Category Archives: కవిత్వం

అభినవ భువనవిజయము -3- కోకిల కంఠము విప్పి పాడగన్

(<< గత భాగము) ‹కొత్తపాళీ› గిరిధర మహాశయా, ఇంకో సమస్య… కోడిని తిన్నవాడు తన కోకిల కంఠము విప్పి పాడగన్ ‹గిరి› కొత్తపాళీ గారు, నన్ను ఈ సమస్య చాలా కష్టపెట్టిందండీ ఉ. పాడగ పాటగాడు అలవాటుగ పాటలు వంటవండుతూ, మాడెను కోడికూర, రుచి మాడెను, మాడు ముఖమ్ము వేసెగా కోడిని తిన్నవాడు, తన కోకిల … Continue reading

Posted in కవిత్వం | Tagged | Comments Off on అభినవ భువనవిజయము -3- కోకిల కంఠము విప్పి పాడగన్

అభినవ భువనవిజయము -2- నరవర నిన్నుబోలు లలనామణి

(<< గత భాగము) ‹కొత్తపాళీ› గిరిధర కవీంద్రా, ఈ సమస్య నెత్తుకోండి: “నరవర నిన్నుబోలు లలనామణి నెందును గానమీ యిలన్” ‹గిరి› కొత్తపాళీగారూ ఇదిగో చం. విరటుని కొల్వులో వలలుఁ వేషము వేసిన, ఓ మహా బలీ, తరుణిని కావ కీచకుని నైల్యమునుండి, ధరించి చీరలన్ మరుగున నిల్వ, పెచ్చెనట వాంఛలు వానికి, నీవు కాంతవే? … Continue reading

Posted in కవిత్వం | Tagged | Comments Off on అభినవ భువనవిజయము -2- నరవర నిన్నుబోలు లలనామణి

అభినవ భువనవిజయము -1- ప్రార్థనతో ప్రారంభము

ప్రియమయిన పాఠకమహాశయులారా, ఆ ప్రకారముగా… ఈ అభినవ భువనవిజయములో పాల్గొన్న కవులలో దాదాపు అందరూ కొత్తగా ఛందస్సును తెలుసుకొని, పద్యరచన నభ్యసిస్తున్న విద్యార్థులేయైనా, ఆశువుగా పద్యం చెప్పగల సమర్థులు వీరిలో లేకపోలేదు. అయితే, మంచి నాణ్యమైన పద్యాలను సృష్టించగల సౌలభ్యం కోసం కవులందరికీ కొద్ది రోజుల సమయం ఇవ్వబడింది. తామల్లిన పద్యాలతో ఒకరిద్దరి మినహా కవులందరూ … Continue reading

Posted in కవిత్వం | Tagged | 3 Comments

అభినవ భువనవిజయము – అంతర్జాలములో అపూర్వ కవిసమ్మేళనము

–రానారె గత రెండేళ్లుగా బ్లాగావరణం అనుకూలించడంతో పలుప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీగానే పద్యాల వర్షాలు కురుస్తున్నాయన్న సంగతి పాఠక శ్రేష్ఠులైన తమకు తెలిసిందే. చెదురుమదురుగా కురుస్తూవుండిన ఈ వర్షాలకు సర్వధారి ఉగాది ఋతుపవనాల ఆగమనంతో కొత్త ఉత్సాహం తోడయింది. సరిగ్గా నెల రోజుల క్రితం నాతో – “ఈ పద్య కవులతో ఓ భువన … Continue reading

Posted in కవిత్వం | Tagged , , | 6 Comments

విరహ విలాపాలేల రా…

ఆయన కవితలు చెప్పగలరు, కార్టూన్లూ వెయ్యగలరు, (గిత్తోడి) కథలూ చెప్పగలరు. సాఫ్టువేరు కోడింగు, డీకోడింగు, బగ్గింగు, డీబగ్గింగుల సంగతి సరేసరి!

అయితే ఈ సాఫ్టువేరు స్కిల్సును తన కంపెనీకి ఇచ్చేసి, సాఫ్టు స్కిల్సును మాత్రం దాచేసుకున్నారు. ఈ మధ్యే.. వెలికి తీయడం మొదలెట్టారు. అలా బయటపడినదే చక్కగా పాడుకోదగ్గ పాటలాంటి, పూతరేక్ లాంటి ఈ కవిత – “విరహ విలాపాలేలరా…”. Continue reading

Posted in కవిత్వం | 3 Comments

ఒక్క చుక్క నీళ్ళు లేకపాయె!

చినుకు కోసం రైతు చూసే ఎదురుచూపుల వ్యథను వివరిస్తున్నారు జోగధేను స్వరూప్ కృష్ణ తమ “ఒక్క చుక్క నీళ్ళు లేకపాయె” కవితలో. Continue reading

Posted in కవిత్వం | 11 Comments

ఆ దారి

-అసూర్యంపశ్య . నువ్వూ నేనూ అప్పుడెప్పుడో కలిసెళ్ళిన దారి ఒంటరిగా వెళితే కొత్తగా తోచింది పాత గుర్తులు మాయమైతే నువ్వు తీసుకెళ్ళావనుకున్నాను నేస్తం! అక్కడి గాలుల్లో చిక్కుకున్న అప్పటి మాటలు ఒక్కొక్కటే వచ్చి పలకరించినప్పుడు తెలిసింది నాకు ఇది ఆ దారేనని…. మట్టిలో కలిసిన అప్పటి అడుగులు నేలని పెగుల్చుకుని వచ్చి రోడ్డుపై వేసిన అచ్చులు … Continue reading

Posted in కవిత్వం | 8 Comments

మరో ప్రపంచం కోసం

-గార్ల సురేంద్ర నవీన్ . పరిగెడుతున్నాను….. కష్టాల కొండలు ఎక్కుతూ నిరాశా నదులు దాటుతూ చిమ్మ చీకటికి దూరంగా వెలుతురు కోసం ఆశగా పరిగెడుతున్నాను…… ఆవేదనతో కొట్టుకుంటున్న గుండెతోనూ అలసిపోయి రొప్పుతున్న రొమ్ములతోనూ చెంపల దాహాన్ని తీరుస్తున్న కన్నీళ్ళతోనూ ఎగిసిపడుతున్న బాధను అదిమి పెట్టి దహిస్తున్న ఆలోచనల్ని తొక్కిపట్టి ఇంకా కనిపించని గమ్యం కోసం పరిగెడుతున్నాను…… … Continue reading

Posted in కవిత్వం | 31 Comments

ఊహాతీతం

-కొత్త ఝాన్సీలక్ష్మి . ఓ ఊహ నిజమైతే.. మౌనరాగాలు మధురగానాలు ఆహ్లాదభరితాలు ఆమని సంకేతాలు విరిసిన పారిజాతాలు అమృతాభిషేకాల ఆనందవర్ధనాలు ఓ నిజం తారుమారైతే.. ఈ మౌనరూపాలు మనసంతా గాయాలు శోకసంతప్తాలు సంవేదనాభరితాలు చిట్లిన నరాలు పెట్లిన గాజుపలకలు గుండె గుబుళ్లు బ్రతుకు నెగళ్లు ఎగసిన గాలికి సాగే రాలిన ఆకుల వలయాలు అవినీతి అక్షయ … Continue reading

Posted in కవిత్వం | 8 Comments

సమీప దూరాలు

స్వాతికుమారిగారు ఈ సమీపదూరాలని మాకు పంపినప్పుడు – దీనిని ఏ శీర్షికలో ప్రచురించాలి అనే సమస్య వచ్చింది. కవిత శీర్షికలో వెయ్యాలంటే – ఇది కవితగాదు, వ్యాసంలో వెద్దామంటే ఇది వ్యాసమూ గాదు. అలాగని తిరస్కరించడానికీ మనసొప్పలేదు. అందుకని ఆవిడనే అడిగాం – ‘ఏ శీర్షికలో వెయ్యమన్నారు’ అని? దానికావిడ – “రసాత్మకమైన భావమేదైనా కవిత్వమే … Continue reading

Posted in కవిత్వం | 12 Comments