Tag Archives: బ్లాగు

బుడుగు మేడమైంది

నేను ఎందుకు ఆత్మహత్య చేసుకొంటానూ అని లైఫు ఇన్సూరెన్సు పాలసీల మీద కామెంట్లూ, ఆఫీసులో ప్రాజెక్టు మానేజరు మీదా, బెంగళూరు ఆటోలమీద, ఈవ్ టీజింగులమీద చమక్కులూ, -కార్టూనిస్టు హ్యూమర్ కి ఉదాహరణల్లాంటి చమక్కులతో కూడిన బ్లాగు యొక్క సమీక్ష చదవండి. Continue reading

Posted in జాలవీక్షణం | Tagged , | 6 Comments

ఊ’కందం’పుడు

“వీడా? నన్ను పట్టేదని పెన్నేడిస్తే కన్నీరు కాగితం మీద పడి .. ఊకదంపుడు!” అని చమత్కారంగా తనని తాను తక్కువ చేసుకున్నా, “ఊక దంచేశారు, ఇక్కడంతా గట్టి గింజలే” అని రసజ్ఞుల చేత అనిపించుకున్న బ్లాగు ఇది. -అంటున్నారు, స్వాతి కుమారి ఈ బ్లాగు సమీక్షలో. Continue reading

Posted in జాలవీక్షణం | Tagged , | 11 Comments

ఏప్రిల్ బ్లాగు విశేషాలు

జీవిత పరమార్థం (మూమెంట్ ఆఫ్ క్లారిటీ) అంటూ కొత్తపాళీ రాసిన జాబు బ్లాగరుల్లో మేధోమథనాన్నే కలిగించి, స్పందన పూర్వకంగా వివిధ బ్లాగుల్లో వచ్చిన అనేక జాబులకు మూలమైంది. ఈ సంగతి చదవండి, ఏప్రిల్ బ్లాగుల అవలోకనంలో. Continue reading

Posted in జాలవీక్షణం | Tagged , , | 5 Comments

నా మదిలో … లిరిల్ తాజాదనం!

వేసవి కదండీ, ఉక్కపోతగానే వుంటుంది. ఈ ఎండల్లో లిరిల్ తాజాదనం మంచి రిలీఫ్ కదా! అయితే ఏమిటంటారా? కాలంతో నిమిత్తం లేకుండా ఎప్పుడూ తాజాగా వుండే ఒక బ్లాగుంది. ఈ నెల బ్లాగుసమీక్షలో ఆ తాజాదనాన్ని ఆస్వాదించండి. Continue reading

Posted in జాలవీక్షణం | Tagged , | 8 Comments

మార్చి పోస్టుల మార్చిపాస్టు

ఇప్పటి వరకు కూడలి, జల్లెడ, తేనేగూడు, తెలుగుబ్లాగర్స్ వంటి వాటికే పరిమితమైన బ్లాగు కూడళ్ళు, ఇప్పుడు విస్తరిస్తున్నాయంటోందీ వీక్షణం Continue reading

Posted in జాలవీక్షణం | Tagged , , | 5 Comments

కలంకలల ఘలం ఘలలు

స్థాలీపులాక న్యాయం అనే మాట వినే ఉంటారు. అన్నమంతా చూడకుండా ఒక మెతుకును పట్టి చూసినా సరిపోతుందనే సిద్ధాంతమది. మన పుస్తక సమీక్షకులు చాలా ఎక్కువగా వాడే మాట, ఆచరించే పద్ధతి అది. విమర్శకులు మాత్రం అలాక్కాదు.., చాలా కూలంకషంగా ప్రతి మెతుకునూ పట్టిపట్టి మరీ పరిశీలిస్తారు.

కలం కలలు అనే బ్లాగును చూపించి, దాన్ని సమీక్షించండి అని సాలభంజికలు నాగరాజు గారిని కోరాం. ఆయన ఆ బ్లాగును శీర్షం నుండి పాదం దాకా గాలించి, బ్లాగరి శైలిని, రచనా దృక్పథాన్ని, తాత్వికతను ఒడిసి పట్టారు. ఈ ఎస్సెన్సునంతా ఆ బ్లాగరి ఫోటోతో జోడించి ఒక సమీక్ష (విమర్శ) వ్యాసం రాసిపెట్టారు. ఫణీంద్ర గొడవ గురించి తెలిసికొనేందుకు కలంకలలు చూడాలి. ఫణీంద్ర గురించి తెలిసికొనేందుకు నాగరాజు గారి ఘలం ఘలలు చూడండి. Continue reading

Posted in జాలవీక్షణం | Tagged , | 13 Comments

2008 ఫిబ్రవరి బ్లాగోగులు

2008 ఫిబ్రవరిలో తెలుగు బ్లాగుల ధోరణులను తెలిపే వ్యాసమిది Continue reading

Posted in జాలవీక్షణం | Tagged , | 14 Comments

అంతశ్శోధకుడు – రానారె

అక్షరాలను దూసి

మలచి మాలగ జేసి

తెలుగుతల్లికి వేసి

ధన్యుడయ్యెను మనిషి!

(ఏంటో.. రానారెను తలిస్తేనే పద్యాలొస్తున్నాయి! పాదాలూ మాత్రలూ కూడా పెరిగిపోతున్నాయి.)

వచనమైనా నిర్వచనమైనా అలవోకగా రాసుకెళ్ళిపోయే రానారె, లాగులు తొడుక్కునే టప్పటి నుండీ రాస్తున్నాడు. లాగుల నాడైనా, బ్లాగుల నాడైనా అందరిలోకీ ఆతడే ముందు! పొద్దులో అతడి బ్లాగులపై సమీక్ష చూడండి! Continue reading

Posted in జాలవీక్షణం | Tagged , | 15 Comments

జనవరి నెల తెలుగు బ్లాగుల కథా కమామిషూ!

బ్లాగులోకంలో జనవరిలో ఏమెం జరిగాయో గమనించారా? ఎవరెవ రేమేం రాసారో చదివారా? చదవలేదా! పోన్లెండి, ఏం పర్లేదు.. ఆ విషయం తెలుసుకునే అవకాశం పొద్దు మీకిస్తోంది. జనవరి బ్లాగుల ప్రస్థానపు నివేదిక ఇది. ప్రతీ ఒక్క బ్లాగునూ ఆ వ్యాసంలో పొందుపరచలేకపోయినప్పటికీ, ముఖ్యమైన విషయాలపై జాబులు వెలువరించిన బ్లాగులను అక్కడ ఉంచాము. Continue reading

Posted in జాలవీక్షణం | Tagged , | 14 Comments

బ్లాగుల పేరడీ – 2

బ్లాగుల పేరడీ – 1 కి విపరీతమైన స్పందన వచ్చింది. పేరడీల గురించి అప్పుడే చెప్పాం “ఎవరి మీదైతే పేరడీ రాశామో వాళ్ళు మెచ్చుకున్నప్పుడే ఆ పేరడీ విజయవంతమైనట్లు” అని. ఆ తొలి విడత పేరడీ ప్రయోగం ఒక్క రానారె విషయంలో తప్ప మిగిలిన అందరి విషయంలో ఆయా బ్లాగరుల ప్రశంసలు పొందింది. రానారె ‘ఇది … Continue reading

Posted in జాలవీక్షణం | Tagged , | 22 Comments