Category Archives: కథ
అతిథి
చలి గజగజ వణికిస్తూంది. బయట ఈదురుగాలి తల తలుపులకేసి బాదుకుంటున్న చప్పుడు గుయ్యిగుయ్యిమని వినిపిస్తూంది. భుజాల చుట్టూ వున్న షాల్‌ని గట్టిగా దగ్గరకి లాక్కున్నాను. చలిమంటకి ఇంకా దగ్గరగా జరిగాను. ఇంత చలిలో, గాలిలో బయట కాకుండా ఇంట్లో సురక్షితంగా, వెచ్చగా వున్నందుకు భగవంతుడికి ధన్యవాదాలు చెప్పుకున్నాను మనసులోనే. Continue reading
నీకోసం
తెలివైనవాడు అవకాశం కోసం ఎదురుచూస్తూ కూర్చోడు. తనే అవకాశాలను సృష్టించుకుంటాడు. మరి తనో గొప్ప మేధావిననుకుంటూ గొప్ప అవకాశం కోసం ఎదురుచూస్తూ వచ్చిన అవకాశాలను కాలదన్నేవాళ్ల తెలివిని ఏమందాం? Continue reading
మంచినీళ్ళ బావి
-అరిపిరాల సత్యప్రసాద్ తెల్లగా తెల్లారాక చివరగా నీళ్ళు తోడుకున్నవాళ్ళు ఎవరైనా సరే ఒక చేద నీళ్ళు తోడి గట్టుమీద పెట్టి వెళ్ళేవాళ్ళు. ఆ పక్కగా పోతున్నవాళ్ళెవరైనా దాహం వేస్తే అక్కడికి వెళ్ళి నాలుగు దోసిళ్ళు ముఖాన కొట్టుకోని, చేద ఎత్తి గడ గడా నీళ్ళు తాగేవాళ్ళు. మళ్ళీ మర్చిపోకుండా నీళ్ళు తోడి గట్టు మీద పెట్టి … Continue reading
వర్డ్ క్యాన్సర్
మేఘమథనం చేస్తే వానొస్తుంది. మరి పదమథనం చేస్తే ఏమొస్తుంది? మురిపించడానికి ముందేదో ఒక స్పెల్‌బీ అవార్డూ, కొన్ని ఆహాఓహోలూ, ఆక్స్‌ఫర్డ్ సర్టిఫికెట్టూ రావొచ్చు. తర్వాత…??? Continue reading
మృతజీవులు – 24
సబాకివిచ్ ఇంట్లో విందారగించి అక్కడ బేరం కుదిరినాక చిచీకవ్, అతడు చెప్పిన ప్లూష్కిన్ ఇంటికి దారి వెదుక్కుంటూ ఒక కొత్త గ్రామం చేరుతాడు. అక్కడ ఆయనకు ప్లూష్కిన్ ఇంటి దగ్గర ఎదురైన అనుభవాలను, ప్లూష్కిన్ స్వరూప స్వభావాలను గురించి ఈ భాగంలో చదవండి. Continue reading
అత్తెసరు – పచ్చిపులుసు
బొత్తిగా అమ్మ చేతి వంటకి అలవాటు పడిన ఆదిత్య, అమెరికా గురించి “అది చాలా గొప్ప దేశమనీ, గాలి చల్లగా హాయిగా ఉంటుందనీ, అందరికీ కార్లు ఉంటాయనీ, అక్కడి వాళ్లకు అన్నీ మిషన్లే అమర్చి పెడతాయనీ చెప్పింది. అక్కడ పసిపిల్లలు కూడా ఇంగ్లీషే మాట్లాడుతారుట! ఇక్కడ మనం ఒక్క డాలరు మార్చితే దోసిలి నిండా రూపాయిలు వస్తాయి కదా!” అనుకునే రవళి. వీళ్ళిద్దరూ కలిసి వండిన “అత్తెసరు పచ్చిపులుసు” Continue reading
చిట్టచివరి స్నేహితుడు
“జీవితాన్ని చూడవలసింది కారిన కన్నీళ్లలో కాదు, చిందిన చిరునవ్వులలో. వయసును కొలవాల్సింది గడచిన సంవత్సరాలతో కాదు, నిలబెట్టుకున్న స్నేహితులతో.” అన్నారు ఆంగ్లంలో ఒక అజ్ఞాతకవి. కోల్పోయినవి పోగా చివరన దొరికిందే అపురూపమా లేక అపురూపమైనదే చిట్టచివర దొరుకుతుందా? స్నేహం విలువను నొక్కి చెప్తూ మెహెర్ రాసిన కథ “చిట్టచివరి స్నేహితుడు”. Continue reading
రాజకీయ రైలు
భారత దేశంలో జరిగే ఎన్నికలలో సగటు వోటరు పోషిస్తున్న పాత్రను వివరించే ఈ కథ సమకాలీన రాజకీయాలపై ఓ వ్యాఖ్యానం. Continue reading
అభ్యుదయం
“ఉద్యమాలంటారు, విప్లవమంటారు, వల్లకాడంటారు – కాని వాస్తవానికొచ్చేసరికి ఏ కాస్త సడలింపునూ సరిపెట్టుకోలేరు. బలం కొద్దీ వ్రాసి పారేస్తే సమాజం మారుతుందా – ముందు మార్పు అనేది ఎవరికి వారు తెచ్చుకోవద్దూ!” అంటూ నిలదీస్తున్నారు స్వాతీ శ్రీపాద “అభ్యుదయం” కథలో. Continue reading
దెయ్యమంటే భయమన్నది…
దయ్యాలెలా ఉంటాయి? రక్త పిశాచాలు మామూలు మనుషులలానే కనబడతాయట, కానీ మనుషుల రక్తం తాగుతాయట. మరి వాటికి దాహమేస్తే అవి మనలను పిలుస్తాయా లేక వాటికో శరీరం అవసరమై పిలుస్తాయా? దయ్యం మనలను పేరుపెట్టి పిలిచినప్పుడు వెళ్ళాలా వద్దా? కొల్లూరి సోమ శంకర్ గారి అనువాదకథ దెయ్యమంటే భయమన్నది… చదివి తెలుసుకోండి. Continue reading