తెలుగు బ్లాగులు చదివేవారికి రాధిక గారి కవితలను ప్రత్యేకంగా పరిచయం చెయ్యవలసిన పనిలేదు. స్పందించే హృదయం గల రాధిక గారు వ్యాఖ్యలు రాయని బ్లాగూ ఉండదు. పొద్దులో తొలికవిత కూడా భావుకతగల బ్లాగరి రాధిక గారిదే కావడం విశేషం.
——————
మది నిండిన ఎన్నో మధురానుభూతులను
అప్పుడప్పుడూ ఒలక బోసుకుని
ఎంతో ఇష్టం గా తిరిగి గుండె అరల్లో
సర్దుకుంటూ వుంటాను
అప్పుడప్పుడూ ఒలక బోసుకుని
ఎంతో ఇష్టం గా తిరిగి గుండె అరల్లో
సర్దుకుంటూ వుంటాను
పాత పుస్తకాల పుటల్లోని నెమలీకలని..
దాచుకున్న ఉత్తరాల మడతల్లోని
మనసుల రూపాలని..
అపురూపంగా పరామర్శిస్తూవుంటాను
దాచుకున్న ఉత్తరాల మడతల్లోని
మనసుల రూపాలని..
అపురూపంగా పరామర్శిస్తూవుంటాను
పట్టలేని భావోద్వేగాలు
యదను కుదిపేస్తూవుంటే
వాటిని కన్నీరుగాను,కవితలుగాను
మలచుకుంటూ..
తిరిగిరాని బాల్యాన్ని
కన్నులముందు ఆవిష్కరించుకుంటూ వుంటాను
యదను కుదిపేస్తూవుంటే
వాటిని కన్నీరుగాను,కవితలుగాను
మలచుకుంటూ..
తిరిగిరాని బాల్యాన్ని
కన్నులముందు ఆవిష్కరించుకుంటూ వుంటాను
-రాధిక (http://snehama.blogspot.com)
చాలా బాగుంది! మీ కవితలు సరళంగా అద్భుతంగా ఉంటాయి! ఈ కవిత నాకు బాగా నచ్చింది.
మది నిండిన ఎన్నో మధురానుభూతులను
అప్పుడప్పుడూ ఒలక బోసుకుని
ఎంతో ఇష్టం గా తిరిగి గుండె అరల్లో
సర్దుకుంటూ వుంటాను
============
“Jnapakalaku manchi” ardham chepparu. chala bagundi
ఇలాంటి ఆలోచనలు నాకూ ఇక్కడికొచ్చాక ఎక్కువయ్యాయి. సెంటిమెంట్లు, ఆప్యాయతలు గట్రాలాంటివి నాకు తక్కువ, నన్ను పెద్దగా కదల్చలేవు అనుకునేవాణ్ణి.
రాధిక గారి కవిత నేరుగా మనసును తాకింది. బాల్యపు చేష్ఠ ద్వారా పుస్తకాల పొరల్లో దాచుకునే నెమలి పింఛపు ఖండికల్లోని అమాయకతను అధ్బుతంగా పేర్చారు. నా అభినందనలు. కే.బి.యస్ శర్మ.
చాలా హృద్యంగా వుంది.
–ప్రసాద్
http://blog.charasala.com
మొదటి రెండు పేరాలు చాలా బాగున్నాయి. పైన తులసి గారు అన్నట్లు memories కి చక్కటి అర్థం చెప్పారు. నాకు ఇలాంటి అనుభవాలు ఎక్కువ… Flash back లోకి వెళ్ళడాలు… తలుచుకోవడాలు…
radhika garu mee kavita chala bhaga vundi
kavitha bagundi