బ్లాగరుల ప్రవర్తనా నియమావళి

Sudhakarసుధాకర్ రాసే తెలుగు బ్లాగు శోధన 2006లో ఇండిబ్లాగర్స్ నిర్వహించిన పోటీల్లో, 2005లో భాషా ఇండియా వారు నిర్వహించిన పోటీల్లో అత్యుత్తమ తెలుగు బ్లాగుగా ఎంపికైంది. ఆయనదే మరో బ్లాగు Savvybytes ఆంగ్లంలో అత్యధికులు చదివే బ్లాగు. వీటిలో శోధనలో ఆయన ఆలోచనల్లోని పదును తెలుస్తుంది. Savvybytes సాంకేతికోపకరణాలు, సాంకేతికాంశాలకు సంబంధించినది. coolclicks ఆయన ఫోటో బ్లాగు. ఇవికాక ఆయన తక్కువ తరచుగా రాసే బ్లాగులు ఇంకో రెండున్నాయి. పొద్దులో సుధాకర్ నిర్వహిస్తున్న శీర్షిక వివిధ.

————————

బ్లాగు అన్నదే సొంత భావాలను ఆలవోకగా, ఇష్టం వచ్చిన శైలిలో రాసుకుపోయేది. మరి అలాంటి పదార్ధానికి ఈ ప్రవర్తనా నియమావళి ఏమిటో అని ఎవరైనా అనుకోవచ్చు. కానీ మనం ఒక్క సారి బ్లాగును అందరికి చదవటానికి వీలుగా అందుబాటులో (public blog) వుంచామంటే, ఒక్క సారిగా మనపై కొన్ని బరువు బాధ్యతలు పడతాయి. అవే మన ప్రవర్తన, సంయమనం మొదలయినవి. మన బ్లాగులో రాసే విషయాన్ని అభిమానించే వారు, చదివి నొచ్చుకునే వారు, శభాష్ అనే వారు మొదలుకుని, బూతులు తిట్టే వారు కూడా మన బ్లాగావరణంలో వుంటారని మనకు పదే పదే గుర్తుచేసేదే ఈ బ్లాగరుల ప్రవర్తనా నియమావళి.

దీనిని మొదట రాసినది Tim O’Reilly.(ఇతడు web 2.0 అనే పదాన్ని మొదట వాడిన ఖ్యాతి మూటగట్టుకున్నవాడు కూడా). దీనిని ప్రస్తుతం Draft దశలో వుంచారు. ప్రస్తుత బ్లాగుల ప్రపంచాన్ని పరిశోధిస్తూ, దానికి కొత్త విషయాలను జత చెయ్యటానికి నిర్ణయించారు. ఆ ప్రతి ప్రకారం ప్రతి బాధ్యతాయుతమైన బ్లాగరు ఈ క్రింది విధంగా తన బ్లాగును నిర్వహించాలి.

“మనము ఇప్పటి వరకు బ్లాగులను పరివిధాలుగా అస్వాదించాము, అభిమానించాం. ఎందుకంటే అవి నిక్కచ్చిగా , నిజాయతీగా వుండే విషయ సంవాదాన్ని మనకు అందిస్తాయి. కానీ నిజాయతీ ఎప్పుడూ అనాగరికతకు మరో అర్ధంగా నిలవదు. నిలవకూడదు. మనము క్రింద పేర్కొన్న బ్లాగరుల ప్రవర్తనా నియమావళిని ఒక మంచి భావ వ్యక్తీకరణకు, మంచి సంస్కృతికి దోహదపడే విధంగా తయారు చేద్దాం. తద్వారా ఆరోగ్యకరమైన బ్లాగు సంవాదాలను ప్రోత్సహిద్దాం .

# మనం వాడిన భాషకు, పదాలకు మరియు మనం అనుమతించిన వ్యాఖ్యలకు మనదే పూర్తి భాధ్యత. మనం నాగరికతతో కూడన విషయాన్ని ప్రోత్సహించుతాం . అనాగరిక విషయాలు మన బ్లాగులో చోటు చేసుకుంటే, వ్యాఖ్యలలో వుంటే వాటిని తీసి వెయ్యటం మన భాధ్యత . అనాగరిక విషయాలను క్రింది విధంగా వర్గీకరించవచ్చు.

1. తిట్టటం , వుద్దేశ్యపూర్వకంగా కించపరచడం, అజ్ఞాతంగా కించపరచటం, బెదిరించడం వంటివి .
2. అబద్దాలు , తప్పుడు సమాచారం ఇవ్వటం, వుద్దేశపూర్వకంగా సమాచారాన్ని మార్చి రాయటం , ఇంకొక వ్యక్తిని తప్పుగా చిత్రించటం
3. కాపీ హక్కులు , వ్యాపార హక్కులను ఉల్లంఘించటం
4. రహస్యంగా వుంచవలసిన దానిని బట్టబయలు చెయ్యటం
5. ఇతరుల వ్యక్తిగత జీవితాలతో ఆడుకోవటం, వారి వ్యక్తిగత విషయాలపై రాయటం

పైన పేర్కొన్న అనాగరిక విషయాలను సమయం, సందర్భం బట్టి విచక్షణ వుపయోగించి గుర్తించవలసి వుంటుంది . అలానే అవి పైన పేర్కొన్న విషయాలకు మాత్రమే పరిమితి కావు. మనం ఏదైనా విషయాన్ని, వ్యాఖ్యను తొలగించే ముందర దానిని ఎందుకు తొలగించవలసి వచ్చిందో చెప్తాము.

# మనం వ్యక్తిగతంగా ఎవరితోనైనా దేనిని చర్చించమో, ఎలాంటి అభిప్రాయం వెల్లడించమో , అది మనం మన బ్లాగులో కూడా వెల్లడించం, చర్చించము .
# పది మందిలో వ్యక్తీకరించేటప్పుడు వ్యక్తిగతంగా చర్చించుతాం

1. బ్లాగావరణంలో తోటి బ్లాగరులతో కానీ, ఇంకొకరితో గానీ సమస్యలు, అభిప్రాయబేధాలు వచ్చినపుడు దానిపైన ప్రతిస్పందించే ముందర వారితో వ్యక్తిగతంగా మాట్లాడటమో, వ్యక్తిగత సంవాదమో చేస్తాము.

# ఒకరు మన తోటి బ్లాగరుపై అనాగరికంగా, అసమంజసంగా దాడి చేస్తున్నట్లు అనిపిస్తే చర్య తీసుకుంటాము .

ఎవరైనా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు కానీ, అభ్యంతరకరమైన, అనాగరికమైన బ్లాగులు రాస్తూ వుంటే, ఆ బ్లాగరుతో వ్యక్తిగతంగా గానీ, పాఠకముఖంగా గానీ వాటిని మార్చమని విన్నపం చేస్తాము. అలా కాక వ్యాఖ్యలు ఒక బెదిరింపు క్రింద మారి, ఆ బ్లాగరు అస్సలు ఖాతరు చెయ్యకుండా, లేదా బ్లాగు ముఖంగా క్షమాపణ చెప్పకపోతే తరువాత జరిగే న్యాయపరమైన చర్యలకు అందరూ సహకరిస్తాము.

# అనామక వ్యాఖ్యలను అనుమతించం

వ్యాఖ్యలను చేసేవారు తప్పని సరిగా తమ ఈ-మెయిల్ చిరునామా, తమ అసలు పేరు గానీ, మారు పేరు గానీ వుపయోగించేలా చూసుకోవాలి.

# వ్యాఖ్యల దాడి చేసే వారిని మనం పట్టించుకోకూడదు.

వ్యాఖ్యల దాడిని పట్టించుకోకూడదు. అవి మరీ అభ్యంతరం, వ్యక్తిగతం అయితే తప్ప. వ్యాఖ్యల ద్వారా దాడి చేసే వారితో ప్రతి వ్యాఖ్యానం మొదలు పెట్టడం పందితో మల్లయుద్ధం చెయ్యటమే అవుతుంది. ఆ యుద్ధంలో ఇద్దరికీ బురద అంటుకుంటుంది. పందికి బురద ఇష్టం, మీకు అయిష్టం. అది గుర్తుపెట్టుకోండి.

అంతేకాక ఏ విషయాన్ని అయినా అహ్వానించే బ్లాగర్లకు “ఏ విషయం అయినా” అనే ఒక బ్యాడ్జి వుండాలని నిర్ణయింపబడింది. ఇది వ్యాఖ్యలు చేసే వారికి వారు ఒక ఎల్లలు లేని ప్రదేశంలో అడుగుపెడుతున్నారని సూచిస్తుంది. అదే కాక ఈ బ్యాడ్జితో పాటు దిగువ చూపిన విధంగా సందేశం వుండాలి.

“ఇది ఒక స్వేచ్చాపూరితమైన, అనియంత్ర్రిత చర్చా వేదిక. ఈ వేదికపై చర్చలకూ , పాఠకులు చేసే వ్యాఖ్యలకూ నేను బాధ్యత వహించనని తెలియచేస్తున్నాను. ఇక్కడ విషయ సంవాదాలు వేడెక్కినప్పుడు కొన్ని అభ్యంతరకరమైన వ్యాఖ్యలు, అవమానకర సందేశాలు కనిపించవచ్చు. మీ సొంత పూచీమీద ఈ బ్లాగ్వేదికను సందర్శించండి”

వ్యాఖ్యలపై సంపూర్ణ నియమావళిని ఇక్కడ చదవ వచ్చు : http://civilities.net/CommResp-Proposal

ఈ వ్యాసానికి మాతృక : http://radar.oreilly.com/archives/2007/04/draft_bloggers_1.html

This entry was posted in జాలవీక్షణం and tagged . Bookmark the permalink.

19 Responses to బ్లాగరుల ప్రవర్తనా నియమావళి

  1. radhika says:

    మంచి ఇన్ ఫర్మేషన్ ఇచ్చారు.

  2. ఇంట్లోకి చొరబడిన దొంగను ఆ ఇంటి మొగుడు గాఠ్ఠిగా పట్టేస్కుని “తాడు తేవే, వీణ్ణి కట్టేద్దాం” అని పెళ్లాన్ని పురమాయిస్తే, “జాగ్రత్తగా పట్టుకోండి వాడు మీ చెయ్యి కొరికి పారిపోతాడేమో” అని ఆ అమాయకురాలు – బిక్కచచ్చిపోయి ఉన్న ఆ దొంగకు మాంచి ఉపాయం చెప్పేసిందట. ఈ వ్యాసంలో సుధాకరు ఏం చెయ్యకూడదని మొదటి పాయింటు రాశారో అవే జరిగాయి ఈ మధ్య. వాగ్యుద్ధాలు సంయమనం కోల్పోయి అవాంఛిత బ్లాగ్యుద్ధాలయ్యాయి.

  3. నన్ను బాధించిన విషయమ్మీద స్పందించకుండా నిగ్రహించడం నాచేత కాలేదు. ప్చ్! నా బలహీనత!

    –ప్రసాద్
    http://blog.charasala.com

  4. ఆ టపాలో వ్యాఖ్యలు చదువుకుంటూ పోతే నా టపా నాకే గుర్తుకొచ్చింది. 🙂 అందుకని వ్యాఖ్యానించటమే ఆపేసా. నేను కూడా సమిధనొక్కటి అనే ది ఇక్కడ పనికిరాదని అర్ధం అయ్యింది. మనసులో వున్న మాట మాట్లాడటమే అనాగరికంలా మాట్లాడుతున్నారు ఇప్పుడు. ఎవరి భావం వారిది అనే గౌరవమే లేదు. నాదీ మీ మతమే. స్త్రీ అంటే నాకు తోటి మనిషి. నాలాంటి మనిషే. ఆ మనుష్యులలో నేను అత్యంత ప్రేమను పంచేది నా తల్లికి, చెల్లికి మాత్రమే. తరువాతే ఎవరైనా…

  5. lalitha says:

    I think MR.Ambanath respected my request to moderate the offensive comment. For, it is not there now. I posted a comment requesting him to moderate the offensive comment.

    Mr. Ambanath, it would help, and I think moderation is complete, only if an explanation is added. It is confusing to find comments appear and then disappear without explanation.

    I felt the need to use this platform for voicing my objection, as it was getting overheated on the original post, and also as I began losing credibility for the above reason(comments appearing and then disappearing).

  6. మీ సమస్యను గూర్చి కూడా ఈ వ్యాసం చెప్తుంది. మన బ్లాగుపై బాధ్యత వుంటే అనామక వ్యాఖ్యలను కత్తిరించెయ్యాలి. ఆ రకంగా మిగిలిన వ్యాఖ్యాతలను రక్షించవచ్చు. నేను బ్లాగు మొదలు పెట్టిన రెండున్నరేళ్ల సంవత్సరాల తరువాత వ్యాఖ్యానాల స్థాయి పడిపోకుండా వుండేందుకు మోడరేషన్ పెట్టుకోవాల్సివచ్చింది. తద్వారా నేను నా బ్లాగులో వున్న ప్రతీ పదానికి బాధ్యత వహించగలను.

  7. lalitha says:

    అది నిజమే.

    ఇక్కడ నేను పేరు చెప్పి ఇచ్చిన నా వ్యాఖ్య(ముందు వ్యాఖ్య మీద నా అభ్యంతరం) ప్రచురించ లేదు. ప్రచురించి వెనకకు తీసుకున్న వ్యాఖ్య విషయంలో కారణం చెప్ప లేదు.

  8. Lalitha gaaru,

    As per your request that other blogger removed anonymous comment which was made on you from his blog. But you have preserved that objectionable comment here on Poddu (which is totally not related to your conversation with that blogger) forever. please do not practice viral publication of objectionable content(even if it was targeted on you).

  9. lalitha says:

    Request to Poddu,

    please remove my comments (4 and 6). They are about a different blog. You could retain or use my present comment to explain why those comments have been removed.

    Thanks.
    lalitha.

  10. lalitha says:

    To poddu moderators:
    I think I should thank you for allowing my above comments here in the first place.
    I was at a loss about how to clear some of my doubts. Since you allowed the comments in question, I got a platform to voice my concerns. If you can remove the offensive comments and somehow still maintain the context of other comments, it will be a great help.
    This is the first time something like this happened. I hope everyone involved understands this. Some lessons cann’t be learned without making some mistakes.

    Ranare garu,
    in case I have any doubts to clear up with a blogger, if I have access to e-mail, I will use it.

    Sudhakar garu, please assert if that is allright.

    Sudhakar garu,
    It helps that you pointed out the concern in your comment (12). However, I find the usage of word viral publication objectionable. But again, I am realising that I am finding some things objectionable while they seem perfectly reasonable to some others. If this is one such case, please just note the way the word sounded to me is different.
    I don’t think I have been deliberately offensive or abusive of the commenting facility anywhere so far. So, you can expect that “viral publication” has not been and will not be my practice.

    To all bloggers,
    I might not be able to undo whatever effect my involvement on Mr.Ambanath’s post has had on you all individuals. I can only apologise.

    Sudhakar garu,
    as someone with some authority on blog ethics, please advise.

    Regards,
    lalitha.

  11. Sudhakar says:

    Lalitha garu, I don’t think you need to ask for apologies to anyone for your acts since there is nothing wrong with it. I was just suggesting a better way to deal things with heated up discussions with in bloggers. As you mentioned, poddu editors can delete your comment (as you mentioned) and still can manage a meaningful discussion on the issue that has caused.

    I used viral publication in general of blog ethics and do not take it seriously 🙂 According to blog sense, discussing and posting other blog comments and posts in different forums which are not related to the issue comes under viral publication, hence I used it. My sincere apologies if it sounded harsh to you. But I did not meant that much harsh at all. Keep up your spirit of blogging.

  12. lalitha says:

    Another mistake. Mr. Sudhakar’s comment 11.
    What did I get myself into!

  13. Sudhakar says:

    I didn’t get your point, Did my comment giving you any other meanings? Could you please elaborate it? I am confused with your comment now.

  14. Sudhakar says:

    And I am not interested to start another discussion or blogging thread on my comments on your comments here or anywhere. please excuse me if you did not liked my comment nor understand it. I might have failed in expressing my support to you in my earlier comment. Let’s wrap this up here.

  15. lalitha says:

    Sudhakar garu, Thanks for everything.

    I simply corrected the number I referred, kind of like spelling mistake.

    When I wrote that comment, your explanation was not even there. I do not know how the order got mixed up.

  16. ranganadh says:

    mee niyamavali chaala baagundi.naaku ela register avvalo dayachesi cheppandi

  17. ranganadh says:

    nenu ‘poddu’ blog gurinchi sunday eenadu paperlo chadivaanu. chaala wonderga anipinchindi.telugu vaariki ee seva chestunnanduku dhanyavaadamulu.

  18. రంగనాధ్ గారు,

    మీరుకూడా blogger.com లో గాని wordpress.com లోగాని ఒక బ్లాగు మొదలు పెట్టండి. తరువాత దాన్ని http://groups.google.com/group/telugublog లో అందరికీ మెయిలు చెయ్యండి. ఇంత కంటే మరే రిజిస్ట్రేషన్లు అవసరం లేదు.

    మీకు కంప్యూటరులో తెలుగు గురించి మరేవిధమయిన సమాచారం కావాలన్నా http://groups.google.com/group/telugublog లో అడగండి.

  19. Pingback: అభిప్రాయ సేకరణ: కూడలిలో కెలుకుడు బ్లాగులని ఉంచాలా? « వీవెనుడి టెక్కునిక్కులు

Comments are closed.