ఏక కాలంలో నాలుగు బ్లాగులు రాస్తున్న జ్యోతిగారు గత అక్టోబరులో మొదలుపెట్టిన వంటల బ్లాగు మూడు నెలలు తిరక్కుండానే వంద టపాలు పూర్తిచేసుకుంది. హాస్యం, వినోదం, వంటలు, పాటలు – ఇలా వివిధ అంశాలపై అమితమైన ఆసక్తిని చూపే జ్యోతిగారు పొద్దు పాఠకుల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న శీర్షిక: సరదా.
జ్యోతిగారి సరదా బ్లాగు http://vjyothi.wordpress.com/
———————
ఒక సినిమా పాటకు అనుకరణ:
పోను పోనంటూనే పోరడూ పోరడూ
అమెరికా పోయిండే పోరడూ పోరడూ
వద్దు వద్దంటూనే గుంటడూ గుంటడూ
డాలర్ల వెనకురికే గుంటడే గుంటడూ || పోను ||
కంప్యూటర్లే బోగస్సని కుచ్చుటోపి పెడతాయని
కహానీలు ఇన్పించే పోరడు
కలల్లోన తేలిపోతు కోటికి పడగెత్తాలని
కొలంబియా పోయిండే పోరడూ
ఔనా అయ్యో పరేషాన్ అవుతాడే
పాపం పసివాడే పోరడూ || పోను ||
వున్నదేదో అమ్ముకుని ఊరినంత వదులుకుని
వర్జీనియా దారిపట్టే పోరడూ
దిమాఖంత ఖరాభైంది దిగులుచెంది దీనంగా
వీధులెంట తిరిగినాడే పోరడూ
ఔరా అతిగా ఆశపడి అల్లాడెనే
అమెరికాలో ఆంధ్రావాడే పోరడూ || పోను ||
-జ్యోతి వలబోజు (http://vjyothi.wordpress.com)
3 Responses to పాపం ఆంధ్రా పోరడు