దర్గా మిట్ట కతలు

Sudhakarసుధాకర్ – ఒక ప్రముఖ తెలుగు నెజ్జనుడు. ఆయన రాసే తెలుగు బ్లాగు శోధన 2005వ సంవత్సరానికి భాషా ఇండియా వారు నిర్వహించిన పోటీల్లో అత్యుత్తమ తెలుగు బ్లాగుగా ఎంపికైంది. ఆయనదే మరో బ్లాగు Savvybytes ఆంగ్లంలో అత్యధికులు చదివే బ్లాగు. వీటిలో శోధనలో ఆయన ఆలోచనల్లోని పదును తెలుస్తుంది. Savvybytes సాంకేతికోపకరణాలు, సాంకేతికాంశాలకు సంబంధించినది. coolclicks ఆయన ఫోటో బ్లాగు. ఇవికాక ఆయన తక్కువ తరచుగా రాసే బ్లాగులు ఇంకో రెండున్నాయి. పొద్దు కోసం సుధాకర్ రాసి ఇచ్చిన సమీక్ష ఇది.
——————————–
నూట ముప్ఫై పుటల చిన్ని పుస్తకం. పిల్ల పుస్తకమే కదా, ఆలవోకగా ఒక గంటలో చదివెయ్యొచ్చని మొదలు పెట్టా ! చిన్న పిల్ల గాలి అలా నన్ను తీసుకుపోయి ఒక వాగులో వదిలినట్టనిపించి, రెండు మూడు కతల తరువాత అది జీవన నదిగా మారి , నేను దానిలో నవ్వుతా కొట్టుకుపోతూ, చివరికి అంతులేని ఆనంద సాగరంలో ఒక్క ఉదుటున నేను పడి ఆ సంద్రపు కెరటాలమీదగా ఒడ్డుకు కొట్టుకొచ్చి తీరా చూస్తే ఇంకేముంది పేజీలు అయిపోయినాయి. కళ్ళు ఒక్క సారి నులుముకుని మరలా ఆ చిన్న పిల్లగాలిని ఆహ్వానించా

దర్గా మిట్ట కతలురచయతకు రాయాలనే కొంటెతనం తప్ప, పేరు గురించి పెద్దగా ఆసక్తి లేదనిపిస్తుంది కదా? కానీ పుస్తకం చదువుతూ పోతే అది మాములు మిట్ట కాదని, ఒక సజీవ జీవసౌందర్యావిష్కరణకు పుట్టినిల్లు అని తెలుస్తుంది . ఈ కతల గురించి మాట్లాడే ముందు, కతలవీరుడి గురించి తెలుసుకుందాం. మొహమ్మద్ కదీరు బాబు (ఈ పేరు వెనక ఒక కత ఉంది) తన గురించి ఈ కతల పుస్తకంలో పెద్దగా రాయలేదు, అతని కతల కత తప్పితే . అది అతని నిరాడంబరత అని గట్టిగా చెప్పొచ్చు. కదీరు బాబు ప్రస్తుతం ఆంధ్రజ్యోతిలో పని చేస్తున్నారు. తన జీవితంలోని చిన్నతనపు తీపి, చేదు అనుభవాలను తీపిగానే మనకి రెండు పుస్తకాలలో అందించారు(ఇంకొకటి పోలేరమ్మ బండ కతలు ).

మన కళ్ళకు చప్పగా అనిపించే దైనందిత జీవితాన్ని చిట్టి కదీరు తన జిజ్గాసతో పరిశీలించి వడపోసి, హాస్యాన్ని రంగరించి తేనెగా మన నోట్లో పోస్తాడు . ఇలాంటి పరిశీలన నాకు మక్సీమ్ గోర్కీ నా బాల్యంలో కనిపించింది . అయితే ఈ పుస్తకం మిమ్మల్ని అస్సలు ఆనందపు ఆర్ణవం నుంచి బయటకు రానివ్వదు. సుఖమైనా నవ్వే, బాధలోనూ నవ్వే

ఈ కధలలో ప్రేమ తప్ప ఇంకేమి తెలియని అమ్మ, బోళా నాన్న, ఎల్లెలెరగని స్నేహం, మనింటి మనుషుల్లాంటి పక్కింటోల్లు ఒకటేమిటి అన్ని రకాల అద్భుత,ఆదర్శమైన తెలుగు జీవిత మధురిమలు మనల్ని ముంచెత్తుతాయి . పరవశుల్ని చేస్తాయి. ఈ కతలకు ముందు మాట రాసిన ముళ్ళపూడి రమణగారి పదాలలో

వేదంలా ప్రవహించే తెలుగు జీవనదిలో ముస్లిం జీవన స్రవంతి ఇంతకాలం అంతర్వాహినిగా కనపడకుండా ప్రవహిస్తూ వుండాలి. ఖదీర్ బాబుదర్గా మిట్ట కతలలో భగీరధుడిలా ఆ నదిని మన ముందుకు మళ్ళించాడు . ఈ నది నీటిలో ప్రతి బిందువు ఒక ఆణిముత్యం. మంచుని ఎగజిమ్మే అగ్ని పర్వతం. ఇందులో నాన్నలూ , అమ్మలూ అవ్వలూ తాతలూ అందరూ భూలోక దేవతలు. సుఖసంతోషాలలాగే కష్టాలనూ కన్నీళ్ళను కూడా నగలుగా వేసుకుని హుషారుగా తిరుగుతారు . పాలు పూలు పాపాలు, తాపాలు అన్నీ ఒక్కటే….మచ్చుకి నాలుక్కతలను మెచ్చుకుంటే మిగతా ఇరవయ్యి కోప్పడవు; నవ్వుతాయిఅంచేత………..”

ఈ కతలన్ని నెల్లూరు యాసలో కొనసాగుతాయి. అవి ఒక యాసలో ఉన్నయని కూడా చదివే వాడికి తెలియదు . అదే మరి గమ్మత్తు. ఈ కతలన్నీ ఆనంద జీవితాల గురించే అనుకుంటే పప్పులో కాలేసినట్లే. చాపకింద నీరులా చిన్న స్థాయి మధ్యతరగతి జీవితాల హాస్య భరిత బాధలను రచయత ఆవిష్కరించారు . దీనికి అతడు పెద్దగా కష్టపడలేదు. ఉన్నది ఉన్నట్టుగా రాసి పడేసాడు. భేషజం లేదు , భయం అంతకన్నా లేదు.

కతల గురించి కబుర్లు ఆపి, కొన్ని చమక్కుల్లాంటి కతల కలకండ ముక్కల్ని చూద్దాం

01. అలీఫ్, బే, తే మా నాయనమ్మకి గోరి కడితే :ఈ ఐవోరు బెత్తం పట్టుకుంటే వొదలడంట సామీ. ఈ సంగత్తెలిసే మా అన్న ఆరులో ఉర్దూకు బదులు తెలుగు తీసుకున్నాడంటఅని యింకాస్త దడిపించినాడు యూసఫ్ గాడు. ఆ దెబ్బకి ఇంకిప్పటికిప్పుడు ప్లానెయ్యక తప్పదని అర్దమైపోయింది అందరికి. ‘ ఠఠఠ్ఠాయ్ఐడియాఅన్నాడు గౌస్ జాన్ కొడుకు సందాని. ఏందిరా ఏందిరా అని అడిగినాము అందరం. ‘జాఫర్ ఐవోరు, విజ్డమ్ టుటోరియల్స్అన్నాడు చిటికేస్తా….అందరం సప్పంగా సల్లబడిపోయినాం. ఏడ్ఛినావులే.. ఆ పర్వేట్ లో బాగా చెప్పరని కదా సామీ మనం చేరనిది. అదీ కాక ఆడ పది రూపాయలు నాయినా ఫీజుఅన్నాడు యూసఫ్ . ‘ఫీజు ఎక్కువైతే ఏమిరా? కొట్టకుండా చెప్తారంటమద్యలో ఎగనూకినా ఏమీ అనరంట అన్నాడు సందాని.

02. మా ఇస్కూలు యానివర్సరీకి దుమ్ము లేపేసినా : “ఏమిరా కరీం కొడకా ! కిలాసు లా?” అన్నాడు నన్ను చూసి . ‘వుంది కానీ నేను యాక్షన్ చేస్తాను సర్అన్నాను రొంత బయంగా ఏమి యాక్షనురా?” అన్నాడాయన మీసాల నిండుగా నవ్వతా… “గబ్బర్ సింగు సార్ చేసేదా ?” అని ఆయనెక్కడ ఒద్దంటాడోనని ఎమ్మటే బీకరంగా గొంతు పెట్టి కితినే ఆద్మీ థేఅంటా మొదలు పెట్టినాను .

03. వంజరాలు మాగలు కండసుదుములు : కూర సంగతికొస్తే మా నాయనదంతా హైతో ఖానా నైతీ సోనాస్టయిలు (ఉంటే తినటం, లాకుంటే పొణుకోవటం). ఏ రోజయినా మా నాయిన యాబై రూపాయలు సంపాదించుకుని వచ్చినాడా యింకయ్యి నీసు డబ్బులకిందే లెక్క. పొద్దునొక నీసు కూరకి, సాయింత్రమొక నీసు కూరకీ ఆ డబ్బుల్లోని అణా పైసాని కూడా జమెయ్యాల్సిందే . “

04. నేను నేలలోఅమ్మ బెంచీలో :ఆమెని కదిలిస్తే కుర్ర పిల్లప్పటి కతలన్ని యిట్టాగే చెప్పద్దని మా అమ్మ కదిలించదు . ఎప్పటిలానే గమ్మున దుప్పటి చుట్టుకుని రెడీ అయుపోయింది సినిమాకి. జైబూన్ అపా వచ్చినాక రే….రిష్కా తేబో గబాల్నఅనింది నా తట్టు చూస్తా… ‘తేనుగా అన్నాను తల అడ్డంగా వూపుతూ….’ఏందిరో చెప్తా వుంటే..పో రిష్కా పిలచక రాబో అనింది జైబూన్ అపా కూడా…’తెస్తే నన్నుకూడా పిలచక పోవాలి సినిమాకిఅన్నాను దీర్గాలు పెట్టి సాగ తీస్తా …’సినిమాకా ? ఖాజాపీరు కోడలికి కాన్పయ్యింది నాయినా, చూసి రావడానికి పోతన్నాం ..ఆడకి పిలకాయలు రాకూడదు అనింది మా అమ్మ. నువు యాడికి పోతున్నావో నాకు తెలుసులేమ్మాఅని చిటికేసి మరేదగా నన్ను సినిమాకి పిలచకపోతే రిష్కా తేను అని బెదిరించేసాను . దెబ్బకి మా అమ్మ దారికొచ్చేసింది. ‘సరే పా నా కొడకా. ఇంటర్ బెల్లులో పులి బంగరాలు అడిగినావో అప్పుడు చెప్తా నీ పని అని పళ్ళు పట పట మని కొరికింది మా అమ్మ.”

ఇలా రాసుకుంటూ పోతే అన్ని కతలకు రాయవలసి వస్తుంది. అందువలన ఇక ఆపుదాం. ఇవన్నీ చదివాక, మనందరం ఒక్క సారి మన బాల్యం వైపు చూసుకోవటం ఖాయం. ఛస్ చాలా మిస్సయిపోయామనుకోవటమో , అరెరె ఈళ్ళందరూ అచ్చం మన సిన్నప్పటి యదవల్లానే వున్నారే అని నవ్వుకోవటమో గ్యారంటీ సామీ….

సుధాకర్ (http://sodhana.blogspot.com)

This entry was posted in వ్యాసం and tagged . Bookmark the permalink.

24 Responses to దర్గా మిట్ట కతలు

  1. ఇంతకు ముందుకూడా ఎవరో దర్గా మిట్ట కథల గురించి చెప్పగా విన్నాను. ఇప్పుడింకా అవి చదవాలనే కోరిక బలపడింది. సమీక్ష చాలా బాగుంది.
    “కథ”లన్నీ “కత”లయిపోయాయెందుకో!

    –ప్రసాద్
    http://blog.charasala.com

  2. ఎప్పటికప్పుడు చదవాలనుకోవడం తర్వాత మరచిపోవడం. ఒక గట్టి నిర్ణయం తీసుకోవాల్సిందే. వచ్చే నెలాఖరులోగా ఈ పుస్తకాన్ని చదవాలి.

  3. radhika says:

    నిజం గా ఆ కధల గురించి తెలీదు గాని మీ సమీక్ష మాత్రం చాలా బాగుంది.సమీక్షలో వాడిన వాక్యాలు,చెప్పిన విధానం అద్భుతం.

  4. ఖదీర్ బాబు గారితో వ్యక్తిగత పరిచయం లేకపోయినా ఈ-మెయిలు ద్వారా మాట్లాడాను. అప్పుడెప్పుడో ఢిల్లీ కథా వేదికకు వెళ్లాలని స్పాన్సర్ల కోసం వెతికారు. అప్పుడు నేను ఒక్కణ్నే. ఇప్పుడు అలాంటి మంచి కార్యాలకు మన తెలుగు బ్లాగు సంఘం తరఫున అప్పుడప్పుడూ చేయగలిగితే అదే పదివేలు!

  5. ఇప్పటికే సబ్జెక్ట్ పుస్తకాలతో కుస్తీ పడుతూ సమయం చాలక సతమతమవుతున్న మమ్మల్ని ఇలాంటి సమీక్షలతో రెచ్చగొట్టటం భావ్యమా? సుధాకర్ గారూ.కదీరు గారి కతలు ఒక్కసారి మదిలో మెదలితే వాటితోపాటూ చిన్ననాటి జ్ఞాపకాలూ వెల్లువెత్తుతాయి. ఇహ వాటికి ఇటువంటి సమీక్షలు తొడైతే మమ్మల్ని ఆ భగవంతుడే కాపాడాలి.మంచి సమీక్ష రాసారు కృతజ్ఞతలు.

  6. satya says:

    kadeer garu swayamga echhina “drgamitta kathalu ‘baguntai indulo chepala kura katha mareenu

  7. Sirisha says:

    Nenu “Dargamitta Kathalu” chaala rojula kritame Khadeer Babu gaaru “Swathi’kosam raasinappude chadivaanu. ADBHUTHAMga wrasaaru. Ennellakee aa kathala sourabbham naalo parimalisthoondi…

  8. nagesh says:

    hello all stories are good

  9. sridevi says:

    sameeksha bagundi.ee pustakam nenu clala sarle chadivanu.annee bagunnayi kanee “mukkalu lo maza” lanti kathalu “mamidi kaya mukkalu uppuu karam addukoni tuntoo unte, andulo jeddi vachinattu” gaa chedugaa unnayi.
    Ee kathala pustakanni evaraina teengae pilallaki ichi chadavamanadaniki alanti kathalu addam vastayi.

    ide rachayite itara katha”katha 2006″ lo undi.chala manchi katha.namattuki naaku konni chinna chinna nachani vishayalunna, over all gaa baguntundi.andaroo chadivi teeravalasina katha.aa katha peru”nelameeda kaallu”

  10. k anil kumar says:

    ee yooka khatalu chaala bhagunaei naaku enta varaku teliyadu ee sodhana gurinchi eenadu sunday book lo chusi telusu kunanu chaala bagundi enka chala story lu rayagalarani manavi chesukuntunanu andariki chala kruthagyatalu .
    from .
    k.Anil kumar

  11. dead man says:

    సుఖమైనా నవ్వే, బాధలోనూ నవ్వే…maku anni vunna eppudu andaram badhalone vuntam..nenu ee kathalanni chadivina tharuvatha memu enduku badha paduthu inni samvatsaralu gadipamo telitam ledu..khadir babugariki ki naa namaskaramulu.

  12. Yashwanth says:

    Yes Sudhakar garu. I rad three years ago, It’s touch my heart and recollect my chieldhood days. Those stories are like RK Narayan’s Swami and Tom sawyer.
    I appreciate your analysis.

  13. nagesh says:

    Nenu “Dargamపitta Kathalu” chaala rojula kritame chadivanu madi kuda kavali chala happy ga feel ayyanu polerammabandakathlu chadivina tharuvatha kavali pathavuruki velli vachanu

  14. చిన్నప్పుడు మా వూళ్ళో వంక తుప్పులమ్మడీ కుందేటి కొమ్ములూ, బలస కాయలూ, ఈత కొబ్బెర, ఈతకాయలూ, తింటూ పొందిన అనుభూతిని మళ్ళీ దర్గా మిట్ట కథలను చదివినప్పుడు పొందాను. దర్గామిట్ట కథలు చక్కటి అనుభూతినిచ్చే కథలు.
    ఖదీర్ గారిని ఎప్పటికీ గుర్తుంచుకునేవిగా ఉంటాయి.

  15. రవికిరణ్ తిమ్మిరెడ్డి says:

    ప్రసాద్

    మా జిల్లాలో ఊర్లలో కథని కతనే అంటారు. అద్సరే గానె, నాయడ్రసు, అదే ఈమైల్ అడ్రసు నీ దగ్గిరుంది కదా. నా దగ్గిరున్నాయి, దర్గామిట్ట కథలు నీక్కావాలంటే నీకు మైల్ చేస్తా, మళ్ళా నాకు మైల్ చేసే పనైతే, కావాలంటే.

    రవికిరణ్ తిమ్మిరెడ్డి.

  16. rahamthulla says:

    భారత ముస్లింలలో 85% మంది పూర్వీకులు హిందూ దళితులే!
    కుల వివక్ష భరించలేకే మత మార్పిడులు
    మానవ వనరుల అభివృద్ధి శాఖ సలహాదారు నివేదిక

    న్యూఢిల్లీ, ఆగస్టు 10: మనదేశంలోని ముస్లింలలో 85 శాతం మంది పూర్వీకులు హిందూ దళిత, వెనుకబడిన కులాల వారేనని తాజా నివేదిక వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కోసం కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ సలహాదారు కృష్ణన్‌ ఇచ్చిన ఈ నివేదిక దేశంలోని ముస్లింల పూర్వాపరాలు, వారి పరిస్థితులను వెలుగులోకి తెచ్చింది. వర్ణవ్యవస్థ నుంచి బయటపడేందుకు వచ్చిన అవకాశాలలో భాగంగానే వీరు ఇస్లాం మ తాన్ని స్వీకరించారంది. హిందువులు ఇస్లాంలోకి మారడం మధ్యయుగంలోనే ప్రారంభమైందని కృష్ణన్‌ పీటీఐకి చెప్పారు.

    ‘హిందూమతంలోని కులవ్యవస్థ చాలా కఠినమైనది. అధికారక్రమంలో అది ఒక్కో కులానికి ఒక్కో స్థానా న్నిచ్చింది. అణగారిన కులాలను ఆ వ్యవస్థ పైకి రానీయదు. అందుకే వారు ఇస్లాంను స్వీకరించారు’ అన్నారు. హిందూయిజంలో కొన్ని కులాలను అంటరానివారుగా చూస్తారని నివేదిక వెల్లడించింది. అవకాశం వచ్చినప్పుడల్లా వారంతా బయటపడేందుకు ప్రయత్నించారని, వారందరికీ ఇస్లాం ఉపశమనం కలిగించిందని అన్నారు. ఆంధ్రపదేశ్‌లోని క్రైస్తవులలో 98 శాతంమంది పూర్వీకులు హిందూమతంలోని దళిత కులాల నుంచి వచ్చినవారేనని కృష్ణన్‌ చెప్పారు.

    పంజాబ్‌వాసులు సిక్కుమతాన్ని స్వీకరించారని తెలిపారు. వీరు మతం మారినా వెనుకబాటుతనం వారిని విడువలేదన్నారు. దీన్ని గుర్తించే అనేకమంది పాలకులు ముస్లింల కోసం రిజర్వేషన్‌ను ప్రవేశపెట్టారని, వారు జనజీవనస్రవంతిలోకి వచ్చేలా సహాయం చేశారని తెలిపారు. ‘కొల్హాపూర్‌ మహారాజు తొలిసారిగా 1902లో ముస్లింలకు రిజర్వేషన్‌ ప్రవేశపెట్టారు. 1921లో మైసూర్‌ మహారాజు కూడా అదే చర్య చేపట్టారు. బాంబే ప్రెసిడెన్సీ, అనంతరం మద్రాసు ప్రెసిడెన్సీ కూడా ఈ కోటాను ప్రవేశపెట్టాయి’ అని పేర్కొన్నారు. వివిధప్రాంతాల్లో పర్యటించి, భారత్‌లో సామాజిక వ్యవస్థపై సాహిత్యాన్ని పరిశీలించి వాటి ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు.(ఆంధ్రజ్యోతి 11.8.2008).

  17. Somasekhar says:

    nenu ee pustakam soft copy kosam chustunnanu…ekkadaa dorakaledu. daya chesi evari vaddananna oka copy kanee, leda url kanee untay tappaka share cheya galaru. nenu khadeerbabu gaaru rasina dargamitta katalu, poleramma banda katalu rendooo chadivanu. aa rendu pustakalu India lo undi poyayi. eppudina manasu ki kaasta alasata ani pinchina, boledantha aahlaadam kavali anipinchina nenu chadivay koddi pustakaalalo ee rendoo unnayi. andukay ee vedukolu.

  18. saya vani says:

    kadeer gari kadalu manalo balyanni tatti leputai. p.g lo modalupetti still chaduvutunnnu. anta baguntai. sanna jaji poola chettu allukunna kadha naku chala istam.

  19. satya vani says:

    daraga mitta kadale kadu, dakan, kinda nela undi kuda baguntai. kadeer gari introlu adbutam

  20. ramnarsimha says:

    The Review is very nice..

    rputluri@yahoo.com

  21. ramnarsimha putluri says:

    u r not pblshng my opinions…

  22. MAHESH says:

    hi sir
    good evening
    this is mahesh
    from kaval , i am od student to you, today mean 15.06.10 i have verifyeyed history of kavali in wekipedia, realy igot a shock becuse your name in head lines of kavali history realy i feel very happy becuase u r my favourate teacher in my life do u have remeber me , i studied 7th class in Municipal High School in old town, sai primary public school and tutorials sir.

Comments are closed.