తప్పుకో ఇక ఆడలేనని…..

ఎన్నాళ్ళిలా
ఏడుపులు.. ఓదార్పులు
తప్పుకో ఇక ఆడలేనని
జీవన క్రీడ
ఒప్పుకో ఇక సాగలేనని
ఈ ముళ్ళ బాట

అవ్వ బువ్వ తినలేదని
తాత దగ్గు వినలేనని
చూడలేని అమ్మ కళ్ళూ
నడవలేని నాన్న కాళ్ళూ
ఎన్నాళ్ళీ రోదన రాగం?
ఎన్నాళ్ళీ వేదన రోగం?

గంపెడంత బావ ఆశ
తీర్చలేని అక్క గోస
సమాజాల దుర్భిణిలో
సగటోడా ఎన్నాళ్ళు

ఛీ! ఛీ!

వెళ్ళిపో దూరంగా
సన్యాసం లోకి
సాధువులా ముసుగేసుకో
పిరికిపంద!!

రవికిరణం (http://ravikiranam.blogspot.com/)

This entry was posted in కవిత్వం. Bookmark the permalink.

3 Responses to తప్పుకో ఇక ఆడలేనని…..

  1. రవికిరణం…. మా కాలేజీ సీనియర్ కిరణాలేనా ఇవి??
    Anyways, జీవన ఆట అన్న పదం ఇక్కడే వింటున్నాను. అంటే…. జిందగీ కా ఖేల్ అనా?

  2. కవి జీవన క్రీడ అని రాసి పంపారు గానీ, టైపు చేసేటపుడు అది ఆటగా పడింది. సరిదిద్దాం. అది పొద్దు టైపరి తప్పుగా గమనించగలరు. పొరపాటుకు చింతిస్తున్నాం.

  3. pradeep says:

    mathu gundi raa bhy nee kavitha jamainchu

Comments are closed.