మీలో మీ బాసుకు అసలు నచ్చని పది వికారాలు ఏవో తెలుసుకోవాలనుకుంటున్నారా? వివిధలో సుధాకర్ వాటి గురించే చెప్తున్నారు.
రాధిక గారి కవిత ఈ తరం గురించి చెప్తోంది.
ఇక సరదా శీర్షికలో జ్యోతి గారు ఈసారి ఆడాళ్ళ గురించి మగాళ్ళు చేసిన పరిశోధన ఫలితాలు చెప్పకుండా ఊరిస్తున్నారు.
ఇక ఈసారి ప్రత్యేక ఆకర్షణ, పైన చెప్పిన ప్రయోగం బ్లాగుల పేరడీలు.
పేరడీ అంటే జరుక్‌శాస్త్రి, జరుక్‌శాస్త్రి అంటే పేరడీ అన్నంతగా పేరడీలకు ప్రసిద్ధి పొందిన వెనుకటితరం కవి జలసూత్రం రుక్మిణీనాథశాస్త్రి. తర్వాత శ్రీరమణ పేరడీలు చాలా ప్రసిద్ధి పొందాయి.
వాళ్ళతో పోలికలు లేకపోయినా తెలుగు బ్లాగుల మీద పేరడీలు ప్రచురించే ప్రయత్నం చేశాం. ఈ ప్రయత్నం ఎలా ఉందో మీ అభిప్రాయాలు చెప్పండి. ప్రస్తుతం కొందరు బ్లాగరుల మీదే రాసినా అతిత్వరలో మరికొంతమంది బ్లాగులపై పేరడీలు రానున్నాయి. ఒక పేరడీ చాలని ఘనాపాఠీల మీద రెండేసి పేరడీలు కూడా రావచ్చు. కొందరు బ్లాగరులు రాసే వ్యాఖ్యలకు కూడా పేరడీలు సిద్ధంగా ఉన్నాయి. ఎవరి మీదైతే పేరడీ రాశామో వాళ్ళు మెచ్చుకున్నప్పుడే ఆ పేరడీ విజయవంతమైనట్లు. ఈ పేరడీలు మీకెంతవరకు నచ్చాయో, మిమ్మల్నెంతగా గిచ్చాయో తెలియజేయండి.
చాలా బాగా రాసారు. ప్రయొగం అదిరింది
తెలియజేయమని ప్రత్యేకంగా చెప్పాలా!!!!?