పాత గడుల లింకులు:నవంబరు '09, డిసెంబరు '09, జనవరి'10, మార్చి '10, ఏప్రిల్ '10
Tab ను నొక్కడం ద్వారా పక్కగడికి వెళ్ళవచ్చు. బాణాల కీల ద్వారా కూడా గళ్ళ మధ్య ప్రయాణించవచ్చు. మీ మౌసును అంకె ఉన్న గడిలోకి తీసుకు వెళ్ళగానే సదరు గడికి సంబంధించిన ఆధారం ప్రత్యక్షమయ్యే ఏర్పాటు కూడా ఉంది.
  

XXXX
XXX
XXXXX
XXX
XXXXXX
XXXX
XXXXXX
XXX
XXXXX
XXX
XXXX


ఆధారాలు (గడి)
అడ్డం నిలువు
1వరుసకి ముందు రమ్మంటే వినవా
3కారంగా ఉండే ఉప్పు దీపావళికి పనికొస్తుంది
6వెనక్కి తిరిగితే మాత్రం తమిళ మామ్మగారిని పోల్చుకోవడం ఏపాటి
8అంత గర్వం వద్దనంగా వింటివా మరి శ్రీకుమారా?
9ఎంత పొగరైతే మాత్రం అంత తలతిరుగుడా!
10కేకికా?
12తనకి పేరుతెచ్చే భక్తిగీతమా?
14పరాయివాళ్ళెప్పుడూ చివరదాకా ఉండరు. విలాయతులలో ఉండిపోతారు.
16పతి రక్షణలో ఉన్నామెతో సరసం కూడదు
18కాస్త తడబడినా ఇంచుమించు అదేరామరి!
20మోడ్రన్ అశ్వమేథయాగాల గురించి తెలియకపోతే శ్రీశ్రీ నడగండి
22తలిదండ్రుల హితాన్ని కోరేది కూతురేనట
23ఇల్లు చక్కగానే ఉంటే ఇతనికి అటుకులతో పనుండేదా?
24పసిడిగుడికి పుట్టినిల్లు ఏదో ఉత్తరాన్ని మోసుకొచ్చింది
26లాడుకి ముందు నిప్పుకి వెనకాలా వస్తుంది
28ముళ్ళపూడి ముబారక్ చెప్పిన కతలు
30అహ తనా! అతనికి ఏ అడ్డూ లేదు
31పెన్ను మధ్యలో కొమ్ము మొలిచిందేమిటి!
33తియ్యని రెడ్డిగారు
34సనిపమరిస అంటూ వెనకనుంచి చేసావేం ఆరోహణ?
37చక్కిలములో మీ అదృష్టం దొరుకుతుందేమో వెతకండి
38అంబకి దేవికి కూచిపూడివాళ్ళు ఇలా జాగ్రత్త చెప్తారు
40న్యాయమైన విల్లు ఈ కాలంలో కుంటుతోంది
41వనమాతని సరిగా ప్రార్థిస్తే మనిషికి కావలసిందేమిటో చెపుతుంది
42కనిపించకుండా వినిపించేవాడు
43ఆంధ్రుల హితాన్ని కోరిన తెలుగు మాష్టారు వీరే. నూటికే కాదు కోటికే ఒకడు. అయినా అదే చాలు.
1వంటకి జంట
2విలుకాడు కాలు విరిగ్గొట్టుకున్నాడు. ఇంక వదిలేయ్
3మతం పుచ్చుకుంటే మంచి కబురు వినవచ్చు
4శవాకారములో కనిపించే రాజుగారి బామ్మరిది గురించి శూద్రకుణ్ణే అడగాలి
5ఊర్మిళ నిద్రపోకుండా అయ్యో రామా అంటోంది, ఇదేం చిత్రమో!
6చిన్నప్పడు వేసుకునే సూదిమందుకి అంత వ్యాఖ్యానం దేనికి?
7తాళంచెవి పాతిపెట్టు, ఆ తర్వాత తిరిగ తియ్యి. పేలకపోతే నన్నడుగు
8రజనీకాంతుని సూర్యునిగా మెరిపించే శక్తి మణులలో రత్నానికే ఉంది
11ఎర్ర తామరకి హారమెక్కడినుంచి వచ్చింది?
12ఇంతకీ తిరి తిరిగితేనే ఇంత యశస్సు వస్తుందంటావ్!
13కోదండము రాగమైతే మరి కోదండ రాముడేమవుతాడు? రాగరాజుగారినే అడగండి
15గుఱ్ఱం ఒకటే గంతు వేస్తోంది
17ఇందుగలడందులేడను సందేహము లేదు
19మల్లెపూవు ధరించిన కృష్ణ భక్తురాలా? గోరింటాకు పెట్టుకుందా?
21అందెలెందుకలా చెదిరిపోయాయి?
25ఆ విశ్వనాథుని క్రీడ భలే చతురం కదూ
27పూలను చుట్టుకున్న కాగితపు మిఠాయిలు
29ఆనకట్ట తన ఒట్టు తీసి గట్టున పెట్టి తిరగబడింది!
30అదేమల్లా! ఆది అంతమూ ఆ దేవుడే అంటే వినవేం?
32తెలుగు విల్లులో ఎంత వీలుందో!
33అయిల్ పుల్లింగంటే ఇంతుందా!
35కూతురు కూడా హీరోయినయ్యిందని సమారాధనలో ములిగింది కాబోలీవిడ
36మాంచి మసాలా కూరలాంటి దేవుడికున్న ఒకే ఒక్క గుడి
37సరిగా చూడండి, కవలల్లోని వాడే
38రెట్టించి పలుకగా హాయిగా నవ్వినట్టే
39ఓ కథకుడు పట్టుకు వేళ్ళాడే చెట్టు