సౌష్ఠవ (సిమెట్రికల్) గడి కావాలని గతంలో కొందరు గడి ప్రియులు సూచించారు. అలా ఇవ్వడానికి బేసి సంఖ్య గళ్ళు అయితేనే బావుంటుందని భావించిన కామేశ్వరరావు గారు ఈ సారి చాలావరకూ (అంటే మొదటి 11 కాలమ్స్) సౌష్ఠవంగా ఉండేట్టు ఇచ్చారు. అంతేకాకుండా స్లిప్పువీరుల ఉత్సాహం గమనించి ఈసారి గడిలో ప్రత్యేకించి వారికోసమే అన్నట్లుగా టెంకాయలు రాశులు పోశారు. యథాశక్తి పగలగొట్టి పండగ చేసుకోండి. 🙂
2009 జూలై గడిపై మీ అభిప్రాయం ఇక్కడ రాయండి.
– పొద్దు
కూర్పరి, భైరవభట్ల కామేశ్వరరావు మాట:
ఈనెల గడిలో ఒక కీలక పదం తక్కిన వాటితో సంబంధం లేనిది ఉంది. అది ఒక row అంతాను. దానికి ఆధారం కూడా విడిగా ఉంది. కాబట్టి అసలు గడి 11×12 అన్నమాట.
కీలక పదంలో ఒకో అక్షరమూ, ఆ columnలో ఏదో ఒక నిలువులోనో అడ్డంలోనో ఉన్న పదంలో లోపించిన అక్షరం అవుతుంది. నిలువు పదంలో అక్షరం లోపిస్తే అది ఆ పదంలో ఎన్నో అక్షరమైనా అయ్యుండవచ్చు. అడ్డంలో లోపిస్తే మాత్రం అది మొదటి అక్షరమే అవుతుంది (కొంత సులువుగా ఉండేందుకు).
ఉదాహరణకి కీలక పదం “గోరొంక గూటికే చేరావు చిలక” అయితే (ఇప్పుడిచ్చింది ఇది కాదనుకోండి :-)), మొదటి columnలో ఏదో ఒక నిలువులో క్లూకి “గోమేధికము” అనే పదం సమాధానం కావచ్చు. కాని అక్కడ నాలుగక్షరాలే ఉంటాయి. అంచేత “గో” అన్నది కీలక పదంలో మొదటి అక్షరంగా వేసుకొని, “మేధికము” అన్నది నిలువు పదంలో వేసుకోవాలి. అలాగే మిగతా అక్షరాలు.
కీలక పదానికి (42 అడ్డం)ఆధారం: హనుమంతుడంతటివాడు యుద్ధాసక్తితో సుందరంగా వర్ణించిన నగరాన్ని దర్శించాలని ఎందుకుండదు?
One Response to జూలై గడిపై మీమాట