చిన్నప్పటి నుంచి సంఘసేవ చేయాలని, సమాజానికి మేలు కలిగించే మంచి పనులు చేయాలని ఉన్నా సంకోచాలు, అపోహల వల్ల ఏమీ చేయలేకపోయిన ఓ అమ్మాయి జీవితంలో ఓ మంచి మార్పు రావడానికి వెనుక గల కథా కమామీషు……
ఏమిటో ఈ నెల అతిథి ఉప్పలపాటి ప్రశాంతి వివరిస్తున్నారు.
వి.బి.సౌమ్య అంపశయ్య నవీన్ రచనల గురించి “నేను చదివిన నవీన్” వ్యాసంలో వివరిస్తున్నారు.
గడి శీర్షికలో ప్రొఫెసర్ గారు కూర్చిన జూన్ నెల గడికి విశేష స్పందన లభించింది. ఈ నెల గడి జంట కూర్పరులు కూర్చింది కావడం మరో విశేషం.
ఎర్రకోటను UNESCO World Heritage Site గా గుర్తించిన సందర్భంగా సచిత్రకథనం అదనం.
పొద్దులో మరికొన్ని విశేషాలు:
మే నెలలో బ్లాగు పేరడీల వల్ల బ్లాగు సమీక్షలు వెనుకబడ్డాయి. ఈ నెలలో ఒక ప్రముఖ తెలుగుబ్లాగు సమీక్షతో ఆ శీర్షిక పున:ప్రారంభమౌతుంది. ఇక గతకొన్ని నెలలుగా కదలిక లేని వికీ శీర్షికను ఈ నెలనుంచి తెవికీ అధికారి (Bureaucrat) రవి వైజాసత్య నిర్వహిస్తారని తెలుపడానికి సంతోషిస్తున్నాం. ఇవేకాకుండా ఈ నెలనుంచి ప్రపంచ ప్రసిద్ధి గాంచిన కాల్పనికేతర రచనలను పొద్దు పాఠకులకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నాం.
ఇక కొ.కు. గారి అనువాద రచన మృతజీవులు పట్ల పొద్దు పాఠకులు విశేషమైన ఆసక్తిని కనబరచారు. ఆ రచన తదుపరి భాగాలు ప్రతినెలా రెండవ మరియు నాల్గవ సోమవారాల్లో ప్రచురితమౌతాయి.
ఈ నెల రచనలు:
ఏ నాడైనా అనుకున్నానా కల్లో ఐనా… – 1 (అతిథి)
నేను చదివిన నవీన్ (వ్యాసం)
ఎర్రకోట (వ్యాసం)
గడి (గడి)
ఏ నాడైనా అనుకున్నానా కల్లో ఐనా…- 2 (అతిథి)
మృతజీవులు – 2 (మృతజీవులు)
సారంగపాణికి సామెతల సుమ మాల (సరదా)
తెలుగులో విజ్ఞానసర్వస్వాలు – వికీ ప్రాజెక్టులు (వికీ)
మరిన్ని విశేషాలు త్వరలో…
గత నెల రచనలు:
మృతజీవులు-1 (మృతజీవులు) న్యూవేవ్ సినిమా (సినిమా) చరిత్ర – విజ్ఞానశాస్త్రం (అతిథి) నవతరంగం (సినిమా) గడి (గడి) పుస్తక సమీక్ష (వ్యాసం) ‘గ్యాస్’ సిలిండర్ (సరదా) అంకెలతో పద్య సంకెలలు (వ్యాసం) మరో వనాన్ని స్వప్నిస్తాను (కవిత)
One Response to TMAD, ఎర్రకోట, నవీన్, గడి