-కొత్త ఝాన్సీలక్ష్మి
| . |
ఓ ఊహ నిజమైతే..
మౌనరాగాలు
మధురగానాలు
ఆహ్లాదభరితాలు
ఆమని సంకేతాలు
విరిసిన పారిజాతాలు
అమృతాభిషేకాల ఆనందవర్ధనాలు
ఓ నిజం తారుమారైతే..
ఈ మౌనరూపాలు
మనసంతా గాయాలు
శోకసంతప్తాలు సంవేదనాభరితాలు
చిట్లిన నరాలు
పెట్లిన గాజుపలకలు
గుండె గుబుళ్లు
బ్రతుకు నెగళ్లు
ఎగసిన గాలికి సాగే
రాలిన ఆకుల వలయాలు
అవినీతి అక్షయ తూణీరాలకు
వసివాడిన జీవన ప్రసూనాలు
ఓ ఊహాతీతం ఎదురైతే..
అంబర చుంబిత
ఆనంద పరవశ
దివిజ గంగా మందహాసం
పరిమళ సురభిళ గళం
ఆ ప్రణవనాదం
ఓ ప్రణయవేదం
విచలిత కాంతిపుంజం
విదళిత క్రాంత దర్శనం
సంభ్రమాశ్చర్య సంజనిత
వ్యక్తావ్యక్త విభ్రమం
|
—-
కొత్త ఝాన్సీలక్ష్మి గారు తన గురించి తాను ఇలా అంటున్నారు: “సామాన్య గృహిణిగా కాలం గడిచిపోయింది. ఒడిదుడుకుల జీవన పయనంలో ప్రశాంత తీరాల్ని వెతుక్కుంటున్న బాటసారిని. ఎపుడో వూహ తలుపు తట్టినపుడు ఈ కలం కాగితాన్ని పరామర్శిస్తుంది. సంగీత సాహిత్యాలంటే మక్కువ. మంచి పుస్తకం చదవాలనేది నా కోరిక.”
About కొత్త ఝాన్సీ

8 Responses to ఊహాతీతం