పొద్దులో ప్రచురించేందుకు రచనలను ఆహ్వానిస్తున్నాం. మీ రచనలను
– యూనికోడులో టైపించి పంపాలి.
– editor@poddu.net కు వేగు పంపాలి.
– రచనను వేగులోనే రాసి పంపవచ్చు, లేదా వేగుకు జోడింపుగా కూడా పంపవచ్చు.
PDF వంటి ఇతర పద్ధతుల్లోగానీ, లేదా స్వయంగా చేత్తోగానీ, రాసిపెట్టుకున్న రచనలను మాకు పంపకండి. దయచేసి యూనికోడులో టైపించి మాత్రమే పంపండి. యూనికోడులో ఎలా టైపించాలో తెలియని వారు http://lekhini.org చూడండి. కంప్యూటర్లో తెలుగులో రాసెయ్యడం చిటికెలో పని!
నిబంధనలు
- రచనలు రచయితల స్వంత రచనలై ఉండాలి. తమ స్వంతం కాని రచనలను పొద్దుకు సమర్పించరాదు. స్వంత రచనలలో ఇతర రచయితలకు కాపీహక్కులున్న భాగాలను వాడినట్లైతే ఆ విషయాన్ని రచనలలో తెలియపరచాలని మనవి. సమీక్షలకు ఇది వర్తించదు.
- పొద్దుకి ఒక రచన అందాక, దానిని సమీక్షించి, పరిశీలించి, ప్రచురించడానికిగాని, తిరస్కరించడానికిగాని గరిష్ఠంగా రెండువారాలు పడుతుంది.
- ఇతర వెబ్ పత్రికలలోగానీ, అంతర్జాలంలో మరెక్కడైనాగానీ ప్రచురించినవి, ప్రచురణ కోసం సమర్పించినవి అయిన రచనలను పొద్దుకు పంపించరాదు.
- పొద్దులో ప్రచురించిన వ్యాసాలను, ప్రచురించిన రెండు వారాల తరువాత రచయితలు తిరిగి తమ స్వంత వెబ్ సైట్లలో ప్రచురించుకోవచ్చు. అయితే ఇతర వెబ్ పత్రికలలో ప్రచురించరాదు.
- ఈ పత్రికలో ప్రచురించిన రచనలు, వ్యక్తపరిచిన అభిప్రాయాలు – ఆ రచయితలవే, పొద్దువి కాదు.
- పాఠకులు వ్యక్తపరిచిన అభిప్రాయాలు కూడా వారి వ్యక్తిగత అభిప్రాయాలే!
రచయితలు తమ రచనలతో పాటు కింది సూచనను కూడా జతపరచాలి:
“ఈ రచన పూర్తిగా నా స్వంతమే. కాపీహక్కులున్న ఇతర రచనల నుండి సంగ్రహించిన భాగాలు లేవు. ఒకవేళ సంగ్రహించిన భాగాలుంటే వాటి మూలాలను సూచించాను. అలాంటి భాగాల విషయంలో మూల రచయిత నుండి తీసుకున్న అనుమతిని కూడా జతపరుస్తున్నాను.
ఈ రచనను గతంలో ఎక్కడా ప్రచురించలేదు. ప్రచురణ కోసం వేరే ఎక్కడా ప్రస్తుతం పరిశీలనలో లేదు.”
84 Responses to రచయితలకు సూచనలు