తాజా విశేషం: కబుర్లు
ముందుగా ప్రకటించినట్లే పొద్దు పాఠకుల కోసం ఒక మంచి పుస్తకం (మహమ్మద్ ఖదీర్ బాబు రాసిన దర్గా మిట్ట కథలు) పై ఒక మంచి పాఠకుడు (సుధాకర్) రాసిన సమీక్షను అందిస్తున్నాం. వారం, వర్జ్యం చూసుకోకుండా వచ్చిన ఆలోచనను వచ్చినట్లు రాసేసే “బ్లాగు మనస్తత్వం” వల్ల పొద్దులో సిద్ధమైన రచనలను వెంటనే పాఠకుల ముందు పెట్టకుండా ఆగలేకపోతున్నాం. ఆ తొందరలో ఒక్కోసారి ముందుగా ప్రకటించని రచనలు కూడా పాఠకులను పలకరించే అవకాశముంది. నిన్నటి “నేను-ఆనందం” కవిత దానికో ఉదాహరణ.
ఎప్పటిలాగే పాఠకులు ఈ సమీక్షపై తమ స్పందనను తెలియజేస్తారని ఆశిస్తున్నాం.
పొద్దును కూడలిలో పెట్టిన వీవెన్ కు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.
———————————–
జనవరి 8 సోమవారం: సినిమా వ్యాసం-రెండో భాగం.
నన్నడిగితే ఇలాంటి మనస్తత్వమే పాఠకులను రోజూ పొద్దుకు రప్పిస్తుంది. నేను ఈమాట లాంటి పత్రికలను వచ్చిన మొదటి ఒకటి రెండు రోజుల్లో చదివేస్తాను, మళ్ళీ రెండు నెలలవరకూ అలా వెళ్ళాల్సిన అవసరమే వుండదు నాకు. పొద్దు అలాగాక రోజూ పొడవాలి.
–ప్రసాద్
http://blog.charasala.com