Tag Archives: వచన కవిత
అద్వైతం
మూలా సుబ్రహ్మణ్యం ౧. అద్వైతం పౌర్ణమి నాడు పరిపూర్ణతనొందే రాత్రి ఆత్మ అమావాస్య నాడు శూన్యంలోకి అదృశ్యమౌతుంది ఏం ఏకత్వాన్ని దర్శించిందో ఒకేలా ఎగసిపడుతూ పిచ్చి సముద్రం! ౨. నక్షత్రాల దుఃఖం ప్రయాణించి ప్రయాణించి ఒక్క కన్నీటిబొట్టు లోతుల్లోకి చేరుకుంటాను మంచుబొట్టు తాకిడికే ముడుచుకుపోయే అత్తిపత్తి ఆకుల నిశ్శబ్దం నాలో ప్రవేశిస్తుంది రాత్రంతా దుఃఖించే నదీ … Continue reading
తెలు’గోడు’
— కాజ సురేశ్ (surkaja@gmail.com) ఏ కులము, ఏ మతముర నీది దుడ్డులెన్నిన్నుయ్ ర నీకు ఈ చెక్కలు చాలవురా ఓరి తెలుగోడ యాస బాసల ముక్కలంత అవసరమా, ఓరి ఎర్రిబాగులోడ గోచీ వేమనా, ఆడెవ్వడు మాకు నీతులుచెప్పెటోడా ఆదికవి మీ గోదాటొడ్డువాడా మీ పోతన మా రాయల కొలవునుండెటోడా కాళోజీ!! కాడు వాడు మా … Continue reading
మగ దీపం
— ఎం. ఎస్. నాయుడు ఒక చెట్టు, మధ్యాన్నం తార్రోడ్డుపై సముద్రపు గాలినో, నదిలో కలిసే సముద్రపునీటి గాలినో వెంటబెట్టుకొని నవ్వుతో కూర్చుంది. ముడతలు లేని కొమ్మలపై వాలని నక్షత్రాలని, సూర్యుణ్ణి నిద్ర పొమ్మంది. ఇంతలో, ఎక్కడికీ చేరలేని గడియారపు సాలిగూడులోంచి ప్రయాణిస్తుంటే, ఇల్లు ముక్కలైంది. మునుపటి మొక్కలూనూ.కీటకాలూనూ. ఎవరి కుబుసమో తోడుకుంటున్న ఇల్లుకాని ఇల్లిది. … Continue reading
నీ పై ప్రేమతో…
– బొల్లోజు బాబా ఇక్కడ నిను నేను ప్రేమిస్తున్నాను. పైన్ వనాల చీకట్లలో గాలి స్వేచ్ఛప్రకటించుకొంది. నీటి అలలపై చందమామ భాస్వరమై వెలుగుతోంది. అన్నీ ఒకేలా ఉండే రోజులు, ఒకదానినొకటి వెంబడించుకొంటున్నాయి. పొగమంచు అస్ఫష్ట రూపాలతో నర్తిస్తోంది. ఓ వెండికొంగ ఎక్కడినుంచో వచ్చి వాలింది మరొకటి తారలదాకా ఎగురుకొంటో సాగింది. ఒకోసారి తొందరగా మెలుకువొచ్చేస్తుంది. నా … Continue reading
తామస విరోధి – తొమ్మిదవ భాగం
స్వాతి: దిగులు దిగులుగా ఉంటుంది పాత జ్ఞాపకాల ఈదురుగాలి ఉండుండి సన్నగా కోస్తుంది. అంటూ చలిపొద్దుని దుప్పటి ముసుగు తీసి చూపించిన రవి శంకర్ గారూ! మరి వసంతోదయాలు ఎలా ఉంటాయో మీ శైలి లో చెప్తారా! నేటి కాలపు కవిత్వం తీరుతెన్నుల్ని విసుగనుకోకుండా విశ్లేషించగల భూషణ్ గారు వచన కవిత ఒకదాన్ని రాసి ఈ … Continue reading
తామస విరోధి – ఎనిమిదవ భాగం
ఇప్పుడో నది కావాలి
ఉప్పెనలా ఊళ్ళను తుడిచి పెట్టే నదికాదు
మూలం వేళ్ళను తడిసి
పచ్చదనం చిగురింపచేసే నది
నగరం నడి బొడ్డున
ఫౌంటెన్ లా ఎగజిమ్మి అందాలు పంచే నది కాదు
భూమి మొహాన ఇన్ని నీళ్ళు కొట్టి
అన్నం పంచే నది
ఎండిన చెట్లను అక్కున చేర్చుకునే నది… Continue reading
తామస విరోధి -ఏడవభాగం (తర్ ‘ కవిత ‘ర్కాలు)
ఒక కవిత రాశేశాక దానికి పేరు పెట్టే విషయం లో సమస్య వస్తుంది. అసలు శీర్షిక ఎలా ఉండాలి? కవితలోని సారం పేరు చూడగానే అర్ధమవ్వాలా లేదా ఆ శీర్షిక తో కలిపి చూస్తేనే కవిత పూర్తయినట్టు అనిపించాలా? అసలు శీర్షిక ఉండకపోతే నష్టమా.
సమకాలీన అంశాలపై రాసే కవితలు కొన్ని ఉంటాయి. వార్తా పత్రిక లో సంఘటనల హెడింగ్ లు చదివినట్టు ఉంటుంది. సంఘటనలని సూటిగా రిఫర్ చేస్తూ కవిత రాయటం ఎంతవరకూ బావుంటుంది. అసలలాంటి అంశాలను కవితా ప్రక్రియ లో చూపదలచుకుంటే యెలా రాయాలి. Continue reading
తామస విరోధి – ఆరవ భాగం
కిరణ్ కుమార్ చావా : ఆ ఒడ్డు నుండి నువ్ నన్ను, ఈ ఒడ్డు నుండి నే నిన్ను, పరికిస్తూ, పరిశీలిస్తూ, పరీక్షిస్తూ, ఇన్ని వసంతాలూ అట్టే గడిపేశాం. ఎప్పుడో కుదుళ్లు వేరైపోయినా, ఎప్పటికప్పుడు గాయాల కాలవలకు పూడికలు తీస్తూ, గట్లు కడుతూ, ఇన్ని వసంతాలూ రక్తం పారించాం. నీ వైపు పూలు, నా వైపు … Continue reading
తనెళ్ళిపోయింది..
తనెళ్ళిపోయింది… వెళ్ళిపోతూ తన గుర్తుగా ఏం మిగిల్చింది? Continue reading
తామస విరోధి- ఐదవ భాగం
సాహితీ మిత్రులకు నమస్కారం! తామస విరోధి కి ఒక కవిత పంపుతున్నాను.. చూడండి. -తవ్వా ఓబుల్ రెడ్డి ప్రభాతవేళ …..! పున్నమి వెన్నెలలో తడిచి,తడిచి ముద్దగా ముడుచుకుని ఉంటుంది పల్లె వేట కోసం లేచిన వేకువ పిట్టలు వేగుచుక్క దిశగా గాలిలో ఈదుతూ ఉంటాయి తరతరాల విధ్యుక్త ధర్మాన్ని నిర్వర్తిస్తున్నట్లుగా పల్లె నలు చెరుగులా కోడి … Continue reading