Category Archives: కవిత్వం
వికృతి ఉగాది పద్యకవితా సదస్సు – రెండవ భాగం
వికృత నామ ఉగాది పద్య కవితా సదస్సు రెండవభాగంలో మూడు సమస్యలకు రసభరిత పూరణలు చోటు చేసుకున్నాయి. వీటితో పాటు కవుల చమత్కార సంభాషణలు కూడా! Continue reading
క’వికృతి’ – ౨
ముందుగా కవికృతి మొదటి భాగంలో ప్రచురించిన కవితపై గరికపాటి పవన్ కుమార్ గారి విశ్లేషణ: భావాలు ఒద్దికగా వచనంలో ఇమడకపోవడం వలన ఈ కవిత పాఠకుడిలో అయోమయాన్ని నింపుతోంది ఉదా 1: డిజిటల్ డోల్బీ ఊయలలొ పురుడు పోసుకుని ఏడువేల ఓల్టుల సమ్మోహన శబ్ద తరంగాల మధ్య ఇప్పుడు మనం తప్పటడుగుల్లోనే వున్నాం.. పురుడు పోసుకొవడం … Continue reading
వికృతి నామ ఉగాది పద్యకవితా సదస్సు – మొదటి భాగం
కొత్తపాళీ: అందరికీ పెద్దవారు, ఆచార్యులు, చింతా రామకృష్ణారావు గారు చక్కటి గణపతి ప్రార్ధన పద్యం పంపారు. ఉ: శ్రీ గణ నాయకా! వికృతిఁ జేర్పను వచ్చెదొ? విశ్వతేజ! రా వేగమిటున్. ప్రభా కలిత విశ్వ పరిజ్ఞత కావ్య జాల స ద్యో గుణ సద్విధమ్ మలర; దుర్గుణ బాహ్య మహత్వమొప్ప; రో జూ గనరా! కృపన్ … Continue reading
క’వికృతి’ (ఉగాది వచన కవి సమ్మేళనం) – ౧
వికృతి నామ సంవత్సరాది సందర్భం గా పొద్దు పత్రిక నిర్వహించిన వచన కవి సమ్మేళనం లోని కవితలను పాఠకులకు అందిస్తున్నాము. ఈ కవితలపై మీ సద్విమర్శలనూ, విశ్లేషణలనూ ఆశిస్తున్నాం. ఏందుకంటే వీటిపై పత్రిక ఎడిటింగ్ లేకుండా నేరుగా ప్రచురిస్తున్నాం. ఇక పాఠకులే ఎడిటర్లూ,విమర్శకులూ, విశ్లేషకులూ అన్నీ! శబ్ద ఖననాన్ని కోరుకుంటున్నా..! -పెరుగు.రామకృష్ణ, నెల్లూరు డిజిటల్ డోల్బీ … Continue reading
గుండె చప్పుళ్ళు
-తులసీ మోహన్ జ్ఞాపకాలు… వాటికేం!? వచ్చిపోతుంటాయి గాలి వీచినప్పుడో, గులాబీలు పూసినప్పుడో కానీ కంటి నిండా నీళ్ళే వెతుక్కుంటాయి తుడిచే వేళ్ళ కోసం. నిన్నలా నేడుండనివ్వదు ప్రకృతికెంత పౌరుషం! మెరుపు చూపిస్తూనే ముసురు కమ్ముతుంది. సందెపొద్దులు, శ్రావణమేఘాలు మధుర రాత్రులు, మౌనరాగాలు ఎద అంచుల్లో జోడు విహంగాలు ఏదయినా ఏకాంతం కాసేపే తిరిగే ప్రతి మలుపులో … Continue reading
సమానత్వం
– చావా కిరణ్ నిద్ర పోతున్న మారాజు మేల్కొంటాడు కొలువు దీరి కలతలన్ని బాపుతాడు. బీయీడీలు యంయీడీలు అయినా ఖాలీగున్నాం పదయింది, పన్నెండయింది తరువాత ఏంటి? బీడుభూములన్ని ఆవురావురమంటున్నాయి శమంతకముంది గాని స్వర్ణమే నిలవడంలేదు. నిద్ర పోతున్న మారాజు మేల్కొంటాడు కొలువు దీరి కలతలన్ని బాపుతాడు. బీయీడీలకు యంయీడీలకు ఉజ్జోగాలిత్తాడు పదికి పన్నెండుకు విజ్ఞాన్నిస్తాడు బీడు … Continue reading
అద్వైతం
మూలా సుబ్రహ్మణ్యం ౧. అద్వైతం పౌర్ణమి నాడు పరిపూర్ణతనొందే రాత్రి ఆత్మ అమావాస్య నాడు శూన్యంలోకి అదృశ్యమౌతుంది ఏం ఏకత్వాన్ని దర్శించిందో ఒకేలా ఎగసిపడుతూ పిచ్చి సముద్రం! ౨. నక్షత్రాల దుఃఖం ప్రయాణించి ప్రయాణించి ఒక్క కన్నీటిబొట్టు లోతుల్లోకి చేరుకుంటాను మంచుబొట్టు తాకిడికే ముడుచుకుపోయే అత్తిపత్తి ఆకుల నిశ్శబ్దం నాలో ప్రవేశిస్తుంది రాత్రంతా దుఃఖించే నదీ … Continue reading
తెలు’గోడు’
— కాజ సురేశ్ (surkaja@gmail.com) ఏ కులము, ఏ మతముర నీది దుడ్డులెన్నిన్నుయ్ ర నీకు ఈ చెక్కలు చాలవురా ఓరి తెలుగోడ యాస బాసల ముక్కలంత అవసరమా, ఓరి ఎర్రిబాగులోడ గోచీ వేమనా, ఆడెవ్వడు మాకు నీతులుచెప్పెటోడా ఆదికవి మీ గోదాటొడ్డువాడా మీ పోతన మా రాయల కొలవునుండెటోడా కాళోజీ!! కాడు వాడు మా … Continue reading
మగ దీపం
— ఎం. ఎస్. నాయుడు ఒక చెట్టు, మధ్యాన్నం తార్రోడ్డుపై సముద్రపు గాలినో, నదిలో కలిసే సముద్రపునీటి గాలినో వెంటబెట్టుకొని నవ్వుతో కూర్చుంది. ముడతలు లేని కొమ్మలపై వాలని నక్షత్రాలని, సూర్యుణ్ణి నిద్ర పొమ్మంది. ఇంతలో, ఎక్కడికీ చేరలేని గడియారపు సాలిగూడులోంచి ప్రయాణిస్తుంటే, ఇల్లు ముక్కలైంది. మునుపటి మొక్కలూనూ.కీటకాలూనూ. ఎవరి కుబుసమో తోడుకుంటున్న ఇల్లుకాని ఇల్లిది. … Continue reading
రెండు అరిచేతుల పుప్పొడి రాగం
-పసునూరు శ్రీధర్ బాబు దేహంలో ధూపంలా వంకీలు తిరిగే పంచప్రాణాలు ఆ అరిచేతుల్లో ఏకమై మంచు ఖండాలుగా మారి నను నిమిరినప్పుడు నేను ఘనీభవించిన అగ్నికీలల పర్వతాన్నయ్యాను- ఆ రెండు అరిచేతుల్లో పూసిన పుప్పొడిలో కన్నీటి బిందువునై రాలి నలుదిక్కులకూ ఎగిరిపోయాను- ఆ రెండు అరిచేతులూ ఓ సాయం సంధ్య వేళ నన్ను పావురంలా పొదివి … Continue reading