కన్నులు

పింగళి శశిధర్

కన్నులు వుండు
నందరకు
కాని –
కమనీయ మనోజ్ఞ మాలికల్
కలువలు పూయు
కన్ను లవి యెన్ని ?
ఎన్నిటి నందు – సు
స్నేహ రసార్ద్రతలున్నవి ?
వెన్నెల లెన్ని కాయు ?
వలపు విచిత్ర
భాషణ లెన్ని యెఱుంగు ?
ఇన్నిట నొక్కటైన – నెఱి
నేర్వని కన్నులు
కన్నులౌనె ?
రమ్య రసజ్ఞ గుణ
శేఖరు లార
నిక్కము మీరె తెల్పరే!

About పింగళి శశిధర్

హైదరాబాదులో నివసిస్తున్న పింగళి శశిధర్ గారు ప్రైవేటు కంపెనీలో ఐటీ విభాగంలో పనిచేస్తున్నారు.
This entry was posted in కవిత్వం and tagged . Bookmark the permalink.

4 Responses to కన్నులు

  1. Pingback: కన్నులు « పింగళి

Comments are closed.