ఎన్నాళ్ళిలా
ఏడుపులు.. ఓదార్పులు
తప్పుకో ఇక ఆడలేనని
జీవన క్రీడ
ఒప్పుకో ఇక సాగలేనని
ఈ ముళ్ళ బాటఅవ్వ బువ్వ తినలేదని
తాత దగ్గు వినలేనని
చూడలేని అమ్మ కళ్ళూ
నడవలేని నాన్న కాళ్ళూ
ఎన్నాళ్ళీ రోదన రాగం?
ఎన్నాళ్ళీ వేదన రోగం?గంపెడంత బావ ఆశ
తీర్చలేని అక్క గోస
సమాజాల దుర్భిణిలో
సగటోడా ఎన్నాళ్ళుఛీ! ఛీ!
వెళ్ళిపో దూరంగా
సన్యాసం లోకి
సాధువులా ముసుగేసుకో
పిరికిపంద!!
–రవికిరణం (http://ravikiranam.blogspot.com/)
3 Responses to తప్పుకో ఇక ఆడలేనని…..