చావా కిరణ్! పరిచయమక్ఖర్లేని ప్రముఖ తెలుగు నెజ్జనుడు. ఎంతో మంది తెలుగుబ్లాగరుల ప్రేరకుడు, మార్గదర్శి. చావా కిరణ్ కు ఇంటర్నెట్లో సొంత పత్రిక నడిపిన అనుభవం కూడా ఉంది. పొద్దు కోసం అతను రాసిచ్చిన ఈ చిరుకవిత మీ కోసం:
—————————————-
ఆ నవ్వులో
నిన్నటి దిగులు లేదు
రేపటి బాధ లేదు
ఆ నవ్వు
హిమానీనదం అంత స్వచ్ఛంగా
హిమాలయాలంత అందంగా
ఆ నవ్వు
నిన్నని మరిపిస్తూ
రేపటిని తలపకు రానీకుండా
నేడు నా ముందు నిలచింది సాకారమై
ఆ నవ్వును
ముందెన్నడూ చూడలేదు
ముందెన్నడూ అనుభవించలేదు
ఆ నవ్వు
మనసును మారుస్తూ , మాయచేస్తూ
వేసవిలో చల్ల గాలిలా హాయిగొలుపుతూ
నా ముందు నిలచింది సాకారమై.
– చావా కిరణ్ (http://oremuna.com/blog)
చాలా బాగుంది. మీ ముందు స+ఆకారమై నిలిచిన ఆ నవ్వు ఎవరిదో…
నాకు తేలుసు
“ఆ నవ్వును
ముందెన్నడూ చూడలేదు
ముందెన్నడూ అనుభవించలేదు”
మ౦చి ప్రయోగము. చాలా బాగు౦ది. ఇ౦కా ఇలా౦టి మ౦చి కవితలు మరిన్ని వదల౦డి.
ాలా చక్కగా వు౦ది.మంచి విషయం పై అందం గా,భావయుక్తం గా రాసారు.ఒక ఆంగ్ల సామెత ఎక్కడో చదివాను…అది…”అందం గా లేని నవ్వుతున్న మొహాన్ని నేను ఎప్పుడూ,ఎక్కడా చూడలేదు.” మీ కవిత కూడా నవ్వే మోము లా అందం గా వుంది.
అయితే ఇక కవితా ఝరి ప్రవహించనుంది చావా కలం నుండీ!
–ప్రసాద్
http://blog.charasala.com
చావా కిరణ్ గారు,
మీ కవిత చాలా బాగుంది.
అభినందనలు.