ఆ దారి

-అసూర్యంపశ్య

.

నువ్వూ నేనూ అప్పుడెప్పుడో కలిసెళ్ళిన దారి

ఒంటరిగా వెళితే కొత్తగా తోచింది

పాత గుర్తులు మాయమైతే

నువ్వు తీసుకెళ్ళావనుకున్నాను నేస్తం!

అక్కడి గాలుల్లో చిక్కుకున్న అప్పటి మాటలు

ఒక్కొక్కటే వచ్చి పలకరించినప్పుడు

తెలిసింది నాకు

ఇది ఆ దారేనని….

మట్టిలో కలిసిన అప్పటి అడుగులు

నేలని పెగుల్చుకుని వచ్చి

రోడ్డుపై వేసిన అచ్చులు చూసాకే

తెలిసింది నేను దారి తప్పలేదని…

—-

“ఆధునిక తెలుగు సాహిత్యపు లోతులను తరచి చూడటానికి ప్రయత్నిస్తున్న ఒక మామూలు నెటిజెన్ ని” అనే అసూర్యంపశ్య తాను కవయిత్రిని కాకపోయినా రకరకాల కారణాల వల్ల కవితలు రాయడానికి ప్రయత్నిస్తానని అంటారు.

About అసూర్యంశ్య

"ఆధునిక తెలుగు సాహిత్యపు లోతులను తరచి చూడటానికి ప్రయత్నిస్తున్న ఒక మామూలు నెటిజెన్ ని" అంటున్న అసూర్యంపశ్య తాను కవయిత్రిని కాకపోయినా రకరకాల కారణాల వల్ల కవితలు రాయడానికి ప్రయత్నిస్తానని అంటున్నారు.
This entry was posted in కవిత్వం. Bookmark the permalink.

8 Responses to ఆ దారి

Comments are closed.