Tag Archives: బ్లాగు
బ్లాగుల పేరడీ – 1
తమను చీమ కుడితే తెలుగు బ్లాగరుల్లో ఒక్కొక్కరూ ఆ విషయాన్ని గురించి తమ తమ బ్లాగుల్లో ఏమని రాస్తారనే ఒక చిలిపి ఊహే ఈ బ్లాగుల పేరడీ. మరికొందరు బ్లాగరుల బ్లాగులు, వ్యాఖ్యలపై పేరడీలు త్వరలో… అంశం: చీమకుట్టింది వీవెన్: చీమ కుట్టింది, నెప్పి పుట్టింది. పప్పు నాగరాజు చీమాయణం: మన బ్లాగు వీరులందరూ చీమలమీద … Continue reading
నిశిత ‘శోధన’
తెలుగు బ్లాగుల్లో శోధనది ఓ ప్రత్యేక స్థానం. రాసికీ వాసికీ కూడా ఎన్నదగ్గది. పలువురు బ్లాగర్లే కాక, బ్లాగు సంఘాలు కూడా అంగీకరించిన మాట ఇది. ఈ బ్లాగులోని జాబులు క్లుప్తంగా ఉంటాయి, వైవిధ్యంగా ఉంటాయి, సమకాలీన విషయాల గురించి ఉంటాయి, తెలుగు సాహిత్యం గురించి ఉంటాయి. శోధన 2005 మార్చి 31 న … Continue reading
2006 ఉత్తమ బ్లాగుల పోటీ
2006 సంవత్సరానికి భారతీయ బ్లాగుల్లో ఉత్తమమైన వాటిని ఎన్నుకునే పోటీలో రెండో అంకం మొదలైంది. ఇండీబ్లాగీస్ వారు నిర్వహిస్తున్న ఈ పోటీ, నామినేషన్ల స్థాయిని దాటి రెండో అంకం లోకి ప్రవేశించింది. నిర్ణేతల సంఘంలో తెలుగు బ్లాగులను పరిశీలించినవారు వీవెన్, మురళీధర్ జూపూడి. పోటీలో నామినేషను పొందిన తెలుగు బ్లాగులు: శోధన: నిరుటి పోటీలో మేటి, … Continue reading
తెలుగు జాతీయవాది – అంబానాథ్
రిపబ్లిక్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ ను అన్యాయంగా ఆక్రమించుకుని హిందీ దేశం అధికారం చెలాయిస్తోంది. తమదో ప్రత్యేక జాతి అని కూడా తెలుసుకోలేక తెలుగువారు హిందీ దేశానికి సామంతులుగా బతుకుతున్నారు. తెలుగువారు మేలుకుని తమ జాతీయతను గుర్తించి హిందీ దేశం నుండి విడివడి స్వతంత్ర ప్రతిపత్తితో జీవించాలి. కొత్తగా ఉంది కదా? తెలుగుజాతీయవాది (http://telugujaatheeyavaadi2.blogspot.com/) బ్లాగు … Continue reading
నేనెందుకు ‘బ్లాగు’తున్నాను?
సత్యసాయి కొవ్వలి (http://satyasodhana.blogspot.com/) ప్రముఖ బ్లాగరి. చక్కటి భాష, భావ ప్రకటనా శక్తి కొవ్వలి సొత్తు. హాస్యాన్ని రాయగల కొద్ది మంది బ్లాగరులలో సత్యసాయి గారొకరు. బ్లాగు రాసే వారు బ్లాగరి అయితే, శ్రేష్ఠమైన బ్లాగరులను బ్లాగ్వరులు అని ప్రయోగించారీ వ్యాసంలో! బ్లాగ్భీష్ములు అనేది మరో కొత్త ప్రయోగం. పొద్దుపై అభిమానంతో ఈ బ్లాగ్వరుడు ప్రత్యేకించి … Continue reading
సూటిగా, వాడిగా, నిక్కచ్చిగా, నిర్మొహమాటంగా – చరసాల ప్రసాద్
నెలనెలా వచ్చే బ్లాగు జాబుల్లోంచి అత్యుత్తమమైన మూడు జాబులను సమీక్షిస్తామని చెప్పాం. దానికి ముందు, మంచి బ్లాగులనే ఏకంగా సమీక్షించదలచాం. ఆ వరుసలో మొదటిది ఇది.మొదటగా ఏ బ్లాగును సమీక్షిద్దామని ఆలోచించినపుడు, పొద్దు సంపాదక వర్గం తలపుకు వచ్చింది అంతరంగమే! మా సమీక్షపై మీ సమీక్షలను ఆహ్వానిస్తున్నాం. ———————————————————– చరసాల రేణుకా ప్రసాద్ – చరసాల … Continue reading
బ్లాగుద్యమం
బ్లాగు ప్రస్తుతం నెజ్జనులకో ముఖ్య వ్యాసంగమై పోయింది. తెలుగు బ్లాగులు బాగా వస్తున్నాయి. రోజూ కొత్త బ్లాగరులు చేరుతూనే ఉన్నారు, కొత్త బ్లాగులు వెలుస్తూనే ఉన్నాయి. వివిధ విషయాలపై బ్లాగులు రాస్తున్నారు. బ్లాగుల ప్రగతి ఎలా ఉంది? అవి ఎలా ఉంటున్నాయి? వాటి ప్రస్థానం ఎటువైపు? ఇటువంటి విషయాలను తాకుతూ వెళ్ళే బ్లాగు పరిశీలనా శీర్షిక … Continue reading