ఈసారి కూడా అతిథితో బాటు మరి రెండు రచనలు అందిస్తున్నాం. అవి:
1. రానారె రాసిన వ్యాసం (ఇది మీ అంచనాలకు ఒక మెట్టు పైనే ఉంటుందని హామీ ఇస్తున్నాం)
2. జ్యోతిగారి సరదా శీర్షికలో పాపం…ఆంధ్రాపోరడు
ఇక ఈసారి మన అతిథి…వీవెన్ e-తెలుగు సంఘం గురించి వివరిస్తున్నారు.
ఈ వారాంతంలో మరిన్ని మంచి రచనలు మిమ్మల్ని పలకరించనున్నాయి. ఒక కొత్త శీర్షికను కూడా ప్రారంభించనున్నామని తెలుపడానికి సంతోషిస్తున్నాం.
ఇటీవలే పొద్దు రూపురేఖలు మార్చాం. పై రచనల గురించే కాకుండా కొత్త రూపు గురించి కూడా పాఠకులు తమ అభిప్రాయాలను తెలుపవలసిందిగా కోరుతున్నాం.
-పొద్దు
కొత్త రూపు ముద్దుగా బావుంది.ప్రతివారం ఒక అందమైన ముఖచిత్రం పెడితే బావుంటుందేమో!.తొందరగా గడి మొదలు పెట్టండి.
ఇంతకు ముందుకంటే ఈ రూపం చాలా బాగుంది. పాత సంచికలలోని రచనలను “ఇటీవలి రచనలు” మాదిరిగా ఒక లింకులపట్టీలో చూపగలిగితే సులభంగా పాత పుస్తకాన్ని తిరగేసినట్టు చదువుకోవచ్చుకదా!?
నిజమే ఇపుడు హాయిగా ఒక పత్రికలా వుంది 🙂 పొద్దులో హెడర్లో బొమ్మ (సూర్యుడు) పెడితే ఇంకా బాగుంటుంది.
నెలనెలా వచ్చిన రచనల లింకులతో ఒక పేజీ తయారుచేసే బరువు తలకెత్తుకున్నారు. పాత సంచికల రచనలు ఇప్పుడు ఆయా నెలల మొదటిపేజీలలో కనబడేలా మార్చినందుకు ధన్యవాదాలు. ఆటోమేట్ చేస్తారనుకున్నాను.
అలాగే ప్రస్తుత సంచిక మొదటి పేజీలో, ఆ నెలలో వచ్చిన రచనల “రుచి” (Feed లాగా) కాస్త చూపించి, పూర్తి రచనలోకి లింక్ అందిస్తే – కొత్తగా వచ్చే రచనలు కనీసం ఒక నెలరోజులపాటు పాతవాటిని మింగెయ్యకుండా ‘పొద్దు’ను ఒక మాసపత్రిక రూపంలో కనబడేలా చేస్తాయి కదా.