Category Archives: కథ

మృతజీవులు – 28

-కొడవటిగంటి కుటుంబరావు ఏడవ ప్రకరణం ముసలాయన కళ్లుపైకెత్తి , తాపీగా, “క్రయదస్తావేజుల తాలూకు దరఖాస్తులు తీసుకునేది ఇక్కడకాదు,” అన్నాడు. “మరెక్కడ?” “క్రయశాఖలో.” “ఆ క్రయశాఖ ఎక్కడున్నది?” “ఇవాన్ అంతో నవిచ్ బల్ల దగ్గిర.” “ఇవాన్ అంతో నవిచ్ ఎక్కడ?” ముసలాయన మరొక మూలగా వేలు విసిరాడు. చిచీకవ్, మానిలవ్ లు ఇవాన్ అంతోనవిచ్ దగ్గిరికి వెళ్లారు. … Continue reading

Posted in కథ | Tagged , | Comments Off on మృతజీవులు – 28

బతుకు బండి

-పాలగిరి విశ్వప్రసాద్ బ్రతిమాలడం విడిచి పెట్టినాడు. క్షణమాలస్యం చేయకుండా జేబులోని ‘బటన్‌ నైఫ్‌’ ఒత్తినాడు. రౌడీ మాదిరి కనబడే ఆ యువకుని చేతిలో చాకు ప్రత్యక్షమయేసరికి…. ఆ వ్యక్తి వెనక్కు తగ్గడం – అంతమయిపోతోన్న ప్లాట్‌ఫారమ్‌ మీద నుండి సారధి కంపార్ట్‌మెంట్‌లోకి లంఘించడం ఒకే క్షణంలో జరిగిపోయింది. దాదర్‌ ఎక్స్‌ప్రెస్‌ అప్పుడే కదుల్తా ఉంది. ఉరుకులు, … Continue reading

Posted in కథ | Tagged , , , | 1 Comment

మృతజీవులు – 27

-కొడవటిగంటి కుటుంబరావు ఏడవ ప్రకరణం ప్రయాసపడి దీర్ఘ ప్రయాణం చేసి; దారిలో చలీ, వానా, బురదా, మజిలీల్లో అధికార్లను నిద్రలేవగొట్టటమూ, మువ్వల మోతలూ, మరమ్మత్తులూ, తగాదాలూ, బళ్లు తోలేవాళ్లూ, కమ్మరులూ, ఇతర మోసగాళ్లూ వీటితో వేగిన ప్రయాణీకుడు చిట్టచివరకు స్వగృహాన్ని చేరవచ్చేటప్పుడు ఎంతైనా ఆనందం పొందుతాడు. అతని మనోనేత్రం ముందు ఇంటి లోపలిభాగాలూ, సంతోషంగా అరుస్తూ … Continue reading

Posted in కథ | Tagged , | Comments Off on మృతజీవులు – 27

నెరా నెరా నెరబండి

కార్యాలయాల్లో సామాన్యమైపోయిన అవినీతిపై ఓ సామాన్యుని ధర్మాగ్రహం. Continue reading

Posted in కథ | Tagged , , | 10 Comments

“ఒక్కలా”తీతం

— సౌమ్య వి.బి సముద్రాన్ని చూస్తే నాలో ఏవో అలజడులు, అలల్లాగే చెలరేగిపోతూ, తన్నుకువస్తూ ఉంటాయి. “నీళ్ళంటే నీకుండే భయంవల్ల అలా అనిపిస్తుంది” అంటుంది అమ్మ.

Posted in కథ | Tagged , , , | 10 Comments

ఒక అనేకానేక నది… రెండవ మైథునం!

-అభిశప్తుడు పైట జారుతున్నా పట్టని పచ్చి వయ్యారాలు… పిరుదులూపుకుంటూ చిలిపి పరవళ్లు… …ప్రళయకావేరి నాదా…? పోనీ నీదా?

Posted in కథ | Tagged , , , , | 17 Comments

మృతజీవులు – 26

-కొడవటిగంటి కుటుంబరావు “ఒక్కసారి చూడండి బాబూ, వాడి మొద్దు మొహం! కొయ్యదుంగ కెంత తెలివి ఉంటుందో వీడికీ అంతే! కాని అలా ఏదన్నా ఉంచారో, క్షణంలో కాజేస్తాడు! ఎందుకొచ్చావురా వెధవా, ఎందుకొచ్చావంట?” అంటూ ఆయన ఆగాడు. పోష్క కూడా మౌనంతోనే సమాధానం చెప్పాడు.

Posted in కథ | Tagged , | Comments Off on మృతజీవులు – 26

మృతజీవులు – 25

అయితే ఒకప్పుడీ మనిషి ఎస్టేటును చాలా శ్రద్ధగా నిర్వహించినవాడు! ఆయనకు పెళ్ళి అయింది, పిల్లలున్నారు, చుట్టుపక్కల వాళ్ళు ఆయన ఇంటికి అతిధులుగా వచ్చి ఎస్టేట్లను పొదుపుగా నిర్వహించే పద్ధతులు తెలుసుకునేవారు. Continue reading

Posted in కథ | Tagged | 1 Comment

ఆవృతం

బాల్కనీ రెయిలింగ్ మీద రెండు చేతులూ ఆన్చి, నిలబడి చూస్తూ ఉంటే చక్కగా తీర్చిదిద్దిన వెనకింటివాళ్ల తోట కనిపిస్తూంది. సాయంకాలపు నీరెండలో ఆ తోటలో విరిసిన పూవులన్నీ మెరుస్తూ గాలి తెమ్మెరలు వచ్చినప్పుడల్లా తలలు ఊపుతున్నాయి. Continue reading

Posted in కథ | 15 Comments

వానా వానా వల్లప్పా!

-వెంపటి హేమ చుట్టూ ఉన్న నేల బంగన బయలు కావడంతో, ఎండపడి బొగులు బొగులుమంటూ నిప్పులు చెరుగుతోంది అప్పుడే! ఆ ఎండలో దూరాన ఏదో తెల్లగా మెరుస్తూ తన దృష్టిని ఆకర్షించడంతో తాత చెయ్యి విడిపించుకుని సిద్దూ ముందుకు పరుగెత్తాడు. అలవాటుగా చెయ్యి ఓరజేసుకుని, తల పైకెత్తి ఆకాశాన్ని పరికించి చూసి, గాఢంగా నిట్టూర్చాడు బంగారప్ప.

Posted in కథ | Tagged | 3 Comments