Tag Archives: వికీ

తెలుగు వికీపీడియా ప్రగతి – 2007

-రవి వైజాసత్య కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ ముందుగా తెలుగు వికీపీడియన్లకు, తెలుగు బ్లాగర్లకు, శ్రేయోభిలాషులకు నూతన సంవత్సర శుభాకాంక్షలతో క్రితం నెల 9వ తేదీన నాలుగవ పుట్టిన రోజు పండగ జరుపుకున్న తెలుగు వికీ గత సంవత్సర కాలంలో సాధించిన ప్రగతి గురించి ఒకసారి నెమరు వేసుకొని కొత్త సంవత్సర లక్ష్యాల గురించి తెలుసుకుందాం. … Continue reading

Posted in జాలవీక్షణం | Tagged | 5 Comments

అక్టోబరులో వికీ ప్రాజెక్టుల ప్రగతి

[రవి వైజాసత్య] గత సంచికలో తెలుగు వికీపీడియాలోని అంతర్గత ప్రాజెక్టుల గురించి తెలుసుకున్నాం. ఈ సంచికలో వికీపీడియా కాకుండా వికీ సాఫ్టువేరుపై ఆధారపడి పనిచేసే ఇతర వికీమీడియా ప్రాజెక్టులను గురించి తెలుసుకుందాం. తెలుగులో వికీపీడియా కాకుండా ఇంకా నాలుగు వికీ ఆధారిత ప్రాజెక్టులున్నాయి. ఇవి వికీపీడియా అంతగా ప్రాచుర్యం పొందకపోయినా తెలుగులో వికీపీడియా కంటే ముందే … Continue reading

Posted in జాలవీక్షణం | Tagged | 3 Comments

సెప్టెంబరు వికీపీడియా విశేషాలు

[రవి వైజాసత్య] తెవికీలో నిర్వహిస్తున్న ప్రాజెక్టులు మరియు నిర్వహణా దళాలు తెలుగు వికీపీడియాలో వివిధ విషయాలకు చెందిన వ్యాసాలను అభివృద్ధి చేసి, విస్తృతపరచటానికి, ఆ వ్యాసాలను నిర్వహించడానికీ కొన్ని ప్రాజెక్టులను ఏర్పాటు చేసుకున్నాము. ఈ ప్రాజెక్టులలో, ఒక విషయానికి చెందిన ఉన్న వ్యాసాలన్నీ ఒక ప్రాజెక్టు పరిధిలోకి వస్తాయి. (ఉదాహరణకు, రామాయణము, గరుత్మంతుడు, క్షీరసాగర మథనం, … Continue reading

Posted in జాలవీక్షణం | Tagged | 7 Comments

తెవికీ విశేషాలు

[రవి వైజాసత్య] గత నెలలో తెవికీ తెలుగు వికీపీడియా మొదటిపేజీ రూపు కొంత ఆధునీకరించి కొత్త తరహా మార్గదర్శిని ప్రవేశపెట్టాము. మొదటిపేజీలోని యాదృచ్ఛిక పేజీని నొక్కి ఒక 20 సార్ల తర్వాతైనా కండపుష్టి ఉన్న వ్యాసం వస్తుందేమో అని ప్రార్థించే బదులు ఇప్పుడు ఈ మార్గదర్శినిలోని లింకులను పట్టుకొని విస్తృతమైన సమాచారం కల వివిధ వ్యాసాలలో … Continue reading

Posted in జాలవీక్షణం | Tagged | 2 Comments

గతనెలలో తెలుగు వికీపీడియా

[రవి వైజాసత్య] –రవి వైఙాసత్య (http://saintpal.awardspace.com/) తెలుగు వికీపీడియాలో గ్రామాలు, సినిమాలు తప్ప ఇంకేమన్నా ఉన్నాయా అన్న పలు సద్విమర్శలు దృష్టిలో పెట్టుకొని, అవేకాదు, ప్రతి ఒక్కరికీ నచ్చేవి, ఉపయోగపడేవి ఇంకా చాలా ఉన్నాయని తెలియజెప్పేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు తెలుగు వికీపీడియన్లు. అందులో భాగమే ఈ శీర్షిక. ఇటీవల మొదటి పేజీలో ప్రదర్శించబడిన … Continue reading

Posted in జాలవీక్షణం | Tagged | 3 Comments

తెలుగులో విజ్ఞానసర్వస్వాలు – వికీ ప్రాజెక్టులు

[రవి వైజాసత్య] (ఈ వ్యాసంలో నేను చేసిన వ్యాఖ్యలు, వ్యక్తపరచిన అభిప్రాయాలు, కేవలం తెలుగు వికీలో గత రెండు సంవత్సరాలు పనిచేసిన అనుభవముతో నేను గ్రహించినవి మాత్రమే. వీటికి వికీపీడియా కానీ, వికీమీడియా సంస్థ కానీ, పొద్దు పత్రిక కానీ ఎటువంటి బాధ్యతా వహించదు. – రవి వైజాసత్య) వికీపీడియా ఒక ప్రజా విజ్ఞాన సర్వస్వం. … Continue reading

Posted in జాలవీక్షణం | Tagged | 5 Comments

వికీపీడియా – స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం

చిన్నప్పుడు మీరు వామన గుంటలు, కోతి కొమ్మచ్చి, ఏడుపెంకులాట ఆడుకున్నారా? అయితే అదృష్టవంతులే! మరి మీ పిల్లలు? వాళ్ళకసలు వాటి పేర్లు కూడా తెలీదేమో! మరి మనం ఆడుకున్న ఆ ఆటలు మనతో అంతరించిపోవాల్సిందేనా? మన పిల్లలకు, వాళ్ళ పిల్లలకు వాటి గురించి చెప్పాలంటే ఎలా? ఎక్కడో ఒకచోట వాటి గురించి రాసి పెడితే, ముందు … Continue reading

Posted in జాలవీక్షణం | Tagged | 5 Comments

వికీ

తెలుగు వికీపీడియాలోని విశేషాల విరిమాల ఇది. గణాంకాలు, కొత్త విశేషాలు, కొత్త వ్యాసాలు మొదలైన వాటిని ఇక్కడ చూడొచ్చు. డిసెంబరు 22 శుక్రవారం నాటికి మొదటి వ్యాసం సిద్ధం! ఆరోజు ఇదే పేజీలో మళ్ళీ కలుద్దాం!!

Posted in జాలవీక్షణం | Tagged | Comments Off on వికీ