Category Archives: కవిత్వం
నాలుగు మెతుకులు
– అఫ్సర్ బయట విరగ్గాస్తున్న ఎండకి లోపటి చీకటి తెలుస్తుందో లేదో! కాసేపు గొంతుక వాహ్యాళికెళ్తుంది మౌనంలోకి. గాలి కోసం కాసింత వూపిరి కోసం. 2 బిగికౌగిలి చెట్ల మధ్య వొక తెల్ల చార సన్నగా తెరుచుకొని ఎటో తీసుకెళ్తుంది. దాని భాష నాకెప్పుడూ అందంగా వినిపిస్తుంది. 3 అడివి కన్న చిక్కగ పెనవేసుకుపోయిన ఇళ్ళ … Continue reading
రొద
– హెచ్చార్కే రెండుగా చీలిన ఒక వేదన ముట్టడించిన మసక వెన్నెల చిట్టచివరి విందులో ఇద్దరు ద్రోహం ద్రోహం అలలెత్తి అరిచిన దుర్బల సముద్రం! ఎన్ని ఎండలల్లో ఇంకెన్ని వెన్నెలల్లో తగలెట్టుకోగలరు తమను తాము? ఎవరినెవరు పంపారు శిలువకు? వారిలో క్షమార్హు లెవరో చెప్పలేని సందేహ సముద్రం!! ఒక్కో రాత్రిగా ఒక్కొక్క పగలుగా పుట్ట లోంచి … Continue reading
పద్యకవిసమ్మేళనంలో పాల్గొనని పద్యసుమాలు
వికృతి ఉగాది పద్యకవిసమ్మేళనంలో సమయాభావం వలన సమర్పించలేకపోయినవి, సంబంధిత కవులు ఆ సమ్మేళనంలో పాల్గొనలేకపోవడం చేత సమర్పించలేకపోయినవీ అయిన కొన్ని మంచి పద్యాలను కొత్తపాళీ గారు ఎంచి పంపించారు. వాటిని ఇక్కడ సమర్పిస్తున్నాం. ————————– దత్తపది: మాలిక, తూలిక, పోలిక, చాలిక -ఉత్పలమాల నాలుగు పాదాల్లోనూ తొలిపదాలుగా ఉపయోగిస్తూ సందీప్: మాలిక కూర్చి నీ సిగన … Continue reading
కవికృతి-౫
కౌగిలించుకుందాం..రండి..! అనుసృజన: పెరుగు.రామకృష్ణ Source: M.V.Sathyanarayana poem “Let us embarrace” కౌగిలించుకుందాం..రండి..! కౌగిలింతలో ఎంత అందమైన పులకింత అన్ని దిగుళ్ళను కరిగించే ఆహ్లాదపు గిలిగింత విషాదవదనులైన ప్రేమికుల కు స్నేహంచెదరిన స్నేహితులకు కరడుకట్టిన శత్రువులకు అసలు ఒకరికొకరు తెలీని అపరిచితులకు మధ్య దూర తీరాలని చెరిపేస్తుంది.. ఒక కౌగిలింత.. కౌగిలించుకుందాం..రండి..! గాలి సైతం దూరలేన్తగా … Continue reading
కవికృతి-౪
కవికృతి మూడవ భాగం లోని కవితలపై పవన్ కుమార్ గారి సమీక్ష ———————– స్వాతీ శ్రీపాద -నీకు తెలుసా కవితపై.. ఉపమానాలే కవిత్వం కాదు, ఉపమానం కవితకు ఉత్ప్రేరకం కావాలే కానీ అది కవితకూ పాఠకుడికి మధ్య అడ్డు రారాదు. ఈ ఉపమానాల దొంతరల కింద పడి నలిగిపోతున్న కవితను బయటికి తీస్తే హృద్యంగా ఉంటుంది. … Continue reading
వికృతి ఉగాది పద్యకవితా సదస్సు – ఐదవ భాగం
కొత్తపాళీ:: కనీసం ఇంకో రెండు అంశాల్ని రుచి చూద్దాము. వర్ణనకి ఇచ్చిన రెండో అంశం, ఒక దృశ్యం. అదిలా ఉంది. మీరొక రైల్లో వెళ్తున్నారు. ఎదురుగా ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నారు. వాళ్ళీద్దరూ కనీసం పరిచయస్తులు కూడా కాదు, కానీ ఆ అబ్బాయి కళ్ళల్లో ఆ అమ్మాయి పట్ల ఆరాధన. ఫణి గారి వర్ణనా … Continue reading
కవికృతి -౩
కత్తి మహేష్ కుమార్: నీ జ్ఞాపకాలతో బరువెక్కిన మనసు సమ సాంద్రత నీళ్ళని కళ్ళలో నింపి కన్నీళ్ళొదిలింది ఆర్కెమెడీస్ సూత్రాన్ననుసరించింది నువ్వెళ్ళిపోయిన చర్య నన్ను జఢుణ్ణి చేసిందేగానీ ప్రతిచర్యకు పురికొల్పలేదు న్యూటన్ సూత్రం తప్పిందా? లేక… నీలేమి శూన్యంలో సూత్రమే మారిపోయిందా! తర్కం తెలిసిన మెదడు మనసు పోకడకు హేతువు కోరింది నీ శూన్యాన్ని… కనీసం … Continue reading
కో హం
-హెచ్చార్కె ఏడుపు వస్తోంది ఎట్నుంచి ఎటో వెళ్తూ ఒక పాడువడిన పాకలో తల దాచుకున్నాను ఇక్కడెవరో నివసించిన, పిల్లల్ని కని పెంచిన, చనిపోయిన గుర్తులు నేను దేన్ని వెదుక్కుంటున్నాను? ఎక్కడ పోగొట్టుకున్న ఆశను? ఎట్నుంచి వచ్చానో ఎటు వెళ్తున్నానో తెలియనివ్వకుండా కళ్లను కబళించేంత కాటుక వంటి చీకటి దూరంగా బండ్లు వెళ్తున్న చప్పుడు బండి చక్రాల … Continue reading
వికృతి ఉగాది పద్యకవితా సదస్సు – నాల్గవ భాగం
కొత్తపాళీ:: ఈసారి ఇచ్చిన సమస్యల్లో కవులందర్నీ బాగా ఉత్తేజితుల్ని చేసి, చాలా చర్చకి కారణమైనది ఈ సమస్య – రాణ్మహేంద్రవరమ్ము చేరెను రత్నగర్భుని చెంతకున్ విశ్వామిత్ర:: ముందు చేరింది కవులో వస్తువులో తెలియదు గానీయండి కవులకూ కవితా వస్తువులకు కూడా నిలయంట కొత్తపాళీ:: గిరిధర కవీ మీరు వేళ్ళు కదిలించి చాలా సేపయినట్టుంది, మీ పూరణ … Continue reading
వికృతి ఉగాది పద్యకవితా సదస్సు – మూడవ భాగం
కొత్తపాళీ:: బాగుంది. ఒక దత్తపది వేసుకుందాం .. మాలిక, తూలిక, చాలిక, పోలిక – ఉత్పలమాల మొదటి పదాలుగా వాడుతూ.. ముందుగా చదువరి గారి పూరణ. చదువరి:: ఒక్క క్షణం.. ఉ. చదువరి గొంతులో ఈ పద్యం వినండి “మాలికలెన్నొ యుండ గజమాలను నా గళసీమ వేసి, నే తూలి కథాకళించ గని తుళ్ళుచు నవ్వితె … Continue reading