‹కొత్తపాళీ› ఇప్పుడు మన భట్టు కవిగారు కొన్ని గూగులమ్మ పదాల్ని రాలుస్తారు. దత్తపదులు ఇవీ:
- స్పార్కు మార్కు డార్కు
- డేటు బూటు పాటు
- తీర్పు నేర్పు కూర్పు
- మాల్సు కాల్సు ఫాల్సు
- టెక్కు నిక్కు లుక్కు
- చెంత చింత వింత
‹కొత్తపాళీ› భట్టుకవి సిద్ధమేనా?
‹భట్టుమూర్తి›
నూత్న వర్షపు మార్కు
వుండబోదిక డార్కు
ఓ గూగులమ్మా!
తొడిగి సూటూబూటు
పడతి దొరకుటె పాటు
ఓ గూగులమ్మా!
‹నాగరాజు› భట్టుమూర్తి, మా పాట్లు భలే కనిపెట్టావే, సెభాస్.
‹రాకేశ్వరుడు› మీరు మరీ సార్…
‹విశ్వామిత్ర› ఆ తాతకి జాలపు డేటింగ్ తెలీదేమో; బావుంది
‹భట్టుమూర్తి› ఈ తాతకు తెలుసుగా 🙂 ఇదెలా వుందో చెప్పండి…
పిల్లి జూపిన నేర్పు
బెమ్మ దేవుని కూర్పు
ఓ గూగులమ్మా!
‹నాగరాజు› చాలా బావుంది.
‹విశ్వామిత్ర› చాల బావుంది,
‹చదువరి› ఇది బెస్టు
‹విశ్వామిత్ర› ఇది డేటింగ్‌కి కూడ పనికొస్తుందేమో, తాతకు చెప్పాలి
‹కొత్తపాళీ› విశ్వామిత్ర, 🙂
‹విశ్వామిత్ర› నయా’గారపు’ బావుంది హిందీ అర్థము కూడ. పైగా పోనులో సరసాలు, ఇప్పుడే మొదలు. మయుడికి తెలీదు.
జాలమందున నిక్కు
వేసుకో ఓ లుక్కు
ఓ గూగులమ్మా!
‹భట్టుమూర్తి› (టెక్కు = Grace, charm, elegance) (నిక్కు = అతిశయించుచున్నది, వర్ధిల్లుచున్నది)
‹కొత్తపాళీ› వీవెనుడి టెక్కునిక్కుల మహిమ. బ్లాగు బ్లాగు. భట్టుమూర్తి, చివరిది… చెంత చింత వింత
వర్ణ భేదపు చింత
మనుజ లోకపు వింత
ఓ గూగులమ్మా!
‹రాకేశ్వరుడు› భట్టుమూర్తి, లోకపు అతి విడ్డూరమైన వింతను ముప్పైతొమ్మిదిమాత్రలలో భలే బాగుగా బంధించారు
‹విశ్వామిత్ర› దీని మీద, మూడు వేల సినిమాలు వచ్చి ఉంటాయి, ఒక్కొక్కటీ మూడు గంటలు, ఇలా మూడు ముక్కల్లో చెప్పేది మటుకు భట్టుమూర్తే.
‹భట్టుమూర్తి› ధన్యోస్మి.
(అపరిచిత(!) అతిథులు “మొల్ల” ఆగమనం)
‹విశ్వామిత్ర› భువనవిజయ సభకి మొల్ల రావటం ఇదే తొలిసారి కాదు
‹నాగరాజు› అవును, నిజమే, ఆమె తెనాలి రామలింగడి కాలంలోనిదే కదా?
‹విశ్వామిత్ర› అవునండి
————–
సంకలనం: రానారె
5 Responses to అభినవ భువనవిజయము -7- గూగులమ్మ పదాలు