జనవరి ’09 గడిపై మీమాట

జనవరి గడి పై మీ అభిప్రాయాలు ఇక్కడ రాయండి.

పాత గడులు

———————————-

This entry was posted in గడి and tagged . Bookmark the permalink.

12 Responses to జనవరి ’09 గడిపై మీమాట

  1. ఇరు వరముల ఎర్రని కవి..అదిరింది!

  2. 38 అడ్డం తాలూకు మధ్య అక్షరానికి నిలువు క్లూ ఏదండీ?

  3. పొద్దు గడి ఇంతవరకు ఎప్పుడూ నేను చెయ్యలేదు. మొదటిసారి ఇవాళ కాస్సేపు ఆఫీసులో చూశాను. అంతే దానికి తగులుకుపోయి, పూర్తిచేసేదాకా స్థిమితం లేకపోయింది. ఒక్క పదానికి సందేహం ఉన్నా మొత్తానికి ఒక రెండు గంటలు కూర్చుని పూర్తి చేసి పంపేశా.

    కామేశ్వరరావు గారూ, మీరిచ్చిన గడి బాగుంది. మరీ కష్టంగానూ లేదు, మరీ సులువుగానూ లేదు. ఇంకెప్పుడు ఆఫీసులో ఉన్నప్పుడు గడి జోలికి రాను బాబూ!!

  4. మొత్తానికి అన్నీ వచ్చేశాయి… ఇంక సందేహాల్లేవ్…

  5. 37 అడ్డం ౨౨ నిలువు కు ఏదైనా క్లూ ఇవ్వండి ప్లీస్.

  6. సుజాతగారు,
    పొరపాటుని చెప్పినందుకు నెనరులు. అది దిద్దబడింది. ఈ దిద్దుబాటు వల్ల 25 నిలువు ఆధారం ఇలా మార్చుకోవాలి “45 అడ్డంలోదే తంతాం అంటోంది”.

    నాగమురళిగారు,
    అమ్మబాబోయ్! అప్పుడే అయిపోయిందా! ఈసారి కాస్త కష్టంగా ఇచ్చాననుకున్నానే. రెండు నిలువు ఆధారం మారింది, ఒకసారి సరిచూసుకోండి.

    భాస్కర్ గారు,
    స్లిప్పుల సుగాత్రిగారీ మధ్య కనపడ్డం లేదు. అయినా గడి వచ్చిన రెండో రోజుకే స్లిప్పులడిగేస్తే ఎలా, కొంచెమైనా జుత్తూడగొట్టుకోకుండా 🙂

  7. నాగమురళి గారు,మీరొస్తే మేమొప్పుకోం! ఏదో చిన్న పిల్లలం, మాతో పోటీ పడ్డానికి మీరు రాకూడదు…:)

  8. ఈ సారి ఇచ్చిన గడి నాకైతే చాలా చాలా కష్టంగా ఉంది 🙁
    చాలా మటుకు తట్టలేదు 🙁
    ప్లీజ్ కొంచెం 27 అడ్డం ,21 నిలువు ,31 నిలువు వీటికి ఎవరికైనా క్లూలు తెలిస్తే ఇవ్వరా!

  9. కామేష్ says:

    పొద్దు వారికి,
    గతంలో నేను గడిని పూరంచేటప్పుడు, inscript లో పూరించగలిగే వాడిని. ఇప్పుడు మాత్రం ఆర్.టి.యస్. తోనే సాధ్యపడుతోంది. సమస్య ఏమైయుండునో అని ఆలోచన. నా విహారిణిలు మంటనక్క 3.0.1, ఆపిల్ సఫారీ 3.1.2(525.21. ఆర్.టి.యస్ వాడుకలో ఇబ్బందులు ఉన్న నాబోంట్లకు, Inscript లో ప్రావీణ్యం ఉన్న వారికి(నాతో సహా) ఇది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ సమస్య నాకేనా? మరెవరికైనా ఉందా? ఈ వ్యాఖ్య మాత్రం Inscript తోనే వ్రాయగలుగుతున్నా. కేవలం గడిలో నేరుగా వ్రాసేటప్పుడు మాత్రమే నా సమస్య.

  10. 31 నిలువు చూస్తుంటే వచ్చినట్టే ఉంది!
    10 నిలువు ఈ ఎర్రని కవి ఎవరు? అర్ధం కావటం లేదు 🙁
    1 అడ్డం ఏమాసం లో విష్ణుమూర్తి పసుపు పచ్చగా ఉంటాడు 😕

  11. శ్రీలు గారు, నా బ్లాగులో స్లిప్పుల సర్వీసు నడుస్తోంది, చూడలేదా ?

    http://www.manishi-manasulomaata.blogspot.com/

  12. నాకు తెలియదండి సుజాతగారు 🙁 చాలా థ్యాంక్స్ అండి లింకు పెట్టినందుకు 🙂

    ఇందాక వెళ్ళి చూశాను దాదాపు అందరివీ అయిపోయినట్టున్నాయిగా 🙂
    సరే ఇక అక్కడే అడుగుతాలేండి ప్రశ్నలు 🙂

Comments are closed.