ఈ తరం

తెలుగు బ్లాగులు చదివేవారికి రాధిక గారి కవితలను ప్రత్యేకంగా పరిచయం చెయ్యవలసిన పనిలేదు. స్పందించే హృదయం గల రాధిక గారు వ్యాఖ్యలు రాయని బ్లాగూ ఉండదు. చాన్నాళ్ళ తర్వాత రాధిక గారు పొద్దుకు పంపిన కవిత “ఈ తరం”:

—————

అలారం మోతలతో
అలసట తీరకనే ఉలికిపాటు మెలకువలు
అలసిన మనసులతో
కలల కమ్మదనమెరుగని కలత నిదురలు

పోగొట్టుకున్నదాన్ని పోల్చుకోలేరు
పొందుతున్నదాన్ని పంచుకోలేరు
ఎందుకింత భారమయిన బిజీ జీవితాలు?
తృప్తి తెలియని చింతా చిత్తాలు?

పగలంతా క్షణాలకు విలువకట్టుకుంటూ
రాత్రంతా ఆనందాలకు అర్ధాలు వెతుక్కుంటూ….
ఇక ఇంతేనా ఈ తరాలు?
మార్పు తెచ్చేనా భావితరాలు!

-రాధిక (http://snehama.blogspot.com)
This entry was posted in కవిత్వం. Bookmark the permalink.

5 Responses to ఈ తరం

  1. లోతైన కవిత రాధికా.

  2. విజయ says:

    chaala bagundi…

  3. Sriram says:

    బాగుందడీ రాధికగారూ….మంచి కవిత అందించినందుకు అభినందనలు!

  4. భలే అడిగారండి. భావితరాల వరకు ఎందుకు, మనతరమే కాస్త వేగం తగ్గించుకోవచ్చు. ఈ విషయం ప్రతిరోజూ ఆలోచిస్తాను. ప్రశాంతమైన నిద్రకన్నా ఏదీ ముఖ్యంకాదు. ఈ విషయంలో నేను అదృష్టవంతుణ్ణే.

  5. Shankar Reddy says:

    చాల బాగుందడీ రాధికగారూ….

Comments are closed.