Author Archives: సంపాదకుడు
గడి నింపితే బహుమతి!
ఈసారి వికీ శీర్షికలో రవి వైజాసత్య వికీపీడియాతోబాటే వికీ సాఫ్టువేరుపై ఆధారపడి పనిచేసే ఇతర వికీమీడియా ప్రాజెక్టులైన విక్షనరీ, వికీసోర్స్, వికీవ్యాఖ్య (wikiquote), వికీబుక్స్ ల గురించి వివరిస్తున్నారు. ఈనెల గడికి రెండు ప్రత్యేకతలున్నాయి. ఈ గడిని కూర్చినది భైరవభట్ల కామేశ్వరరావు గారు కావడం ఒక విశేషమైతే ఈ గడిని తప్పుల్లేకుండా పూరించినవారికి ఒక బహుమతిని … Continue reading
రాష్ట్రావతరణ దినోత్సవ శుభాకాంక్షలు!!
పొద్దు పాఠకులందరికీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రావతరణ దినోత్సవ శుభాకాంక్షలు. పొద్దులో ప్రారంభసంచిక నుంచి మూడు నెలలపాటు సినిమా శీర్షిక నిర్వహించిన సుగాత్రి ఈ నెల అతిథి. అతిథి వ్యాసంతోబాటు చందుపట్ల శ్రీధర్ గారి కార్పొరేట్ ఆ(కా)సుపత్రి కవిత కూడా అందిస్తున్నాం. ఈ నెల రచనలు: కౌంతేయులు (అతిథి) కార్పొరేట్ ఆ(కా)సుపత్రి! (కవిత) మరిన్ని విశేషాలు త్వరలో… … Continue reading
కొడవటిగంటి కుటుంబరావుగారి జయంతి
ఈరోజు ప్రసిద్ధ రచయిత కొడవటిగంటి కుటుంబరావుగారి జయంతి సందర్భంగా ఆయన కథల్లోని వాస్తవికత గురించి ప్రముఖ రచయిత్రి, కాలమిస్ట్, అనువాదకురాలు శారదగారి వ్యాసం అందిస్తున్నాం. దాంతోబాటే యథావిధిగా కొ.కు. గారి అనువాదరచన మృతజీవులు తొమ్మిదో భాగంతోబాటు హృశీకేశ్ పండా రాసిన ఒరియా కథ Bonsai కి ప్రముఖ అనువాదకుడు, తెలుగుబ్లాగరి అయిన కొల్లూరి సోమశంకర్ గారి … Continue reading
ఈ సంచికలో
పొద్దులో గడికోసం ఆసక్తిగా ఎదురుచూసే పాఠకులు ఈసారి ఎక్కువరోజులు వేచి ఉండవలసి వచ్చినా ఈనెల గడి వారిని సంతృప్తిపరచగలదని ఆశిస్తున్నాం. గళ్లనుడికట్లంటే విపరీతమైన ఆసక్తిచూపే ప్రముఖ రచయిత్రి లలితాముఖర్జీ గారు సంగీతంతో ముడిపడి ఉన్న ఆధారాలు కొన్నింటిని పొద్దుకు పంపారు. వాటిని ఈ గడిలో ఉపయోగించడం జరిగింది. వీలువెంబడి బ్లాగు గడి, వికీ గడి, సినిమా … Continue reading
ఈనెల రచనలు
ప్రసిద్ధ పాత్రికేయుడు, నెల్లుట్ల వేణుగోపాలరావు ఈనెల పొద్దు అతిథి. సమకాలీన సామాజిక రాజకీయ విషయాలపై విమర్శనాత్మక వ్యాసాలు రాసే వేణుగోపాల్, నెజ్జనులు చెయ్యగలిగిన పనులను సూచిస్తున్నారు. ఆయన కడలితరగ పేరుతో బ్లాగును నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రజ్యోతి దినపత్రికలో “వర్తమానం” శీర్షికన వ్యాసాలు రాస్తున్నారు. అతిథి వ్యాసం రాసేందుకు పొద్దు అభ్యర్ధనను మన్నించి ఈ వ్యాసాన్ని రాసి … Continue reading
నెజ్జనులకు సూచనలు
కొండొకచో ఆ అభివ్యక్తిలో అనుచితమయిన వ్యక్తీకరణలూ, అసంపూర్ణ భావాలూ కూడ వస్తూ ఉండవచ్చును. కాని ఆ అభ్యంతరాలను మించి చూడవలసిన విషయమేమంటే, ఇంతకుముందువరకూ రచన తమకు సంబంధలేని వ్యవహారమని అనుకున్న వర్గాల నుంచి హఠాత్తుగా రచయితలు పుట్టుకొస్తున్నారు. అవి పూర్తి రచనలు కాకపోవచ్చును, కాని రచనా ప్రయత్నాలు. Continue reading
ఈ నెల వ్యాసాలు
కొద్ది వ్యవధి తరువాత సినిమా వ్యాసాన్ని మళ్ళీ ప్రచురిస్తున్నాం. ఈసారి వెంకట్ పల్ప్ ఫిక్షన్ సినిమా గురించి తన శైలిలో వివరిస్తున్నారు. జ్యోతి గారి అక్షర పద్య విన్యాసాలు తిలకించండి. మృతజీవులు ఏడో భాగాన్ని కూడా చదవండి. -పొద్దు ఈ నెల రచనలు: రెండుకాళ్ల మీద మానవ ప్రస్థానం నుడికారము – మరికొన్ని కోణాలు మృతజీవులు … Continue reading
మృతజీవులు-5, కవిత
ఈ వారం మృతజీవులు ఐదో భాగం, తప్పుకో ఇక ఆడలేనని….. అనే కవిత లను ప్రచురిస్తున్నాం. ఆస్వాదించండి. ఈ నెల రచనలు: మన జాతీయ కళారూపాల సంరక్షణ (అతిథి) డిటో, డిటో (కవిత) కడప కథ (సమీక్ష) టైమ్ మెషిన్ (సరదా) నిత్యాన్వేషణే జీవితం (కవిత) గతనెలలో తెలుగువికీపీడియా (వికీ) గడి (గడి) జూలై గడి … Continue reading
కొ.కు. వర్ధంతి
[1950లలో కుటుంబరావు] “ప్రకృతి రహస్యాలను వివరించలేనిది శాస్త్రం కాదు; జీవితంలోని కష్టాల్ని తీర్చలేనిది ఆవిష్కరణా కాదు; జీవితంలోని ప్రతీ కోణాన్ని చూపించలేనిది సాహిత్యమే కాదు” అనే స్థిరాభిప్రాయంతో విరివిగా సాహితీసృజన చేసిన అభ్యుదయగామి కొడవటిగంటి కుటుంబరావు (28 అక్టోబర్ 1909 – 17 ఆగష్టు 1980) గారి వర్ధంతి నేడు. ఈ సందర్భంగా ఆయన అభిరుచులు, … Continue reading
ఆంధ్రలో స్వాతంత్ర్యోద్యమ ఘట్టాలు
పొద్దు పాఠకులందరికీ స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు!! అరవైయవ స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో స్వాతంత్ర్యోద్యమంలో భాగంగా జరిగిన కొన్ని ఘట్టాలను మీ ముందుకు తెస్తున్నాం. 1930లలో జరిగిన సంఘటనలకు సంబంధించి ఈ వ్యాసంలో ఉన్న సమాచారం హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో PhD చేస్తున్న వుల్లి ధనరాజ్ గారు సమర్పించిన ఎమ్.ఫిల్. పరిశోధనాపత్రం (dissertation) లో నుంచి తీసుకోవడం … Continue reading