Category Archives: కవిత్వం
నెలవంక
విశ్వకవి రవీంద్రుని నెలవంక కు బ్లాగు కవి రవి గారి స్వేచ్చానువాదం. Continue reading
ఈ చిరునామా వెతికి పెట్టండి
మానవ జాతి చరిత్ర మొదలైన నాటి నుండీ నేటి వరకూ ఎన్నో అమానుషాలూ, అకృత్యాలు ప్రపంచం లో ప్రతి చోటా జరుగుతునే ఉన్నాయి. ఈ క్రమం లో దొరక్కుండా పోయిన ఒక చిరునామా కోసం వెతుకులాట స్వరూప్ కృష్ణ గారి ఈ కవిత లో కనిపిస్తుంది. Continue reading
నీ రాక కోసం..
వసంత ఋతువు కదండీ, ప్రకృతికి వసంతం చైత్రంతోనే వచ్చేసింది. కొన్ని రోజులు గడిచి ఎండలు ముదిరి గ్రీష్మం ఆర్భాటంగా ఫెళ ఫెళమని అడుగిడుతుంటే కొంచెం దిగులుగా ఉండే మాట నిజం. ఐతే మళ్ళీ సరికొత్త వసంత సౌరభాన్ని ఇప్పుడూ అస్వాదించాలనుకుంటే …. నిషిగంధ తాజా కవితను చదవాల్సిందే. Continue reading
జీవితం
అందమైన ఊహల్లో కాసేపు ఉనికి ని మరచి విహరిస్తుంటే వాస్తవ జీవితం సరికొత్తగా పరిచయమవటం స్వాతీ శ్రీపాద గారి “జీవితం” కవితలో చదవండి. Continue reading
అభినవ భువనవిజయము -9- సర్వధారికి సుస్వాగతము
(<< గత భాగము) ‹కొత్తపాళీ› విశ్వామిత్రా .. కొత్త సంవత్సరానికి స్వాగత పద్యం ఏమన్నా చెబుతారా? * రాఘవ సాహిత్యంలో చేరారు ‹విశ్వామిత్ర› చిత్తగించండి సీ. తెలుగింట తొలినాడు పలు రుచులను కల- గలపు పచ్చడందు పులుపు నాది! వనమంత తిరుగాడి తనగొంతు ఎలుగెత్తి బులుపించు పాటకోయిలయు నాది! మదికింపు గలిగించి మరులెన్నొ గురిపించి మన్మధు … Continue reading
అభినవ భువనవిజయము -8- దత్తపది పదకొండు
(<< గత భాగము) ‹కొత్తపాళీ› మరో దత్తపదికి వెళ్లే ముందు… చదువరి, మీరు దీన్నెత్తుకోండి … “మనుజుడై పుట్టి దేవుడు మాయజేసె” ‹చదువరి› తేటగీతి. వెరపు పుట్టించు ట్రాఫికు వెతల దీర్ప మనుజుడై పుట్టి దేవుడు మాయ జేసె భాగ్యనగరాన తన మాయ సాధ్యపడక దారులందు జిక్కి యచటె స్థాణువయ్యె ‹నాగరాజు› చదువరీ – శెభాష్. … Continue reading
అభినవ భువనవిజయము -7- గూగులమ్మ పదాలు
(<< గత భాగము) ‹కొత్తపాళీ› ఇప్పుడు మన భట్టు కవిగారు కొన్ని గూగులమ్మ పదాల్ని రాలుస్తారు. దత్తపదులు ఇవీ: స్పార్కు మార్కు డార్కు డేటు బూటు పాటు తీర్పు నేర్పు కూర్పు మాల్సు కాల్సు ఫాల్సు టెక్కు నిక్కు లుక్కు చెంత చింత వింత ‹కొత్తపాళీ› భట్టుకవి సిద్ధమేనా? ‹భట్టుమూర్తి› ఉర్విజనులకు స్పార్కు నూత్న వర్షపు … Continue reading
అభినవ భువనవిజయము -6- అభినయ తారలు
(<< గత భాగము) ‹కొత్తపాళీ› విశ్వామిత్ర కవులకిది పిలుపు. “చార్మి, ఇలియానా, జెనీలియా, భూమిక”, ఈ నాలుగు పదాలనీ మీకు నచ్చిన ఛందంలో ఒక పొగడ్తగా పద్యం చెప్పండి! * విశ్వామిత్ర ఇక్కడ లేరు (టైమవుట్) ‹కొత్తపాళీ› అరెరే .. విశ్వామిత్రుల వారికి స్టేజి ఫియరుగానీ వచ్చిందా ఏవిటి, సమయానికి? ‹చదువరి› విశ్వామిత్రకు కరెంటు పోయినట్టుంది! … Continue reading
అభినవ భువనవిజయము -5- రాజశేఖరుండు రాజ్యమేలె
(<< గత భాగము) ‹కొత్తపాళీ› చదువరీ మీ పూరణ వినిపిస్తారా? ‹చదువరి› కొత్తపాళీ, అలాగే! అ.వె. ఉదయ భాను రీతి ఉజ్వలమ్ముగ లేచి మేళ్ళు జేతు మనుచు కీళ్ళు విరిచె అస్తమయపు వేళ అవినీతి మసకేయ రాజశేఖరుండు రాజ్యమేలె ‹విశ్వామిత్ర› “ఉదయభాను” – అంటె యాంకరమ్మ కాదు గదా? ‹నాగరాజు› చదువరిగారికి ఎప్పుడూ “పొద్దు” తలంపులే … Continue reading
అభినవ భువనవిజయము -4- మందుగొట్టి మగువ మంచమెక్కె
(<< గత భాగము) ‹కొత్తపాళీ› ఈ మన భట్టుపల్లె మూర్తి కవి … నేను చెప్పడమెందుకు, మీరే ఆలకించండి ‹భట్టుమూర్తి› 🙂 భట్టుపల్లె యనెడి భాగ్యసీమ నాది పట్టుగొమ్మ పసిడి పద్య ములకు అట్టి మట్టి నుండి అంకురించితి గాన భట్టుమూర్తి యండ్రు భావుకముగ ‹గిరి› భట్టుమూర్తి, అదిరింది – ఆటవెలదా? ‹భట్టుమూర్తి› ఔను 😉 … Continue reading