కృష్ణదాసకవిరాజు – తన బ్లాగు(http://krsnadasakaviraju.rediffblogs.com/)లో 2004 మే లోనే తెలుగులో రాయడం మొదలుపెట్టిన ఈయన మనకు తెలిసినంతవరకు తెలుగులో మొట్టమొదటి బ్లాగరి. మరో విశేషమేమిటంటే కృష్ణదాసకవిరాజు అనేది ఒక ప్రముఖ తెలుగు బ్లాగరి కలం పేరు. ఫోటో చూస్తున్న మీకు ఆ విషయం వేరే చెప్పనక్ఖర్లేదనుకుంటున్నాం! 🙂
== సత్యా పదం ౧ ==
ఆడనే ఆడక, తందానతానలు మరి మరి
ఈడకేలొచ్చెనో అడగవే చెలీ, మరీ మరీ.
కమలము చేబూని, విలాసము కలవాడై
కమలాక్షి వనుచు, విలాసవతివనుచు
అమల హృదివనుచు, కళావతివనుచు
రమామనోహర వల్లభుడననుచు,
ఆడనే ఆడక, తందానతానలు మరిమరి
ఈడకేలొచ్చెనో అడగవే చెలీ, మరీమరీ
అరుగుచూపవే అలసి ఆగినారేమో!
నీరివ్వవే, దప్పికతో ఆగినారేమో!
దారిచూపవే, దారితప్పినారేమో!
సిరిపతి కేమి తక్కువలే అయినా,
ఆడనే ఆడక, తందానతానలు మరిమరి
ఈడకేలొచ్చెనో అడగవే చెలీ, మరీమరీ
వెన్నెల రాజు వచ్చినాడు పైన,
కన్నెల రాజు ఇంకేల ఉన్నాడో,
వన్నెల దొరసాని సొగసులు చూడక,
ఇన్ని ఇక్కట్లేలనో, పాట్లేలనో మరి!
ఆడనే ఆడక, తందానతానలు మరిమరి
ఈడకేలొచ్చెనో అడగవే చెలీ, మరీమరీ
-కృష్ణదాసకవిరాజు (http://krsnadasakaviraju.rediffblogs.com/)
9 Responses to సత్యా పదం-1