Category Archives: కవిత్వం

విషాద సంధ్య

– సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి (సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన ఈ కవిత సాహిత్య నేత్రం త్రైమాస పత్రిక బహుమతి కథల ప్రత్యేక సంచికలో (జూలై-సెప్టెంబర్ 2007) ప్రచురితమైంది. ఈ కవితను పొద్దులో ప్రచురించడానికి అనుమతించిన నేత్రం సంపాదకులు శశిశ్రీ గారికి నెనర్లు.) ఎన్ని కడవల అశృబిందువులో అక్షరాలుగా చింది నన్నంతా తడిపి తడిపి తిరగేసినప్పుడు ఆ పల్లెకు … Continue reading

Posted in కవిత్వం | 3 Comments

కల

కనులు మూస్తే – చుట్టూ వెలుతురున్నా నన్నలుముకున్న చీకటి నా చీకట్లోనే ఎన్నో వెలుగులూ ఆ నలుపు లోనే ఎన్నో రంగులు! కళ్ళు తెరిస్తే – ఆ రంగులకీ, వెలుగులకీ చీకటి! నాకు మిగిలినవి కలిగిన కలల అస్థిపంజరాలు! -అసూర్యంపశ్య “ఆధునిక తెలుగు సాహిత్యపు లోతులను తరచి చూడటానికి ప్రయత్నిస్తున్న ఒక మామూలు నెటిజెన్ ని” … Continue reading

Posted in కవిత్వం | 6 Comments

పాట

-ఝాన్సీలక్ష్మి కొత్త ఎక్కడో దూరాన గంధర్వ గానంలా శింజినీరవంలా అందెలరవళిలా ఓ పాట ఉదయాలు దాటుకుని హృదయాలు దోచుకొని ఆది నాదంలా అనంత కావ్యంలా సాగుతూ ఈ పాట పడవ సరంగుల తెరచాప వాలులో పల్లకీ బోయీల పదగమనం లో రోలు రోకళ్ల దంపుళ్ల లో కూలి పడుచుల గొంతుల లో కొనసాగే ఈ పాట … Continue reading

Posted in కవిత్వం | 6 Comments

కార్పొరేట్ ఆ(కా)సుపత్రి!

-చందుపట్ల శ్రీధర్ ఆగండి! ఈ ఆవరణలో జాగ్రత్తగా అడుగులు వేయండి. భళ్ళుమని మృత్యు ఘోషలన్నీ అసరిగమల్తో మీ మీద దాడి చేస్తాయి. ఎవరెవరో ఈ గోడల్లోంచి గుండెలు బాదుకుంటున్నారు. ముక్కు మూసుకోండి. ఈ తెల్లని గోడల్లోంచి చావు కంపు కొడుతోంది. డాక్టర్లు చావు కబుర్లని మెళ్ళో వేసుకుని అటూ ఇటూ పరిగెడుతున్నారు. యిటు జరగండి. స్ట్రెచర్లోంచి … Continue reading

Posted in కవిత్వం | 5 Comments

తప్పుకో ఇక ఆడలేనని…..

ఎన్నాళ్ళిలా ఏడుపులు.. ఓదార్పులు తప్పుకో ఇక ఆడలేనని జీవన క్రీడ ఒప్పుకో ఇక సాగలేనని ఈ ముళ్ళ బాట అవ్వ బువ్వ తినలేదని తాత దగ్గు వినలేనని చూడలేని అమ్మ కళ్ళూ నడవలేని నాన్న కాళ్ళూ ఎన్నాళ్ళీ రోదన రాగం? ఎన్నాళ్ళీ వేదన రోగం? గంపెడంత బావ ఆశ తీర్చలేని అక్క గోస సమాజాల దుర్భిణిలో … Continue reading

Posted in కవిత్వం | 3 Comments

నిత్యాన్వేషణే జీవితం

–జాన్ హైడ్ కనుమూరి (http://johnhaidekanumuri.blogspot.com/) చూపులు వెతుకుతుంటాయి కుత కుత మంటూ గిన్నెలో వుడుకుతూనే వుంటుంది పైకి కనిపించేదంతా ఆవిరై అదృశ్యమౌతుంది చూపులు వెతుకుతుంటాయి నాల్గు రోడ్ల కూడలిలో నాట్యమాడుతున్న నియాన్ కాంతిలో జీవిత మాధుర్యమేదో జుర్రేయాలని ఇటూ అటూ చూస్తుంటాయి చూపులు వెతుకుతుంటాయి ప్రయాణ సమయాలలో ఎదురయ్యే అనేకానేక భంగిమల ఆకృతుల్లో సరికొత్త రసాన్వేషణ … Continue reading

Posted in కవిత్వం | 4 Comments

డిటో, డిటో

-లలితా ముఖర్జీ (http://roudrisms.blogspot.com/) మన చిన్నపుడు మనల్ని రాక్షసులు చెర పట్టారు చేతులు కడిగీ మూతులు తుడిచీ తలంటి స్నానాలు చేయించీ హింసలు పెట్టేరు రాత్రిళ్ళు వెన్నెట్లో వెలిసిన కొమ్మల వెర్రి నాట్యాలు చూసి జడుసుకొమ్మని వదిలేసారు గడియారాల టిక్కుటిక్కుల్లో భూమి సంతానాన్ని నమిలి మింగే చప్పుళ్ళు మెలుకువొచ్చిన పీడకలల్లో వినమని శాసించారు పగటి వేళల్లో … Continue reading

Posted in కవిత్వం | 1 Comment

మరో వనాన్ని స్వప్నిస్తాను

–జాన్ హైడ్ కనుమూరి (http://johnhaidekanumuri.blogspot.com/) రోజంతా శ్రమించి కొంత స్థలాన్ని చదునుచేసి విత్తనాలు చల్లాను మొలకలకోసం నిరీక్షిస్తున్నా పొటమరిస్తున్న ఉనికిని స్వాగతించడానికి! స్నేహితుల్లారా! మిమ్మల్ని పిలవాలనివుంది మొలకలు వస్తూ వస్తూ సమయ సంకేతాన్నిచ్చి రావుకదా! వేచివుండాలి! ఏ అర్థరాత్రో అపరాత్రో వెన్నెల లేనప్పుడు వజ్రపుతునకల్లా బయటపడ్తే నిరీక్షిస్తూ నిరీక్షిస్తూ నిదుర కళ్ళతో జోగితే మొలుచుకొచ్చిన రంగేదీ … Continue reading

Posted in కవిత్వం | 10 Comments

సింధువు

“జీవన వేగం లో కాలం తో పాటు పరిగెడుతూనే, కాస్త తీరిక దొరగ్గానే మనసు తోట లో అనుభూతుల పూలు రాలిపోకుండా నా పూల సజ్జ లో నింపుకుని తెలుగింటి ముంగిట తోరణాలు కడదామని మాలలల్లుతూ ఉంటాను” అనే స్వాతికుమారి బ్లాగు కల్హార ఫోటోల పూలతో కనువిందు చేసే కవితల తోట. స్వాతికుమారి రచనలు పొద్దు … Continue reading

Posted in కవిత్వం | 7 Comments

ఈ తరం

తెలుగు బ్లాగులు చదివేవారికి రాధిక గారి కవితలను ప్రత్యేకంగా పరిచయం చెయ్యవలసిన పనిలేదు. స్పందించే హృదయం గల రాధిక గారు వ్యాఖ్యలు రాయని బ్లాగూ ఉండదు. చాన్నాళ్ళ తర్వాత రాధిక గారు పొద్దుకు పంపిన కవిత “ఈ తరం”: ————— అలారం మోతలతో అలసట తీరకనే ఉలికిపాటు మెలకువలు అలసిన మనసులతో కలల కమ్మదనమెరుగని కలత … Continue reading

Posted in కవిత్వం | 5 Comments