సరదా

jyothi.bmpఏక కాలంలో నాలుగు బ్లాగులు రాస్తున్న జ్యోతిగారు అన్ని బ్లాగులూ కలిపి 500 పైచిలుకు జాబులు రాసి తెలుగు బ్లాగరుల్లోకెల్లా విశిష్టతను సంపాదించుకున్నారు. హాస్యం, వినోదం, వంటలు, పాటలు – ఇలా వివిధ అంశాలపై అమితమైన ఆసక్తిని చూపే జ్యోతిగారు పొద్దు పాఠకుల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న సరదా శీర్షికలోని మరో అంకం ఇది. ఆమె ఎక్కుపెట్టిన ప్రశ్నలకు సమాధానాలివ్వడం ఇప్పుడు మీ వంతు.

——————–

ప్రశ్నలు అడగమన్నారుగా! ఐతే కాసుకోండి. ఈ చిత్రానికి విచిత్రమైన డైలాగ్ కొట్టండి. చూద్దాం.

ప్ర. పడ్డవాడెప్పుడు చెడ్డవాడు కాదు అంటారు కదా! మరి పడనివాడు?
జ.

ప్ర.బ్రహ్మచారులు కనిపిస్తారు కాని విష్ణుచారులు, శివచారులు ఎందుకు కనిపించరు?
జ.

ప్ర. అమెరికా వాళ్ళు మొబైల్ ఫోన్ కనిపెట్టారు. జపాన్ వాళ్ళు అందులోకి సిమ్ కార్డుని కనిపెట్టారు. మరి మన వాళ్ళు?
జ.

త్వరపడండి……..

——————–

జ్యోతి వలబోజు (http://vjyothi.wordpress.com)

About వలబోజు జ్యోతి

అచ్చమైన తెలుగింటి గృహిణి ని.. కాలక్షేపానికి అంతర్జాలానికి వచ్చి బ్లాగులు మొదలెట్టాను. నేర్చుకోవాలనే తపనతో మొదలైన ఈ పయనం ఇప్పుడు తెలుగులో మొదటి వంటల వెబ్సైట్ దగ్గర ఆగి ఉంది. అప్పుడప్పుడు పత్రికలలో రచనలు చేస్తుంటాను. నాకు తెలిసిన ప్రతి విషయం నాకిష్టమైన తెలుగులో చూడాలి, రాయాలి అనుకునే భాషాభిమానిని.

This entry was posted in వ్యాసం and tagged . Bookmark the permalink.

9 Responses to సరదా

  1. ప్ర. పడ్డవాడెప్పుడు చెడ్డవాడు కాదు అంటారు కదా! మరి పడనివాడు?
    జ.పడేసేవాడు కాదు.

    ప్ర.బ్రహ్మచారులు కనిపిస్తారు కాని విష్ణుచారులు, శివచారులు ఎందుకు కనిపించరు?
    జ. గుడిలేనిది బ్రహ్మకే కదా, విష్ణుచారులు, శివచారులు ఆయా గుళ్ళలో ఉంటారు :).

    ప్ర. అమెరికా వాళ్ళు మొబైల్ ఫోన్ కనిపెట్టారు. జపాన్ వాళ్ళు అందులోకి సిమ్ కార్డుని కనిపెట్టారు. మరి మన వాళ్ళు?
    జ. వాటిని వాడుకోడానికి జనాల్ని ‘కని’పెట్టారు :).

  2. jyothi says:

    అమ్మా! నీ కోడలు చూడవే ! సినిమా రానంటే వినటంలేదు. నన్ను సతాయిస్తుంది. వా………….

  3. ఫోటో పెట్టడం మీరే ముందుగా వ్యాఖ్య రాసేయడం మీరేనా! ఈ నిర్వహణ కొత్తగా ఉంది.

  4. వెంకట రమణ గారి జవాబులు నాకు భలే నచ్చాయి.

    –ప్రసాద్
    http://blog.charasala.com

  5. వ్యాఖ్య: ఓ సారీ, అది మీతోకా? మా ఆయనదనుకున్నా!

    ప్ర. పడ్డవాడెప్పుడు చెడ్డవాడు కాదు అంటారు కదా! మరి పడనివాడు?
    జ. పగ పడతాడు!

    ప్ర.బ్రహ్మచారులు కనిపిస్తారు కాని విష్ణుచారులు, శివచారులు ఎందుకు కనిపించరు?
    జ. పెళ్ళాల చాటు వాళ్ళు ఎలా కనిపిస్తారండీ, మీరు మరీను.

    ప్ర. అమెరికా వాళ్ళు మొబైల్ ఫోన్ కనిపెట్టారు. జపాన్ వాళ్ళు అందులోకి సిమ్ కార్డుని కనిపెట్టారు. మరి మన వాళ్ళు?
    జ. ‘మిస్డ్ కాల్” ని కనిపెట్టారు.

  6. ‘మిస్డ్ కాల్” ని కనిపెట్టారు.
    హహహ…
    నాకు ఈ మిస్డ్ కాల్స్ అంటే చిరాకు. మనకు డబ్బులెంతో ఎదుటి వారికీ అంతే అని కొందరు అర్థం చేసుకోరు.
    ఇక ఆ మిస్డ్ కాల్స్ తో ప్రత్యేకమయిన ఏర్పాట్లే చేసేకునే వారంటే జాలేస్తుంది.

  7. radhika says:

    రా…మావా..అక్కడ క్రెడిట్ కార్డ్ లు పంచిపెడుతున్నారట.ఓ నాలుగు తీసుకుందాము..

  8. “వాటిని వాడుకోడానికి జనాల్ని ‘కని’పెట్టారు”
    -అమోఘం! గొప్పగా ఉంది శ్లేష!!

  9. ఫోటోపైః
    1. కాస్త తోకలాగితే అంతలా అరవాలా? ఏం? అంతకట్నం దొబ్బినప్పుడు లేదా?
    2.వాఁ… బుధ్ధి తక్కువై కట్నానికి కక్కుర్తి పడి తోక దీని చేతిలో పెట్టాన్రో దేముడోయ్
    ప్ర. పడ్డవాడెప్పుడు చెడ్డవాడు కాదు అంటారు కదా! మరి పడనివాడు?
    జ.పడని వాడెప్పుడూ మంచివాడు కాడు
    మిగిలిన వాటికి ఇప్పటికే గొప్ప సమాధానాలొచ్చాయి.

Comments are closed.