శీతాకాలపు సాయంత్రం
ఆలయ ప్రాంగణంలోని
పచ్చగడ్డిలో కూచున్నాం
అల్లంత దూరంలో వాలిన
తెల్ల కొంగని చూడగానే
ఒక్కసారిగా పాప మనసు
రెక్కలు తొడుక్కుంది
పట్టరాని సంతోషంతో
పరవళ్ళు తొక్కుతుంటే
పచ్చగడ్డిలో పసిపాదాల
ముచ్చటైన సవ్వడి
చెంగున దూకుతున్న పాపని చూసి
కొంగ చటుక్కున ఎగిరిపోగానే
నింగిలో విహరిస్తున్న పాప మనసు
తిరిగి నేలమీద వాలిపోయింది!
————–
8 Responses to కొంగేదీ?