నేనెందుకు బ్లాగుతున్నాను అంటూ ప్రముఖ బ్లాగరి కొవ్వలి సత్యసాయి గారు చెబుతున్నారు. మంచి భావాలకు, చక్కటి భావప్రకటనకు చిరునామా, కొవ్వలి వారి బ్లాగు! వారేమంటున్నారో చూడండి, మీరేమంటారో రాయండి.
మరి.., మీరెందుకు బ్లాగుతున్నారో కూడా మాకు రాయండి.
త్వరలో..
మరో ప్రముఖ నెజ్జనుడు పంపిన వ్యాసం – జనవరి 2న మీకోసం
ఇది బాగుంది.
మాసానికోసారి వెలువరించేసి చేతులు నిర్వాహకులు దులుపుకుంటే నాలాంటి వారు రెండురోజుల్లో చదివేసి మళ్ళీ నెల వరకూ దాని మొహం చూడని మూస పద్దతి కాకుండా ఇలా ఎప్పుడు ఏమి చేయబోయేదీ, రాయబోయేదీ ప్రకటిస్తూ ఆ మాటను నిలుపుకుంటూ నెల పొడవునా వ్యాసాలో, కథలో, కవితలో చేరుతూనే వుంటే ప్రతిరోజూ పొద్దు పొడిచినట్లు! ఇలానే కొనసాగించండి. నెల మొత్తానికి ఒకరోజే వెలువరించి దులపరించుకోకండి. 🙂
ఒక రానారె, కొవ్వలి లాంటి వ్యాసాలు అప్పుడప్పుడూ వస్తూ వుంటే ప్రతి పొద్దూ మాకు ఉగాదే!
–ప్రసాద్
http://blog.charasala.com
ఎడిటర గారే కాకుండా, ఈ వ్యాసం చదివిన నెజ్జనులు కూడా ‘వీరతాళ్ళు’ వేయడంతో నా పాదాలకీ భూమికీ మధ్య అంతరం పెరిగిపోయింది. మీ వ్యాఖ్యలతో నా బాధ్యత చాలా పెంచేసారు. మీ అందరి ఆదరాభిమానాలకూ నా ధన్యవాదాలు.