Category Archives: కథ
చివ్వరి చరణం
– శ్రీరమణ “ఇట్నించి పొద్దున ఫ్లైట్ లేదు. అట్నించి మర్నాడు సాయంత్రం గాని లేదు. సో, ప్రయాణంలో రెండ్రోజులు. . . అంటే యిక్కడ కనీసం పది రికార్డింగులు ఆగిపోతాయి. పైగా అక్కడ గాలిమార్పు, తిండిమార్పు, స్ట్రెయిను సరే సరి. మీరేమో యీ అంకెకే ‘అమ్మో’ అంటున్నారు. అంతకు తగ్గితే నాకు వర్కౌట్ కాదు,” రికార్డింగ్ … Continue reading
మృతజీవులు – 31
-కొడవటిగంటి కుటుంబరావు తొమ్మిదవ ప్రకరణం ఉదయాన, ఆ నగరంలో ఒకరినొకరు చూడబోవటానికి ఏర్పాటై ఉన్న వేళ ఇంకా కాకముందే, ఒక స్త్రీ పసందయిన గళ్ళ పైదుస్తు కప్పుకుని, నీలం రంగు గల స్తంభాలూ, వంగపండు రంగు పూతా కలిగిన ఒక ఇంట్లో నుంచి గబగబా వెలువడింది. ఆమె వెంట ఒక బంట్రోతు ఉన్నాడు, వాడి టోపీకి … Continue reading
కాళ్లు పరాంకుశం
నా రాజమండ్రి ప్రయాణానికి మా ఇంట్లో పాత, కొత్త సామెతల మేలు కలయిక రివాజు. ”పని లేని బార్బర్‌కి పిల్లి తల. నీకు రాజమండ్రి” అంది బామ్మ. ”పుల్లయ్యకి వేమవరం. నీకు రాజమండ్రి. అన్నట్ల వేమవరం రాజమండ్రికి దగ్గిరే కదా! పని లేకపోవడంలో పని లేకపోవడంగా ఓ సారి వేమవరం కూడ వెళ్లొచ్చేయ్” అంది అమ్మ. … Continue reading
మృతజీవులు – 30
ఈ లోపల తనకు లేఖరాసిన యువతీమణిని ఎంతమాత్రమూ గుర్తించలేక తికమక పడ్డాడు. అతను తీక్షణంగా చూడటంలో అవతల స్త్రీలుకూడా దీనమానవుడి హృదయంలో తీయనైన బాధ రేకెత్తించ జాలిన చూపులు పరవటం కానవచ్చింది. అతను చివరకు, “ఉఁహు! ఊహించటానికి లేదు!” అనుకున్నాడు. అయితే ఇందువల్ల అతని ఉల్లాసం భంగంకాలేదు. అతను విశృంఖలంగా కొంతమంది స్త్రీలతో సరసోక్తులాడుతూ అండుగులో … Continue reading
బెల్లం టీ
-నెమలికన్ను మురళి చిన్నప్పుడు నన్ను ‘మనవడా’ అనీ, నేను కొంచం పెద్దయ్యాక ‘మనవడ గారా..’ అనీ పిలిచేది. నేనేమో ఆవిణ్ణి మరీ పసితనంలో ‘వెంకాయమ్మా..’ అనీ కొంచం జ్ఞానం వచ్చాక ‘నానమ్మ గారూ..’ అనీ పిల్చేవాడిని. “బాబూ.. మొహం కడుక్కుని రా. తల దువ్వుతాను. నాన్నగారు నిన్ను వెంకాయమ్మ గారింటికి తీసుకెళ్తారుట…” తల దువ్వించుకోవడం నాకు … Continue reading
ఒక చిన్నబడ్జెట్ కథ
అమ్మాయిలిద్దరూ ఒకే కాకరొత్తిని ఒలింపిక్ జ్యోతిని పట్టుకున్నట్టు పట్టుకుని రోడ్డు మధ్యలో ఉంచిన చిచ్చుబుడ్డి వైపు నడుస్తున్నారు. వారి వెనకాలే ఒక పెద్దాయన – వాళ్ళ నాన్ననుకుంటా – చేతిలో cease fire సిలిండర్ పట్టుకుని నుంచున్నాడు. అమ్మాయిలు వెలుగుతున్న కాకరొత్తిని మెల్లిగా చిచ్చుబుడ్డి దగ్గరకు తీసుకెళ్ళారు. Continue reading
ఆమె… ఓ ఆల్కెమీ!
-‘నానీ’ తెలీడానికి చూడడమెందుకు? చూస్తే ఏం తెలుస్తుంది? ఎన్ని జన్మల నుంచి, కలలలోంచి వెదుకుతున్నావు నాకోసం నువ్వు… -ఊర్వశి *** *** *** *** నాకు తెలిసి, మా తెనాలి అమ్మాయిలు బహుశా ఆంధ్రదేశంలోనే ఒక జనరేషన్ ముందుంటారనుకుంటాను. ఒక తరం ముందే సైకిళ్లు తొక్కాం, ఓణీల మీద ఒంపులారబోయకుండా,.. ఆమె ఏమంత పరిచయం లేదు … Continue reading
మృతజీవులు – 29
-కొడవటిగంటి కుటుంబరావు ఎనిమిదవ ప్రకరణం చిచీకవ్ చేసిన క్రయం గురించి మాట్లాడుకున్నారు. నగరంలో చర్చలు జరిగాయి. ఒకచోటకొన్న కమతగాళ్లని మరొకచోటికి తరలించటం లాభసాటి బేరము కాదా అన్న విషయమై ఎవరికి తోచినట్టు వారు చెప్పారు. వాగ్వాదాల ధోరణినిబట్టి చాలామందికీ విషయం క్షుణ్ణంగా తెలిసినట్టు స్పష్టమయింది. “అది సరి అయిన పనేలెండి. ఇది మాత్రం నిజం: దక్షిణాది … Continue reading
చేతులారా..
జాతకాలను పోల్చి వైవాహిక జీవిత మనుగడను అంచనా వెయ్యగల జ్యోతిష్యుడు, తన కుమార్తె జాతకాన్ని ఎలా అంచనా వేసాడు? Continue reading
దాపుడు కోక
— కేతు విశ్వనాథ రెడ్డి గత జనవరిలో కేతు విశ్వనాథరెడ్డి గారికి అజో-విభొ ప్రతిభామూర్తి పురస్కార ప్రదానోత్సవం జరిగిన సందర్భంగా పొద్దులో కేతు దంపతులతో ఇంటర్వ్యూ ప్రచురించిన విషయం పాఠకులకు గుర్తుండే ఉంటుంది. విశ్వనాథరెడ్డి గారి కథల్లో తనకు బాగా నచ్చిన కథ దాపుడుకోక అని శ్రీమతి కేతు పద్మావతి గారు ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. … Continue reading