Category Archives: కవిత్వం

అప్పుడప్పుడూ…

తెలుగు బ్లాగులు చదివేవారికి రాధిక గారి కవితలను ప్రత్యేకంగా పరిచయం చెయ్యవలసిన పనిలేదు. స్పందించే హృదయం గల రాధిక గారు వ్యాఖ్యలు రాయని బ్లాగూ ఉండదు. పొద్దులో తొలికవిత కూడా భావుకతగల బ్లాగరి రాధిక గారిదే కావడం విశేషం. —————— మది నిండిన ఎన్నో మధురానుభూతులను అప్పుడప్పుడూ ఒలక బోసుకుని ఎంతో ఇష్టం గా తిరిగి … Continue reading

Posted in కవిత్వం | 8 Comments

సత్యా పదం-1

కృష్ణదాసకవిరాజు – తన బ్లాగు(http://krsnadasakaviraju.rediffblogs.com/)లో 2004 మే లోనే తెలుగులో రాయడం మొదలుపెట్టిన ఈయన మనకు తెలిసినంతవరకు తెలుగులో మొట్టమొదటి బ్లాగరి. మరో విశేషమేమిటంటే కృష్ణదాసకవిరాజు అనేది ఒక ప్రముఖ తెలుగు బ్లాగరి కలం పేరు. ఫోటో చూస్తున్న మీకు ఆ విషయం వేరే చెప్పనక్ఖర్లేదనుకుంటున్నాం! 🙂 == సత్యా పదం ౧ == ఆడనే … Continue reading

Posted in కవిత్వం | Tagged | 9 Comments

ఆ నవ్వు

చావా కిరణ్! పరిచయమక్ఖర్లేని ప్రముఖ తెలుగు నెజ్జనుడు. ఎంతో మంది తెలుగుబ్లాగరుల ప్రేరకుడు, మార్గదర్శి. చావా కిరణ్ కు ఇంటర్నెట్లో సొంత పత్రిక నడిపిన అనుభవం కూడా ఉంది. పొద్దు కోసం అతను రాసిచ్చిన ఈ చిరుకవిత మీ కోసం: —————————————- ఆ నవ్వులో నిన్నటి దిగులు లేదు రేపటి బాధ లేదు ఆ నవ్వు … Continue reading

Posted in కవిత్వం | 6 Comments

నరుడు

యునిక్ స్పెక్ (Unique Speck) పేరుతో సుధీర్ రాసే తెలు’గోడు’ బ్లాగు తెలుగు బ్లాగులోకానికి సుపరిచితం. ఆయన కలానికి బహుపార్శ్వాలున్నాయి. అది ఒకవైపు సున్నితమైన భావాలనూ పలికించగలదు, మరోవైపు చేదునిజాలను విప్పిచెప్పనూగలదు. ఆయన కవితల్లో ఒదగని భావాలు అరుదు. రచనల్లో వాసి తగ్గకుండా విరివిగా రాయగలగడం ఆయన ప్రత్యేకత. సుధీర్ రాసిన ‘నరుడు’ కవితను పొద్దు … Continue reading

Posted in కవిత్వం | 1 Comment

నేను-ఆనందం

తొలి పొద్దులో గరిక పూవుపై మంచు తాకి మైమరచింది నేనేనా? ముంగిట ముగ్గుకి రంగులద్ది మురిసిపోయిన మనిషి నేనేనా? వాన చినుకుల్లో కలిసి తడిసి అలిసిపోయిన మనసు నాదేనా? రేకులు రాలుతున్న పూవును చూసి చెక్కిలి జారిన కన్నీరు నాదేనా? ఏది అప్పటి సున్నితత్వం? ఏది అప్పటి భావుకత్వం? వయసు పెరిగేకొద్దీ మనసు చిన్నదయిపోతుందా? ధనం … Continue reading

Posted in కవిత్వం | 3 Comments

కవితలు

కవులకు, భావుకులకు స్వాగతం! పొద్దులో మీ కవితలను ప్రచురించి మరింత మంది పాఠకులకు చేరువ కండి. మీ కవితలను editor@poddu.net కు పంపండి.

Posted in కవిత్వం | Comments Off on కవితలు