Author Archives: వాసిష్ఠ

About వాసిష్ఠ

‘వాసిష్ఠ’ అన్నది , అయ్యల సోమయాజుల మహాదేవ శాస్త్రిగారి కలం పేరు. వీరు ‘ నాయన గారి’ కుమారులు. ఆయన రచనలో రమణీయత, మృదుమనోహరమైన భావాలు కనిపిస్తాయి. ఆయన గద్యరచనలోనే కాక, పద్య రచనలో కూడా సిధ్ధహస్తులు. ‘గణపతి స్తవము’, ’భక్త కుచేలుడు’, ’ప్రహ్లాద చరితము’, ’తోటక మాలా దశకం’, ’పార్థ సారధి శతకం’, ’పంచ చామర పంచ రత్నములు’, ’బాల ద్విపద రామాయణము’, ఇత్యాది పద్య రచనలే కాక, చాలా కథానికలు వ్రాసారు.

ఆయన కథానికలలో ప్రముఖమయినవి, ‘వృషాకపి’, ’జనస్థానం’, ’రాచప్పడు’, ’ఆంభ్రుణి’, ’కాత్యాయని’ మొదలయినవి ఆంధ్రప్రభ లోనూ, ‘ఉచ్చిష్ట సోమరసం’ అనే కథ ‘చుక్కాని’ లోనూ ప్రచురించ బడ్డాయి. ’గణపతి,’ ’ఇంద్రుడు’ , ’అగ్ని’, ’సంభాషణము’, ’మృదు కళ’ మొదలయినవి ఆయన వ్రాసిన వ్యాసములు. వీటన్నిటిలో ముద్రింప బడిన వాటి కన్న అముద్రితాలే ఎక్కువగా ఉన్నాయి.

ఈయన తంజావూరు సరస్వతీ మహలు గ్రంధాలయంలో తెలుగు రీసెర్చి పండితునిగా పనిచేసి, ’విప్రనారాయణ చరిత్ర’, ’మైరావణ చరిత్ర’, ’తాళ దశప్రాణ దీపిక’, ఇత్యాది గ్రంధాలను ‘ఎడిట్’ చేసి ముద్రింప చేసారు. ఈయన జననం ఫిబ్రవరి ’1901లో, నిర్యాణం మార్చి 1966 లో.

’సత్యప్రభ’ చారిత్రిక నవలలో మొదటి ముప్ఫై ప్రకరణాలను ’పూర్ణ’ పేరుతో గణపతి ముని రచించగా, తరువాతి ముప్ఫై ప్రకరణాలను వాసిష్ఠ రచించారు.

సత్యప్రభ – 4

7 వ ప్రకరణం. మంతనపు తృతీయ ఘట్టం ప్రారంభమయింది. “ఇక శాంతిసేనా దేవి విన్నపం గురించి చర్చించ వలసి ఉంది.” అని మహారాజు పలికాడు. “ఆ విషయం రాజకులంలో చర్చించ వలసిన అవసరం లేదు.. సావకాశంగా ప్రభువు వారే తగిన సందేశాన్ని ఆమెకు పంపవచ్చు.” అని చెప్పాడు మహామంత్రి. “రెండు కారణాలచే ఈ సమస్య ఈ … Continue reading

Posted in కథ | Tagged | Comments Off on సత్యప్రభ – 4

సత్యప్రభ – 3

మహామంత్రి చర్యను గురించి కూడ అనుమానం కలిగింది. అతడు లంచగొండియే కానప్పుడు, అతనికి అంత గొప్ప సంపద పట్టడానికి హేతువేమిటని మహారాజు మనసులో శంక పుట్టింది. – సత్యప్రభ మూడవ భాగంలో.. Continue reading

Posted in కథ | Tagged | Comments Off on సత్యప్రభ – 3

సత్యప్రభ – 2

భార్యావిధేయుడైన.రాజు సమక్షంలో చదవబడిన మూడు లేఖలు! మూడు సవాళ్ళు. సత్యప్రభ చారిత్రిక నవలలో తదుపరి భాగం చదవండి. ఈ నవల యొక్క కథాకాలపు పరిచయం కూడా, ఈ సంచికలో. Continue reading

Posted in కథ | Tagged | Comments Off on సత్యప్రభ – 2

సత్యప్రభ – 1

“ఈ భ్రమ వల్ల వానికి కొత్త ఉత్సాహం పుట్టింది, వాని శిరసు మిన్నుని అంటింది, వాని భుజస్కంధాలు ఉబికాయి, వాని వక్షో దేశం విశాలమయింది. వాని కండ్లలో భావతరంగాలకు మితిలేక పోయింది. వాడు పూర్తిగా కామునికి వశమైపోయాడు. కాని ఆ సంగతిని వాడు గ్రహించి ఉండలేదు. తన ఎదుట నిలబడి ఉన్న సుందరి తనను ప్రేమిస్తోందనే భావం మాత్రమే వానికి గోచరిస్తూంది.” – సత్యప్రభ చారిత్రిక నవల మొదటి భాగం చదవండి. Continue reading

Posted in కథ | Tagged , | 6 Comments