సంగీత సాహిత్యాలలో అపారమైన పరిజ్ఞానమున వారిలో తెలుగుబ్లాగులు రాస్తున్నవారిని వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు. అలాంటి అరుదైన బ్లాగరి కొత్తపాళీ. ఈసారి కథ-2005 వార్షిక కథాసంకలనంపై ఆయన రాసిన సమీక్షను సమర్పిస్తున్నాం. అలాగే స్వాతికుమారి వేసవి విశేషాలు, సరదా శీర్షికలో జ్యోతిగారి కనబడుట లేదు ప్రకటన చూడగలరు.
గడి గురించి ఒకమాటః గతనెల కంటే ఈసారి గడికి మంచి స్పందన లభించింది. గడిని ప్రకటించిన కొద్ది గంటల్లోనే దాదాపు పూర్తిగా నింపి పంపారు సత్యసాయిగారు. ఇప్పటికే మరికొన్ని సమాధానాలు అందడాన్ని బట్టి చూస్తే పొద్దు పాఠకులు అందిస్తే అల్లుకుపోగల సమర్థులని నిరూపితమైంది. గడిని పూరించినవాళ్ళు ఆ గడిలో తమకు బాగా నచ్చిన ఆధారాలకు వివరణలను పంపితే సమాధానాలతో బాటు ప్రచురించగలం. అలాగే ప్రస్తుతమున్న రీతిలో గడి పూరించడం కష్టమని మీరు భావిస్తున్నట్లైతే సులువైన ఆధారాలతో ఇంకో గడిని అందించడానికి ప్రయత్నిస్తాం. మీ అభిప్రాయాలు తెలియజేయగలరు.
-పొద్దు
సులువుగా వద్దులెండి. ఎప్పుడొ ఒకరోజు మేమే ఆ స్థాయి కి చేరుకుంటాం.గడి స్థాయి మాత్రం ఇలా ఉంటేనే పొద్దు కి గౌరవం, అది పూర్తి చేసే వారి మెదడు కి పని.చెరుకు గడ గట్టిగా ఉన్నా ఆ తీపి కోసమే కదా కష్టపది తినేది!
చెఱకు అయితే తినొచ్చు ఎలాగోలా పళ్ళతోనో కాదంటే కత్తితోనో చీల్చి. ఈ పొద్దు గడిని నింపడం మాత్రం నాకు కష్టమే!
కానీ ఒకే పొద్దులో రెండు గడులుంచడం ఎందుకో నాకంత సరైనదిగా అనిపించటం లేదు.
(పోనీ బాలల శీర్శికగా అందించండి ప్రయత్నిస్తాను. 🙂 )
–ప్రసాద్
http://blog.charasala.com
“గడి”ని ఈ స్ధాయి లో ఉంచితేనే పొద్దు కు గౌరవం ఇనుమడింపజేస్తుందని నా వ్యక్తిగతాభిప్రాయం.