ఏక కాలంలో నాలుగు బ్లాగులు రాస్తున్న జ్యోతిగారు అన్ని బ్లాగులూ కలిపి 500 పైచిలుకు జాబులు రాసి తెలుగు బ్లాగరుల్లోకెల్లా విశిష్టతను సంపాదించుకున్నారు. హాస్యం, వినోదం, వంటలు, పాటలు – ఇలా వివిధ అంశాలపై అమితమైన ఆసక్తిని చూపే జ్యోతిగారు పొద్దు పాఠకుల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న సరదా శీర్షికలోని మరో అంకం ఇది. ఆమె ఎక్కుపెట్టిన ప్రశ్నలకు సమాధానాలివ్వడం ఇప్పుడు మీ వంతు.
——————–
ప్రశ్నలు అడగమన్నారుగా! ఐతే కాసుకోండి. ఈ చిత్రానికి విచిత్రమైన డైలాగ్ కొట్టండి. చూద్దాం.

ప్ర. పడ్డవాడెప్పుడు చెడ్డవాడు కాదు అంటారు కదా! మరి పడనివాడు?
జ.
ప్ర.బ్రహ్మచారులు కనిపిస్తారు కాని విష్ణుచారులు, శివచారులు ఎందుకు కనిపించరు?
జ.
ప్ర. అమెరికా వాళ్ళు మొబైల్ ఫోన్ కనిపెట్టారు. జపాన్ వాళ్ళు అందులోకి సిమ్ కార్డుని కనిపెట్టారు. మరి మన వాళ్ళు?
జ.
త్వరపడండి……..
——————–
–జ్యోతి వలబోజు (http://vjyothi.wordpress.com)
9 Responses to సరదా