నీ బయటకి లాగుతుంది ఈ గడి.
4. అధారాలు క్లుప్తం గా ఉండి కూడా సమాధనం స్ఫురిమ్పజేయొచ్చు కానీ, ఇప్పుడు ఇస్తున్న పద్దతి విలక్షణం గాచదవటం లో ఆనందాన్నిచ్చేది గా ఉంది.
5. సిముర్గ్ గారు ఎవరో కానీ చాలా తెలివైన , గడుసైన వారిలా ఉన్నారు. మా అందరికి పని కల్పిస్తున్నందుకు ధన్యవాదాలు.
సిముర్గ్ గారు ఈ సారి మన తెలుగు ఫ్యాక్షన్ చిత్రాలు ఏవో చూస్తూ ఈ గడి తయారుచేసారేమో అనిపిస్తోంది నాకు. ఎక్కడచూసినా కోతలూ, తెగ్గోతలూ…చలా వయొలెంట్‌గా ఉంది ఈసారి గడి.
గత గడికన్నా చాలా క్లిష్టంగా ఉంది. కానీ నాకెందుకో ఏప్రిల్ గడే ఎక్కువ ఇష్టంగా అనిపించింది. కాస్త అస్పష్టత పాలు ఎక్కువైనవల్లో లేక నా స్థాయికి అందకపోవడంవల్లో…
నా అభిప్రాయంలో సిముర్గ్ మంచి చమత్కారి అయుండాలి. ఆ చమత్కారం ముఖ్యంగా 37,38,42 ఆధారాల్లో నాకు కనిపించింది. కాకపోతే ఆధారాలు 40,41 మాత్రం అస్పష్టంగా ఉన్నాయనిపించింది. మిగిలిన వారేమంటారో. గడి 39 కి ఇచ్చిన ఆధారం రెండు వేరువేరు పేజీలలో వేరేగా రావడం ఏమిటో అర్ధం కాలేదు కాని నా పని సరళతరం చేసింది.
కామేశ్ గారూ!
గడిలో కొన్ని పదాలకు ఒకటికంటే ఎక్కువ ఆధారాలు ఆలోచించి వాటిలో ఏది బాగుంటే దాన్ని చివరగా ఆమోదించడం జరుగుతుంది. మే గడిని అప్లోడు చేసేటప్పుడు జరిగిన చిన్న పొరబాటువల్ల ఒకదాని బదులు ఇంకొక ఆధారం చేర్చడం, ఆ వెంటనే దాన్ని సవరించడం జరిగింది. మీ బ్రౌజరు కాషెలో మొదటి ఆధారం అలాగే ఉండిపోవడం వల్ల రెండు రకాలుగా వచ్చి ఉండవచ్చు.
నేను చేతులు పైకెత్తేశాను. ఎవరైనా నన్నెత్తుకుంటే తప్ప దించను.
@రానారె: మీ చేతులు కాస్త మిమ్మల్ని ఎత్తుకోగలవారు, దించగలవారు అయిన కొత్తపాళీ గారికి కనిపించేలా ఎత్తండి. 🙂