Author Archives: సంపాదకుడు
బ్లాగు సమీక్ష – తెలుగు జాతీయవాది
మా రెండో బ్లాగు సమీక్ష మీ ముందుకు తెచ్చాం. తెలుగు బ్లాగుల్లో తెలుగు జాతీయవాది విలక్షణమైన భావాలతో ప్రసిద్ధి చెందింది. ఈ సమీక్షపై పాఠకుల అభిప్రాయాలకై ఎదురు చూస్తాం. -పొద్దు
సుధీర్ కవిత
నిన్న ప్రకటించినట్లే ఈరోజు సుధీర్ రాసిన ‘నరుడు’ కవితను వెలువరిస్తున్నాం. ఈ వారంలో వాతావరణం చలిచలిగా ఉన్నా పొద్దు మాత్రం చురుగ్గానే ఉంది. మొన్న కబుర్లు, నిన్న సినిమా వ్యాసం, ఈరోజు కవిత… రేపు బ్లాగుసమీక్షతో మీ ముందుంటాం. తర్వాత…మరిన్ని వెలుగులు పంచబోతోంది మీ –పొద్దు
సినిమా వ్యాసం రెండో భాగం
ముందుగా ప్రకటించినట్లే ఈరోజు సుగాత్రి రాసిన సినిమా వ్యాసం రెండో భాగం వెలువరిస్తున్నాం. గత నెలలో సినిమాల గురించి సుగాత్రి రాసిన పరిచయ వ్యాసం పొద్దు పాఠకులకు గుర్తుండే ఉంటుంది. ఈ వ్యాసం దానికి కొనసాగింపు. గతవారం పుస్తక సమీక్ష వెలువరించిన తర్వాత ఈ వారాంతంలో కొత్తగా పోగుపడిన “కబుర్లు” వెలుగుచూశాయి. ఈ రెండు శీర్షికల … Continue reading
పుస్తక సమీక్ష
తాజా విశేషం: కబుర్లు ముందుగా ప్రకటించినట్లే పొద్దు పాఠకుల కోసం ఒక మంచి పుస్తకం (మహమ్మద్ ఖదీర్ బాబు రాసిన దర్గా మిట్ట కథలు) పై ఒక మంచి పాఠకుడు (సుధాకర్) రాసిన సమీక్షను అందిస్తున్నాం. వారం, వర్జ్యం చూసుకోకుండా వచ్చిన ఆలోచనను వచ్చినట్లు రాసేసే “బ్లాగు మనస్తత్వం” వల్ల పొద్దులో సిద్ధమైన రచనలను వెంటనే … Continue reading
కవితావిభాగానికి పొద్దుపొడుపు
ఈ రోజు పొద్దులో కవితావిభాగానికి పొద్దుపొడుపు అని తెలుపడానికి సంతోషిస్తున్నాం. తెలుగు బ్లాగులు చదివేవారికి రాధిక గారి కవితలను ప్రత్యేకంగా పరిచయం చెయ్యవలసిన పనిలేదు. స్పందించే హృదయం గల రాధిక గారు వ్యాఖ్యలు రాయని బ్లాగూ ఉండదు. చరసాల బ్లాగులో ఉత్తరాల టపాను చదివి ఉత్తరాల మీద ఆమె రెండు కవితలు రాశారు. పొద్దులో తొలికవిత … Continue reading
తెలుగు వికీపీడియా – రవి వైజాసత్య
రవి వైజాసత్య – తెలుగు నెజ్జనుల్లోకెల్లా అత్యంత ప్రముఖుల్లో ఒకరు. తెలుగు వికీపీడియా అనగానే జ్ఞప్తికి వచ్చే మొట్ట మొదటి వ్యక్తి ఈయనే! వికీపీడియాకు నేటి కళా, శోభా రావడానికి ప్రధాన కారకుడు! తెలుగు వికీకి ఓ స్థాయిని ఊహించి, సాధించిన వ్యక్తి. కొత్త వికీపీడియనులను ప్రోత్సహిస్తూ, వారు మంచి వ్యాసాలు రాయడానికి మార్గ దర్శకుడయ్యాడు. … Continue reading
డిసెంబరు నెలలో:
స్వాగతం: అతిథి: -రానారె (బ్లాగు) వ్యాసాలు: మసకతర్కం -త్రివిక్రమ్ (బ్లాగు) బ్లాగు: 1. బ్లాగుద్యమం -చదువరి (బ్లాగు) 2. సూటిగా, వాడిగా, నిక్కచ్చిగా, నిర్మొహమాటంగా – చరసాల ప్రసాద్ -చదువరి (బ్లాగు) 3. నేనెందుకు బ్లాగుతున్నాను? -కొవ్వలి సత్యసాయి (బ్లాగు) కబుర్లు: సినిమా: -సుగాత్రి (బ్లాగు) సినిమా-ఒక పరిచయం సమీక్ష: చుక్కపొడిచింది వికీ: వికీపీడియా – … Continue reading
వినదగు కొవ్వలి చెప్పిన..
నేనెందుకు బ్లాగుతున్నాను అంటూ ప్రముఖ బ్లాగరి కొవ్వలి సత్యసాయి గారు చెబుతున్నారు. మంచి భావాలకు, చక్కటి భావప్రకటనకు చిరునామా, కొవ్వలి వారి బ్లాగు! వారేమంటున్నారో చూడండి, మీరేమంటారో రాయండి. మరి.., మీరెందుకు బ్లాగుతున్నారో కూడా మాకు రాయండి. త్వరలో.. మరో ప్రముఖ నెజ్జనుడు పంపిన వ్యాసం – జనవరి 2న మీకోసం
కొత్త వ్యాసం – వికీపీడియా
అనుకున్నట్లుగానే వికీపీడియాపై ఓ కొత్త వ్యాసాన్ని సమర్పిస్తున్నాం. వికీ వ్యాప్తిలో ఈ వ్యాసం తనవంతు సాయం అందిస్తుందని ఆశిస్తున్నాం. ఇకపై ప్రతీ నెలా వికీలో వచ్చిన విశేషాల వివరాలను ఈ పేజీలో ప్రచురిస్తాము. వికీపీడియా వ్యాప్తి కోసం హైదరాబాదు బ్లాగరులు, వికీపీడియనుల బృందం తమ వంతుగా ఒక పుస్తకాన్ని ముద్రించి డిసెంబరు 31, జనవరి 1 … Continue reading
ఎందరో మహానుభావులు..
తొలి పొద్దును ఆదరించిన నెజ్జనులకు కృతజ్ఞతలు. పొద్దును ఆశీర్వదిస్తూ చాలా సందేశాలు వచ్చాయి. మీ అందరి ఆశీస్సులు మమ్మల్నెంతగానో ఉత్సాహపరచాయి. ఈ ఉత్సాహమే ఇంధనంగా పొద్దును మరింత మెరుగుపరుస్తూ, మీ అభిమానాన్ని పొందేందుకు కృషి చేస్తామని విన్నవించుకుంటున్నాము. మేము చెప్పినట్లుగానే బ్లాగు సమీక్షను పేజీకెక్కించాము. చరసాల ప్రసాద్ అంతరంగాన్ని ఆవిష్కరించే అంతరంగం ను సమీక్షించాము. మీ … Continue reading